Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

TDP Leaders Remanded In EVM Vandalism Case At Palnadu
ఈవీఎంల ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు రిమాండ్‌

సాక్షి, పల్నాడు: ఏపీలో ఎన్నికల సందర్బంగా ఈవీఎం ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు కోర్టు రిమాండ్‌ విధించింది. ఈ క్రమంలో నలుగురు టీడీపీ నేతలకు 14 రోజులు రిమాండ్‌ విధిస్తూ బుధవారం కోర్టు ఆదేశించింది.కాగా, ఏపీలో ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. తుమృకోటలోని 203, 204, 205, 206 పోలింగ్‌ బూత్‌ల్లోని ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు వెంకట సతీష్‌, కోటయ్య, సైదులు, మహేష్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.దీంతో, వారిని కోర్టులో హాజరుపరచగా నలుగురు టీడీపీ నేతలకు 14 రోజులు రిమాండ్‌ విధించింది. అలాగే, మరో 50 మంది టీడీపీ కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కొంతమంది టీడీపీ నేతలు, కార్యకర్తలు అరెస్ట్‌ భయంతో పరారయ్యారు.

TDP Silence Over Chandrababu Foreign Tour
టీడీపీ సైలెన్స్‌.. దేనికి సంకేతం?

ఎన్టీఆర్‌, సాక్షి: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడ?. విదేశీ పర్యటన పేరుతో ఆయన ఎ‍క్కడికి వెళ్లారసలు?. ఎన్నికల ఫలితాల వేళ ఉన్నపళంగా ఎక్కడికి వెళ్లారు?. ఏపీ రాజకీయ వర్గాల్లో.. ఆఖరికి టీడీపీ శ్రేణుల్లోనూ దీనిపైనే చర్చ నడుస్తోంది.నారా చంద్రబాబు నాయుడు.. విదేశీ యాత్రకు విశ్రాంతి కోసం వెళ్లారు!. కాదు కాదు.. 74 ఏళ్ల చంద్రబాబు వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లారు. ఎన్నికల ఫలితాల ముందర కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకే ఆయన విదేశాలకు వెళ్లారు. ఇలా.. ఎవరికి తోచిన ప్రకటనలు వాళ్లు చేస్తున్నారే తప్ప ఆయన ఎక్కడికి వెళ్లారు అనేదానిపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఆఖరికి ఆయన పార్టీ కూడా!. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత విదేశీ పర్యటన కోసం హైదరాబాద్‌ నుంచి తొలుత దుబాయ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు అనేదానిపై గోప్యతను ప్రదర్శిస్తోంది తెలుగు దేశం పార్టీ. ఇక.. చంద్రబాబు ఏం చేసినా బాకా ఊదే ఎల్లో పత్రికలు సైతం ఆయన ఫారిన్‌ టూర్‌పై వేర్వేరు కథనాలు ఇవ్వడం గమనార్హం. చంద్రబాబు పర్యటనకు వెళ్లే ముందే ఆయన తనయుడు నారా లోకేష్‌ విదేశాలకు వెళ్లారు. ఆయన కూడా ఎక్కడికి వెళ్లారనేదానిపై స్పష్టత కొరవడింది. ఇక చంద్రబాబు విశ్రాంతి కోసం అమెరికా వెళ్తున్నారంటూ లీకులు ఇచ్చాయి టీడీపీ శ్రేణులు. అయితే.. చంద్రబాబు అసలు అమెరికాకే రాలేదంటూ టీడీపీ ఎన్నారై నేత కోమటి జయరాం ప్రకటన చేయడంతో ఒక్కసారిగా గాలి తీసేసినట్లయ్యింది.చెప్పాల్సిన అవసరం ఉందిఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష ప్రధాన నేతలుగా బాధ్యతాయుతమైన పదవుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి,నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. వాళ్లిద్దరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పార్టీలు ప్రకటనలు చేస్తుంటాయి. అలాగే ఏ పర్యటనలకు వెళ్లినా.. అధికారికంగా వెల్లడించాల్సిన అవసరం ఆ పార్టీల బాధ్యత కూడా. అందుకే వైఎస్సార్‌సీపీ సీఎం జగన్‌ కుటుంబ సమేతంగా లండన్‌ పర్యటనకు వెళ్లగానే.. అక్కడ ల్యాండ్‌ అయిన దృశ్యాలను మీడియా, సోషల్‌ మీడియా మాధ్యమంగా విడుదల చేసింది. మరి ఇదే పని చంద్రబాబు విషయంలో టీడీపీ ఎందుకు చేయలేకపోతోంది. సాధారణంగానే చంద్రబాబు విదేశీ పర్యటనను ఏదో రాష్ట్రానికి ఉద్దరించే పనిగా చూపించే ఎల్లో మీడియా.. ఈసారి ఆ బిల్డప్‌లను ఎందుకు ఇవ్వలేకపోతోంది. ఈ లెక్కన.. చంద్రబాబు విదేశీ పర్యటనపై వైఎస్సార్‌సీపీ ఆరా తీయడంలో.. సారీ నిలదీయడంలో తప్పేముంది?.

Gannavaram: TDP Yarlagadda Aide Attack Youth Video Viral
అర్థరాత్రి యార్లగడ్డ అనుచరుల వీరంగం, యువకులపై..

ఎన్టీఆర్‌, సాక్షి: రాష్ట్రంలో ఎన్నికల ఓటమిని ముందుగానే పసిగట్టి అల్లర్లు, హింసాత్మక ఘటనలకు ప్రతిపక్ష టీడీపీ ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పచ్చ మూక బరి తెగిస్తోంది. వైఎస్సార్‌సీపీకి సానుభూతిపరుల్ని వెతుక్కుంటూ వెళ్లి మరీ దాడులకు తెగబడుతోంది. ఈ క్రమంలోనే గన్నవరంలో యువకులపై దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది యార్లగడ్డ వెంకట్రావు అనుచరులుగా తేలింది.గన్నవరం మండలం మర్లపాలెం శివారులో ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు యువకులపై దాడి కలకలం రేపింది. రాత్రిపూట అపార్ట్‌మెంట్‌ తలుపుల్ని బద్ధలు కొట్టుకుని వెళ్లి మరీ యువకులను చితకబాదారు. ఆపై బలవంతంగా తమ కారులో ఎక్కించుకెళ్లి వాళ్లను చిత్రహింసలకు గురి చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు బయటకు వచ్చాయి.ఇద్దరు యువకులపై దాడి చేసింది గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అనుచరులుగా పోలీసులు గుర్తించారు. టీడీపీ నేతలు ఫణి రెడ్డి, పౌలూరి వంశీకృష్ణ, కంభంపాటి దేవేంద్ర, కంభంపాటి బాలనరేష్, దేవినేని హర్షచౌదరి, శొంఠి సురేష్, కన్నా కార్తిక్, బాబీ, కంఠమనేని అరుణకు మార్, మరి కొంత మంది ఉన్నట్టు గుర్తించారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Kommineni Srinivasa Rao Strong Counter to CM Revanth Reddy Cheating farmers
రేవంత్‌ హామీ నెరవేర్చినట్లా? యూటర్న్‌తో మోసం చేసినట్లా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం అయిన మంత్రివర్గం సన్నవడ్లు పండించే రైతులకు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనితో కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన మరో హామీని నెరవేర్చినట్లేనా! ఒక రకంగా చూస్తే వాగ్దానం అమలు చేసినట్లే అవుతుంది. ఇంకో రకంగా చూస్తే రైతులను మోసం చేసినట్లు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల గురించి ప్రస్తావించినప్పుడు అందులో ఉన్న పాయింట్ ఏమిటంటే వరి ధాన్యం పండించే రైతులకు ఏడాదికి 500 రూపాయల బోనస్ ఇస్తామని తెలిపారు. ఇప్పుడు అలాగే చేశారు కదా అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ తన గ్యారంటీలను అమలు చేయడంలో ముందుకు వెళ్లినట్లే కదా అని భావించవచ్చు. ఇక్కడే కిటుకు ఉంది. మంత్రివర్గం ఈ హామీ అమలులో ఒక షరతుపెట్టింది. సన్నరకం వడ్లు పండించే రైతులకే ఈ బోనస్ ఇస్తామని తెలిపింది. గ్యారంటీలలో ఇలాంటి షరతు పెట్టలేదు కదా అని ఎవరైనా అడగవచ్చు. అలా అని అన్ని రకాల వడ్లకు ముఖ్యంగా దొడ్డు రకం వడ్లకు బోనస్ ఇస్తామని ప్రత్యేకంగా చెప్పలేదు కదా అని వాదించవచ్చు. కాంగ్రెస్ నేతలు తమ ప్రసంగాలలో రైతు పండించే పంట ప్రతి గింజను కొనుగోలు చేసి బోనస్ కూడా ఇస్తామని చెప్పేవారు. అందువల్ల ఈ షరతు పెడతారని ఎవరూ అనుకోరు. ఇలా కండిషన్ పెట్టడం రైతులను మోసం చేసినట్లే కదా అని ఎవరైనా విమర్శిస్తే కూడా అంగీకరించవలసిందే. దీనికి కారణం ఏమిటంటే తెలంగాణలో పండించే వడ్లలో సన్నరకం వాటా కేవలం ముప్పై శాతమేనని ఒక అంచనా. మిగిలినదంతా దొడ్డు రకం వడ్లేనని చెబుతున్నారు. అప్పుడు మిగతా రైతులకు బోనస్ దక్కదు. దీనిపై రైతు వర్గాలలో వ్యతిరేకత వస్తుంది. మార్కెట్ లో సన్నరకం ధాన్యానికి మంచి గిరాకి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కన్నా ఐదు వందల నుంచి ఏడువందల రూపాయలు అధికంగా మార్కెట్ లో లబిస్తుంది. అందువల్ల మార్కెట్ లో విక్రయించుకునే సన్నవడ్ల రైతులకు బోనస్ ఇవ్వవలసిన అవసరం ఉండదు. ఒక లెక్క ప్రకారం ఏడాదికి రెండు సీజన్ లలో కలిపి కోటిన్నర టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది.మొత్తం ధాన్యానికి బోనస్ ఇవ్వవలసి వస్తే ప్రభుత్వానికి సుమారు ఆరువేల కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుంది. సన్నరకం వడ్లకు బోనస్ ఇస్తే ప్రభుత్వంపై రెండువేల కోట్ల భారం పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నా,వాస్తవానికి అంత కూడా ఉండదన్నది విపక్షాల అభిప్రాయం. ఇది రైతులను మోసం చేయడమేనని వారు అంటున్నారు. సన్నవడ్లలో కూడా ఏ రకానికి బోనస్ ఇచ్చేది తర్వాత అధికారులు ప్రకటిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరులకు చెప్పారు. అంటే ఇందులో కూడా లిటిగేషన్ ఉందన్న మాట. రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చేటప్పుడు బాధ్యతగా ఉండడం లేదని, ఏదో రకంగా మభ్య పెట్టి ఓట్లుపొందడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. సన్నరకం వడ్లను ప్రోత్సహించడానికి తొలుత ఆ వడ్లకు బోనస్ ఇస్తున్నామని, తదుపరి దొడ్డురకం వడ్లకు కూడా ఇస్తామమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కె చెప్పారు. ఆయన తెలివిగానే ఈ ప్రకటన చేసినా, ఆ మేరకు క్యాబినెట్ లో తీర్మానం చేయలేదు కదా అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. తెలంగాణలోకాని, కర్నాటకలోని గ్యారంటీల పేరుతో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు సతమతమవుతున్నాయి.ఒకటి,రెండు అంశాలను అమలు చేసి గ్యారంటీలను చెప్పినట్లే చేస్తున్నాం కదా అని డబాయిస్తున్నారు. రైతులకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సహజంగానే వ్యతిరేకత తెస్తుంది. నిజానికి రైతులు ఎవరూ తమ ఉత్పత్తులకు బోనస్ ఇవ్వాలని అడగలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను గద్దె దించడానికి ఇలాంటి పలు వాగ్దానాలు చేసింది. వాటిలో రైతు భరోసా కింద పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని, కౌలు రైతులకు కూడా వర్తింప చేస్తామని, రైతు కూలీలకు పన్నెండువేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. రైతు భరోసాను గత ప్రభుత్వం అమలు చేసిన పదివేలు చొప్పునే చేయగలిగారు. దానికి కొంత టైమ్ తీసుకున్నా మొత్తం మీద ఆ మేర అయినా చేశారు. ఇది ప్రామిస్ ను నెరవేర్చినట్లేనా అంటే మళ్లీ అదే రకంగా రెండు రకాల వాదనలు వస్తాయి.రైతుల రుణాలు రెండు లక్షల వరకు మాఫీ చేస్తామన్న మరో హామీ కూడా ఉంది. ఎన్నికల ప్రచారం సమయంలో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి రైతులు ఎవరైనా బ్యాంకులలో అప్పులు చేయకపోతే వెళ్లి తీసుకోవాలని కూడా సూచించారు. ఇప్పుడు అది శక్తికి మించిన పని కావడంతో కిందా మీద పడాల్సి వస్తోంది. దాంతో పలు వాయిదాలు వేస్తున్నారు. ఆగస్టు పదిహేను లోగా రుణమాఫీ చేస్తామని రేవంత్ అంటున్నారు. ఇందుకోసం సుమారు నలభై వేల కోట్ల రూపాయలు అవసరమని ఒక అంచనా కాగా,పాతికవేల కోట్లు సరిపోవచ్చని కొందరి అంచనా. ఇప్పుడు బోనస్ లో ఎలా మెలిక పెట్టారో, రుణమాఫీలో కూడా కొన్ని షరతులు పెట్టి భారం తగ్గించుకునే ప్రయత్నం జరగవచ్చు. ప్రభుత్వం అన్నాక కొన్ని నిబంధనలు పాటించక తప్పదు. వాటిని దృష్టిలో ఉంచుకునే రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేయాలి. ఎన్నికల సమయంలో నేతలు ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చేస్తున్నారు.కొండకు వెంట్రుక కట్టినట్లు వ్యవహరించి అధికారం సాధించిన తర్వాత మాత్రం గుడ్లు తేలేయవలసి వస్తోంది. గతంలో కెసిఆర్ ప్రభుత్వం చిన్న,పెద్ద,ధనిక రైతులందరికి రైతు బంధు అమలు చేసింది.ఆ రోజుల్లో పలు విమర్శలు కూడా వచ్చాయి. పంటలు పండని భూములకు కూడా రైతు బంధు ఇచ్చారని అనేవారు. కొందరు బెంజ్ కార్లలో వెళ్లి రైతు బంధు డబ్బు తీసుకున్నారు. కౌలు రైతులకు ఆ స్కీమ్ అమలు చేయలేమని అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టంగానే చెప్పారు.కాంగ్రెస్ వారు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని అన్నారు.కాని ఆ దిశగా ముందుకు వెళ్లలేదు.ఇక రుణమాఫీ అమలు ఎలా చేస్తారా అన్నది ఆసక్తికరంగా ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చేయగలుగుతామని రేవంత్ తదితరులు ఆయా సందర్భాలలో చెప్పారు. కాంగ్రెస్ కేంద్రంలో అదికారంలోకి రాలేకపోతే ఏమి చేయాలన్న ప్రశ్న వస్తుంది. రిజర్వు బ్యాంక్ ను అప్రోచ్ అయి బ్యాంకుల ద్వారా రుణాలు పొందాలని ఆలోచిస్తున్నారు. ఎక్సైజ్,రిజిస్ట్రేషన్ వంటి శాఖల ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణం తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు గతంలో కొన్ని ప్రభుత్వాలు చేయకపోలేదు. రిజర్వుబ్యాంక్ అందుకు అంత సుముఖత చూపలేదు. ఉదాహరణకు ఎపిలో 2014లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రైతులకు లక్షన్నర రూపాయల వరకు రుణమాఫీ చేయాలని తలపెట్టి ,రైతుసాధికార సంస్థను నెలకొల్పినా, ఆచరణలో హామీని నిలబెట్టుకోలేకపోయింది. 89 వేల కోట్ల రూపాయల రుణాల మాఫీ చేస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు అంతా కలిపి పదిహేను వేల కోట్లు చేసి చేతులెత్తేశారు. అందులో కూడా రైతులు నానా పాట్లు పడవలసి వచ్చింది.ఎన్నో షరతులు పెట్టేసరికి వారికి విసుగు వచ్చింది.తత్పలితంగా రైతులంతా టిడిపి ప్రభుత్వం తమను మోసం చేసిందని భావించి 2019 ఎన్నికలలో ఓడించారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తపడే యత్నం చేస్తోంది. అయినా తొలి అడుగులోనే తడబడాల్సి వస్తోంది.ప్రభుత్వం వద్ద ఆర్దిక వనరులు పుష్కలంగా ఉంటే దేనినైనా చేయవచ్చు. అలా నిధులు లేవని తెలిసినా, శక్తికి మించిన పని అని తెలిసినా, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చేసి ఇప్పుడు దిక్కులు చూడవలసి వస్తోంది. కాంగ్రెస్ మాత్రమే ఇలా చేస్తోందని కాదు.ఆయా రాష్ట్రాలలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఇలాగే చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఒడిషా లో బీజేపీ ప్రతి మహిళకు ఏభైవేల రూపాయల చొప్పున ఓచర్ ఇస్తామని వాగ్దానం చేసిందట. ఉచితాలకు వ్యతిరేకం అని చెప్పే బారతీయ జనతా పార్టీ నేతలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోతీరున ఉంటున్నారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలలో మరికొన్ని ముఖ్యమైన హామీలను అమలు చేయలేని నిస్సహాయ స్తితి ఉంది.వృద్దులకు ఇచ్చేపెన్షన్ ను నాలుగువేల రూపాయలు చేస్తామని ప్రకటించినా, ఆచరణ ఆరంభం కాలేదు. నిరుద్యోగ బృతి పరిస్థితి అంతే. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి అసలు నిరుద్యోగ భృతి ఎక్కడ ఇస్తామని అనడంపై విపక్షాలు మండిపడ్డాయి. మహాలక్ష్మి కింద ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. అది ఎప్పటికి అమలు అవుతుందో చెప్పలేరు. దానికి కూడా ఏవేవో కండిషన్లు పెట్టి అయిపోయిందని చెబుతారో ఏమో చూడాలి.500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కీము అమలు చేశామని చెప్పారు కాని అది ఎంతమందికి వస్తుందో తెలియదు. మహిళలకు ఉచిత బస్ హామీని మాత్రం పూర్తిగానే అమలు చేస్తున్నట్లు లెక్క.ఆలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచారు. వీటివల్ల ప్రభుత్వంపై తక్షణ భారం ఉండదు.అయినా ఆర్టిసి భవిష్యత్తులో ఇబ్బంది పడవలసి ఉంటుంది. మరో వైపు ప్రభుత్వం ఇప్పటికే సుమారు పదహారువేల కోట్ల అప్పు చేసిందని బీజేపీ వ్యాఖ్యానిస్తోంది. ఫీజ్ రీయింబర్స్ మెంట్ కింద 6500 కోట్ల బకాయిలు ఉన్నాయని కాలేజీలవారు, ఆరోగ్యశ్రీ కింద 1200 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయని ఆస్పత్రులవారు చెబుతున్నారు.ఈ నేపధ్యంలో రేవంత్ ప్రభుత్వానికి ఈ గ్యారంటీలు,వాటితో నిమిత్తం లేకుండా ఆయా డిక్లరేషన్ లలో చేసిన ఇతర హామీలు పెద్ద గుది బండలే అవుతాయని చెప్పకతప్పదు.ఒకరకంగా ఇది రేవంత్ ప్రభుత్వానికి సవాలు వంటిది. కొసమెరుపుగా ఒకటి చెప్పుకోవాలి. ఏపీ లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోసే ఈనాడు,తదితర ఎల్లో మీడియా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి భజన చేసింది. సన్నవడ్లకు బోనస్ వల్ల రెండువేల కోట్ల భారం అని ఈనాడు రాసిందే తప్ప, కాంగ్రెస్ వాగ్దాన భంగం చేసిందని మాత్రం రాయకుండా జాగ్రత్తపడింది. చూశారుగా..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఈనాడు మీడియా ఎలా జాకీలు పెడుతోందో..బాకాలు ఊదుతోందో!. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయలు

Ap Elections 2024 May 22nd Political Updates Telugu
May 22nd: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 22nd AP Elections 2024 News Political Updates..12:00 PM, May 22nd, 2024ఓటమి దిశగా పవన్‌..!జడ్పీ చైర్మన్‌, ఎంపీ, ఎమ్మెల్యేగా కాకినాడ జిల్లాను అభివృద్ధి చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వంగా గీత.ఎప్పుడూ ప్రజల మధ్యే వంగా గీత. అందుబాటులో ఉండని పవన్‌. రాజకీయాల్లో, ప్రజాదరణలో వంగా గీతకు ఏమాత్రం సరితూగని పవన్‌. వంగా గీతకే పట్టం కట్టిన పిఠాపురం ప్రజలు. 11:30 AM, May 22nd, 2024ఓటమి అంచున్న పురంధేశ్వరి! ఎన్నికల్లో ఓటమి అంచున నిలుచున్న ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి. రాజమండ్రి గురించి ఏ మాత్రం తెలియకుండానే అక్కడి నుంచి పోటీ. ఇక, సీటు ఆశించి భంగపడిన సోము వీర్రాజుతో పురంధేశ్వరికి కుదరని సయోధ్య. 11:00 AM, May 22nd, 2024బాబు, పవన్‌ హైదరాబాద్‌కే పరిమితం..పవన్‌ కేవలం సినిమాలకే పరిమితమంటున్న సామాన్యులు. చంద్రబాబు, దత్తపుత్రుడు హైదరాబాద్‌కే పరిమితమంటున్న సామాన్య ప్రజలు. జూన్ 4న వైయస్‌ఆర్‌సీపీ జెండా సగర్వంగా ఎగురుతుంది.. చంద్రబాబు, దత్తపుత్రుడు హైదరాబాద్‌కే పరిమితం అవ్వడం ఖాయం.#YSRCPWinningBig#TDPJSPBJPCollapse#TDPLosing pic.twitter.com/RwItBFPTqb— YSR Congress Party (@YSRCParty) May 22, 2024 10:30 AM, May 22nd, 2024గన్నవరంలో పచ్చ బ్యాచ్‌ హల్‌చల్‌కృష్ణా జిల్లా..గన్నవరంలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌ఇద్దరు యువకులపై దాడి చేసిన టీడీపీ సానుభూతిపరులుఐదుగురు టీడీపీ వ్యక్తులున్నట్టు సమాచారంపచ్చ బ్యాచ్‌ దాడిలో యువకులకు తీవ్రగాయాలు బాధితుల ఫిర్యాదు విచారణ చేపట్టిన పోలీసులు. 8:30 AM, May 22nd, 2024ఎన్నికల కౌంటింగ్‌పై పోలీసుల ఫోకస్‌.. విజయవాడసార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియపై పోలీసులు ప్రత్యేక దృష్టిపోలింగ్ అనంతరం జరిగిన పరిమాల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుకౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల రక్షణ వలయం సిద్ధం చేస్తున్న పోలీసులుకలెక్టర్లు, రిటర్నింగ్‌ అధికారులు, మ్యాన్‌పవర్‌ మేనేజ్‌మెంట్‌, మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌, నోడల్‌ అధికారులు, ఎన్‌ఐసీ, ఎన్‌కోర్‌ టీమ్‌ అధికారులతో సమావేశాలుకౌంటింగ్‌ విధులకు హాజరయ్యే ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు, కౌన్సెలింగ్ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పగడ్బందీగా బారికేడింగ్‌ పనులుకౌంటింగ్ రోజున ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలుఏపీ పోలీసులతో పాటు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్న సిఆర్పిఎఫ్, పారా మిలటరీ బలగాలు 7:20 AM, May 22nd, 2024గొడవలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధం: ఎమ్మెల్యే పిన్నెల్లిపల్నాడులో టీడీపీ గెలిచే పరిస్థితి లేదు. అందుకే అందర్నీ తప్పుదోవ పట్టించేలా టీడీపీ నేతలు గొడవలు చేశారు. పోలింగ్‌ రోజు నుంచి జరిగిన గొడవలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు నేను సిద్ధంఅనవసరంగా అసత్య ప్రచారం చేస్తున్నారు. పల్నాడులో వాళ్లు గెలిచే పరిస్థితి లేకపోవడంతో అందర్నీ తప్పుదోవ పట్టించేలా టీడీపీ వాళ్లు గొడవలు చేశారు. పోలింగ్ రోజు నుంచి జరిగిన గొడవలపై సిట్టింగ్ జడ్జితో విచారణకి నేను సిద్ధం.-ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి#YSRCPWinningBig#TDPLosing pic.twitter.com/cgi2SMXSmR— YSR Congress Party (@YSRCParty) May 21, 2024 7:00 AM, May 22nd, 2024ఓట్ల లెక్కింపు రోజు విధ్వంసానికి పచ్చ ముఠాల ప్లాన్‌పోలింగ్‌ రోజు హింసకు మించి భయోత్పాతం సృష్టించే పన్నాగంకుట్రలపై పోలీసు శాఖను అప్రమత్తం చేసిన నిఘావర్గాలురాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలుఆ 3 జిల్లాలపై ప్రత్యేకంగా కన్నుగూండాలను అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు.. అంతా టీడీపీ మూకలేస్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతరెడ్‌జోన్ల ఏర్పాటు.. నిషేధాజ్ఞలు విధింపు.. డ్రోన్‌ కెమెరాల వినియోగం నిషిద్ధం 6:55 AM, May 22nd, 2024సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధంజూలకంటి బ్రహ్మారెడ్డిది నీచ సంస్కృతిటీడీపీ అనుకూల గ్రామాల్లో మా ఏజెంట్లపై దాడిఆ గ్రామాల్లోనే అలజడి సృష్టించారుపారిపోయి నియోజకవర్గానికి దూరంగా ఉండేది బ్రహ్మారెడ్డినేను ఎక్కడికి పారిపోలేదు... ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే పోలీసుల సూచన మేరకు హైదరాబాద్‌ వచ్చా ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 6:45 AM, May 22nd, 2024పవన్‌ ఎక్కడ?పవన్‌ పర్యటనపైనా రాజకీయ వర్గాల్లో చర్చ14న ప్రధాని మోదీ నామినేషన్‌కు పవన్‌ హాజరుఅక్కడి నుంచి హైదరాబాద్‌ రాకఆ తర్వాత ఎవరికీ అందుబాటులో లేని పవన్‌రష్యా లేదా దుబాయ్‌ వెళ్లి ఉంటారంటున్న పార్టీ వర్గాలు 6:40 AM, May 22nd, 2024సోమిరెడ్డికి, టీడీపీ వాళ్లకు సవాల్‌ చేస్తున్నా: మంత్రి కాకాణిబ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను రెడీ.. సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా ?నెల్లూరు లో ఎక్కడికి రావాలో చెప్తే అక్కడికి వస్తాఎవరికి రేవ్ పార్టీకి వెళ్లే అలవాటు ఉందో తెలుస్తుందిఆధారాలు ఉంటే సోమిరెడ్డి పోలీసులకు ఇవ్వాలిబెంగళూరు రేవ్ పార్టీపైసీబీఐ దర్యాప్తుకు నేను సిద్ధంగా ఉన్నాబ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి వస్తావా.. ? పాస్ పోర్ట్ చూపించడానికి వస్తావా ?రేవ్ పార్టీలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఉన్నారని సోషల్ మీడియాలో వస్తుంది..బెంగళూరు పోలీసులు ఎటువంటి కాల్ చేయలేదురేవ్ పార్టీ జరిగిన ఫార్మ్ హౌస్ గోపాల్ రెడ్డి ఎవరో నాకు తెలియదుపాసు పోర్ట్ నా దగ్గరే ఉందికుట్ర కోణం పై విచారణ చేయాలని పోలీసులను కోరానురోస్ ల్యాండ్ లాడ్జిలో చంద్రమోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికారుసోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లోఫర్బెంగళూరు రేవ్ పార్టీ విషయంలో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారునాకు సంబంధాలు ఉన్నా.. నాకు సంబధించిన వారు ఎవరు ఉన్నా చర్యలు తీసుకోవాలిఎవడో అనామకుడు నా స్టిక్కర్‌ను జిరాక్స్ తీసి వాడుకున్నారురేవ్ పార్టీలు, రేప్ పార్టీలు చేసే చరిత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిదిసోమిరెడ్డి లేడీ డాక్టర్ ను ఇబ్బంది పెట్టిన కథనాలు గతంలో పత్రికల్లో వచ్చాయినాపై మూడోసారి కూడా సోమిరెడ్డి ఓడిపోతున్నారు.. ఆ ప్రెస్టేషన్ లో ఏదో మాట్లాడుతున్నారుయూత్ మినిస్టర్ గా ఉండి.. క్రికెట్ కిట్స్ అమ్ముకున్న చరిత్ర సోమిరెడ్డిదినా పాస్ పోర్ట్ నెల్లూరు లో ఉందికారు స్టిక్కర్ జిరాక్స్ చేసి నాపై కుట్ర చేసినట్లు అనుమానాలు ఉన్నాయి.. కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశా 6:30 AM, May 22nd, 2024ఎల్లో మీడియాకు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికెళ్లారు?: మంత్రి జోగి రమేష్‌దోచినడబ్బంతా దుబాయ్‌లో దాచడానికి వెళ్లారా?చంద్రబాబు కనిపించకుండా పోతే టీడీపీ అడ్రస్‌ గల్లంతుటీడీపీ నాయకులు నోటికి తాళాలు పడ్డాయి.కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారుఎస్పీలను, కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగాయిచంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా.. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయంచంద్రబాబు వ్యవస్థలను భ్రష్టు పట్టించారువైఎస్సార్‌సీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలిపల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే.

ACP Uma Maheshwar Rao Arrested In Illegal Assets Case
ఉమా మహేశ్వర ‘అక్రమ’రూపస్య

సాక్షి, హైదరాబాద్‌: ఆదాయానికి మించి ఆ­స్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో సెంట్ర­ల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో (సీసీ­ఎస్‌) ఏసీపీగా పని చేస్తున్న టీఎస్‌ ఉమామహేశ్వరరావును ఏసీబీ అరెస్ట్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. న్యాయం కోసం వెళ్లిన వారిని ఆయన తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్టు అధికారులు గుర్తించారు.ఇక, ఏసీపీ ఉమా మహేశ్వరరావు వ్యవహారశైలిపై కూడా గతంలోనే ఫిర్యాదులు వచ్చాయి. అతనిపై ఇప్పటికే మూడుసార్లు సస్పెన్షన్‌ వేటుగా పడింది. అయినా కూడా ఆయన తన తీరు మార్చుకోలేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సివిల్‌ కేసులను క్రిమినల్‌ కేసులుగా మార్చి లక్షల రూపాయలను కాజేశారు.సీసీఎస్‌లో బాధితులకు న్యాయం చేయాల్సిన హోదాలో ఉంటూ వారితోనే బేరసారాలాడారు. కాగా, ఓ ఎన్నారై ఫిర్యాదు చేయడానికి రావడంతో అతడిని సైతం బెదిరించి డబ్బులు దండుకున్న‍ట్టు అధికారులు గుర్తించారు. ఇక, తోటి సిబ్బందిని బూతులు తిడుతూ, అవహేళన, వారిపై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు చాలానే పోలీసులు చెబుతున్నారు. తన దగ్గరికి వచ్చిన ప్రతీ కేసులోనూ ఉమా మహేశ్వర రావు చేతివాటం చూపించినట్టు సమాచారం. ఆదాయానికి మించి ఆ­స్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆయన, ఆయన బంధువుల నివాసాలపై మంగళవారం దాడు­లు చేశారు. తెలంగాణ, ఏపీలోని ఉమా­మ­హేశ్వరావు ఇళ్లు, ఆయన బంధువులు, స్నే­హితుల ఇళ్లతో సహా మొత్తం 11 చోట్ల సోదా­లు నిర్వహించారు. తనిఖీల్లో నగదు, బంగారం, ఆస్తి పత్రాలతో పాటు రెండు బ్యాంకు లాక­ర్ల­ను గుర్తించినట్లు తెలిసింది.అక్రమ ఆస్తుల కూడబెట్టుకుని నగర శివారులో విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేశారు. శామీర్‌పేటలో విల్లా, ఘట్‌కేసర్‌లో ఐడు ప్లాట్స్‌ కొనుగోలు చేశారు. అంతేకాకుండా తన ఇంట్లో నగదు ఉంచకుండా.. తన అత్తామామల ఇంట్లోనే డబ్బును దాచిపెట్టారు. లావాదేవీల మొత్తం సమాచారాన్ని ఆయన ట్యాబ్‌లో స్టోర్‌ చేసుకున్నారు. ఇక, ఉమా మహేశ్వరరావు ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో 50కోట్లకు వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో 17చోట్ల ఆస్తులను గుర్తించారు. సోదాల్లో భాగంగా ఇప్పటి వరకు రూ.38లక్షల నగదు, 60 తులాల బంగారం సీజ్‌. కాగా, కాసేపట్లో ఉమా మహేశ్వర్‌ను అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు.

Kalki 2898 Makers Spend Huge Amount For An Ad In IPL
Kalki 2898: 12 సెకన్లు.. రూ.3 కోట్లు, రాజమౌళిని ఫాలో అవుతున్న ‘కల్కి’టీమ్‌!

సినిమాను తీయడం ఒకెత్తు అయితే.. ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. అందుకే ప్రమోషన్స్‌ విషయంలో మేకర్స్‌ చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రేక్షకులను రీచ్‌ అయ్యేందుకు అదెంచ్చె ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరు. ఇక సినిమా ప్రమోషన్స్‌ విషయంలో రాజమౌళి తర్వాతే మరెవరు అయినా. ఆయన సినిమాను తెరకెక్కించేందుకు ఎలా కష్టపడతాడు.. అంతే స్థాయిలో సినిమా ప్రమోషన్స్‌కి కష్టపడతాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విషయంలో ఆయన చేసిన ప్రమోషన్స్‌ బాగా కలిసొచ్చింది. ఇద్దరు హీరోలతో దేశం మొత్తం తిరిగి సినిమాను అన్ని భాషల వారికి దగ్గరయ్యేలా చేశాడు. కేవలం ప్రమోషన్స్‌ కోసమే దాదాపు రూ.20 కోట్ల ఖర్చు చేసినట్లు తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి స్ట్రాటజీనే ఫాలో అవుతుంది ‘కల్కి’ టీమ్‌. (చదవండి: రెండు ఓటీటీల్లో 'కల్కి'.. ఏకంగా అన్ని కోట్లకు అమ్మేశారా?)సినిమా ప్రమోషన్స్‌కి భారీగా ఖర్చు చేయబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని కోసం దాదాపు రూ. 50 కోట్ల వరకు బడ్జెట్‌ కేటాయించినట్లు సమాచారం. రీసెంట్‌గా ఐపీఎల్‌లో కూడా ‘కల్కి 2898 ఏడీ’ యాడ్‌ని రన్‌ చేశారు. ప్రభాస్‌ కల్కి అవతార్‌లో కనిపించి సినిమాను ప్రమోట్‌ చేశాడు. ఇది కేవలం 12 సెకన్ల యాడ్‌ మాత్రమే. దీని కోసం మేకర్స్‌ రూ. 3 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కల్కి సినిమా ప్రమోషన్స్‌కి ఖర్చు చేసే డబ్బుతో టాలీవుడ్‌లో ఓ బడా సినిమానే తీయొచ్చు. (చదవండి: స్టార్‌ హీరో కొడుకు సెకండ్ హ్యాండ్ బట్టలు వాడుతాడు)నేడు(మే 22)రామోజీఫిల్మ్‌ సిటీలో భారీ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నాడు మేకర్స్‌. ఈ ఈవెంట్‌లో బుజ్జిని పరిచయం చేయనున్నారు. ప్రభాస్‌తో పాటు చిత్రబృందం అంతా ఈ ఈవెంట్‌కి హాజరవుతున్నారు. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండడంతో..అందుకు తగ్గట్లే భారీ ఏర్పాట్లు చేశారట. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె ఇతర కీలక పాత్రలు పోషించారు. జూన్‌ 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

Gavaskar Predicts RCB vs RR IPL Eliminator Winner This Team Will Walk Over
RR vs RCB: వార్‌ వన్‌సైడ్‌.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం

ఐపీఎల్‌-2024 ఆఖరి అంకానికి చేరుకుంటోంది. ఇప్పటికే ఒక ఫైనలిస్టు ఖరారు కాగా.. తుది పోరుకు అర్హత సాధించేందుకు మిగిలిన మూడు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ క్వాలిఫయర్‌-1లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైజర్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకువెళ్లింది కేకేఆర్‌.ఇక ఫైనల్‌ రేసులో మిగిలినవి రెండే మ్యాచ్‌లు. ఎలిమినేటర్‌, క్వాలిఫయర్‌-2. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన రాజస్తాన్ రాయల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య బుధవారం ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరుగనుంది.సన్‌రైజర్స్‌తో ఎలిమినేటర్‌ విజేత పోటీఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-2కు అర్హత సాధిస్తుంది. క్వాలిఫయర్‌-1లో కేకేఆర్‌ చేతిలో ఓడిన సన్‌రైజర్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. ఆ మ్యాచ్‌లో గనుక గెలిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది.ఈ క్రమంలో బెంగళూరు- రాజస్తాన్‌ మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్‌ సునిల్‌ గావస్కర్‌ ఎలిమినేటర్‌ విజేత ఎవరన్న అంశంపై తన అంచనా తెలియజేశాడు.‘‘ఆర్సీబీ ఈసారి ఎంతటి అద్భుతం చేసిందో చూశాం. ముఖ్యంగా వరుస పరాజయాల తర్వాత వాళ్లు తిరిగి పుంజుకున్న తీరు అమోఘం. మామూలు జట్లకు ఇలాంటివి సాధ్యం కావు.అయ్యో.. మనం ఓడిపోతూనే ఉన్నాంఆర్సీబీ ప్రధాన ఆటగాళ్లలో కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌, విరాట్‌ కోహ్లితో పాటు మిగతా సీనియర్‌ ప్లేయర్లు తమ ఆట తీరుతో.. జట్టులో ఉత్సాహం నింపారు. ఆర్సీబీ స్థానంలో మరే ఇతర జట్టు ఏదైనా ఉంటే.. ‘అయ్యో.. మనం ఓడిపోతూనే ఉన్నాం. అంతా ముగిసిపోయింది’ అని బెంబేలెత్తిపోయేవాళ్లు.కానీ డుప్లెసిస్‌, కోహ్లి ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వలేదు. ఇక రాజస్తాన్‌.. గత నాలుగు- ఐదు మ్యాచ్‌లలో ఓడిపోతూనే ఉంది. ఆఖరిగా ఆడిన మ్యాచ్‌లోనూ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.వాళ్లను చూస్తే పూర్తిగా ఫామ్‌ కోల్పోయినట్లు కనిపిస్తున్నారు. పదకొండు రోజుల పాటు ఆటకు దూరంగా ఉన్న కేకేఆర్‌ మాదిరి ఏదైనా ప్రత్యేకంగా చేస్తే తప్ప రాజస్తాన్‌కు గెలిచే అవకాశాలు ఉండవు.లేదంటే మ్యాచ్‌ ఏకపక్షంగా సాగిపోయే ఛాన్స్‌ ఉంది. ఆర్సీబీ రాజస్తాన్‌ను చిత్తు చేసినా చేస్తుంది. ఒకవేళ అలా జరగకపోతేనే ఆశ్చర్యం’’ అని సునిల్‌ గావస్కర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో వ్యాఖ్యానించాడు. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశాడు.గావస్కర్‌ వర్సెస్‌ కోహ్లికాగా ఇటీవల గావస్కర్‌- కోహ్లి మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. కోహ్లి స్ట్రైక్‌రేటు గురించి గావస్కర్‌ విమర్శించగా.. రన్‌మెషీన్‌ అందుకు కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. ఎలా ఆడాలో తనకు తెలుసునని.. జట్టు ప్రయోజనాల కోసం ఏం చేయాలో కూడా తెలుసంటూ కౌంటర్‌ వేశాడు.

Pinnelli Ramakrishna Reddy comments on Julakanti Brahma Reddy
నేను ఎక్కడికి పారిపోలేదు.. సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధం

సాక్షి, పల్నాడు: ‘టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిది నీచ సంస్కృతి. ఫ్యాక్షనిజమే అతని జీవితం..’ అని వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలింగ్‌ రోజు మాచర్ల నియోజకవర్గంలో జరిగిన గొడవలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు తాను సిద్ధ­మని పిన్నెల్లి ప్రకటించారు. ఆయన మంగళవారం హైద­రా­బాద్‌లో విలేకరుల­తో మాట్లా­డారు. ‘టీడీపీ అభ్యర్థి బ్రహ్మా­రెడ్డి మాచర్ల నియో­జ­­క­­వ­­ర్గ­ంలో ఫ్యాక్షన్‌ రాజకీయాలకు ఆజ్యం పోసి.. ఆయన మాత్రం నియోజకవర్గానికి దూరంగా ఉంటూ ప్రజ­లను పట్టించుకోవడం లేదు. అటువంటి వ్యక్తి నేను పారిపోయానని చెప్ప­టం హాస్యాస్పదంగా ఉంది. ఏడు మర్డర్‌ కేసుల్లో ఏ–1గా ఉన్న బ్రహ్మారెడ్డి నాపై చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మడం లేదు. నాపై పోటీ చేసి ఓడిపోయిన బ్రహ్మారెడ్డి గుంటూరుకు పారిపో­యాడు. ఆ తర్వాత నియోజక­వర్గం వైపు కన్నెత్తి చూడలేదు. ఎన్నికల ముందు బ్రహ్మారెడ్డిని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, చంద్రబా­బు తీసు­కొచ్చి పల్నా­డు­లో ఫ్యాక్షన్‌కు ఆజ్యం పోశారు. కారెంపూడి మండ­లంలోని చింతపల్లి, ఒప్పిచర్ల, రెంట­చింతల మండలంలో తుమృకోట, పాలవా­యి­గేటు గ్రామాల్లో కమ్మ సామాజికవర్గానికి చెంది­నవారు మా ఏజెంట్లను తరిమికొట్టి గొడవలు సృష్టి­ంచారు. కారెంపూడి సీఐ నారాయణస్వామి ద్వారా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ గ్రామాల్లో గొడవలు జరుగుతా­యని బందోబస్తు పెంచాలని హైకోర్టు నుంచి ముందుగానే ఆర్డర్‌ తీసుకొచ్చి ఎస్పీకి ఇచ్చినా పట్టించు­కోలేదు. ఎన్నికల రోజు గొడవలు జరిగినా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పోలీ­సుల సూచనల మేరకు హైదరాబాద్‌కు వచ్చాను. మర్డర్లు చేసి పారిపోయిన చరిత్ర నాకు లేదు. నేను ఎన్నడూ పారి­పోలేదు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కమ్మ సామా­జికవర్గాన్ని ఒకటి చేయటానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు కూడా బ్రహ్మారెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు కలిసి గొడవలు చేశారు. టీడీపీని గెలిపించేందుకు సీఐ నారాయణస్వామి దాడులకు పాల్పడ్డారు. ఈ అల్లర్లపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణకు నేను సిద్ధంగా ఉన్నా. బ్రహ్మారెడ్డిలా నీచ రాజకీయాలు చేసి పారిపోయే చరిత్ర నాది కాదు. నేను ఎప్పుడూ ప్రజలకు వెన్నంటే ఉంటాను. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. మీ ప్రభుత్వంలో ఏం చేశారో చెప్పండి. చందాలు వసూలు చేసి ఇల్లు కట్టుకుని చందాల నాయకుడుగా మారిన బ్రహ్మారెడ్డి నన్ను విమర్శించడం సిగ్గుచేటు.’ అని పిన్నెల్లి రామకృష్ణరెడ్డి చెప్పారు.

Modi Praise On Zomato Ceo Deepinder Goyal
‘ఇంటి పేరు’తో పనిలేదు దీపిందర్‌ గోయల్‌.. ప్రధాని మోదీ ట్వీట్‌ వైరల్‌

జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్‌ స్టార్టప్‌ జర్నీపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. నేటి భారతంలో ఇంటిపేరుకు ఎలాంటి ప్రాధాన్యం లేదంటూనే.. గోయల్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందించారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ‘విశేష్ సంపర్క్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ఈవెంట్‌లో దీపిందర్‌ గోయల్‌ స్టార్టప్‌ను ప్రారంభించే విషయంలో తనకు తన తండ్రికి మధ్య జరిగిన చర్చ గురించి గుర్తు చేశారు.నీ తండ్రి స్థాయి ఏంటో తెలుసా?‘16 ఏళ్ల క్రితం నా తండ్రికి నా స్టార్టప్‌ ఆలోచన గురించి వివరించా. అప్పుడాయన.. నీ తండ్రి స్థాయి ఏంటో తెలుసా? పంజాబ్‌లోని ఇంత చిన్న ఊరిలో నువ్వేం చేయలేవు అని అన్నారు. కానీ నేను సుసాధ్యం చేశాను. జొమాటో అనే సామ్రజ్యాన్ని నిర్మించి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విజయం ఇంటిపేర్లతో కట్టుబడి ఉండదనివిశేష్ సంపర్క్ కార్యక్రమంలో దీపిందర్‌ గోయల్‌ ప్రసంగంపై ప్రధాని మోదీ స్పందించారు. విజయం ఇంటిపేర్లతో కట్టుబడి ఉండదని, గోయల్ సాధించిన విజయాలు ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రేరణగా నిలుస్తోందన్నారు.మీ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం‘నేటి భారతంలో ఒకరి ఇంటిపేరు పట్టింపు లేదు. కష్టపడి పనిచేయడమే ముఖ్యం. మీ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం దీపిందర్ గోయల్! ఇది అసంఖ్యాక యువకులను వారి వ్యవస్థాపక కలలను కొనసాగించడానికి ప్రేరేపిస్తుంది. స్టార్టప్‌లు అభివృద్ధి చెందడానికి సరైన వాతావరణాన్ని అందించడానికి మేం కట్టుబడి ఉన్నాము’ అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.In today’s India, one’s surname doesn’t matter. What matters is hardwork. Your journey is truly inspiring, @deepigoyal! It motivates countless youngsters to pursue their entrepreneurial dreams. We are committed to providing the right environment for the startups to flourish. https://t.co/E9ccqYyVzv— Narendra Modi (@narendramodi) May 22, 2024

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement