అమితాబ్కు అక్కినేని పురస్కారం అందజేసిన కేసీఆర్ | Akkineni Award presented KCR to Amitabh | Sakshi
Sakshi News home page

అమితాబ్కు అక్కినేని పురస్కారం అందజేసిన కేసీఆర్

Dec 27 2014 9:05 PM | Updated on Aug 15 2018 9:27 PM

అమితాబ్కు అక్కినేని పురస్కారం అందజేసిన కేసీఆర్ - Sakshi

అమితాబ్కు అక్కినేని పురస్కారం అందజేసిన కేసీఆర్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్కు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం ప్రదానం చేశారు.

హైదరాబాద్: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్కు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం ప్రదానం చేశారు.  అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమంలో అవార్డు నగదు అయిదు లక్షల రూపాయలతోపాటు జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా  కేసీఆర్ మాట్లాడుతూ సినీపరిశ్రమకు కావలసినవన్నీ సమకూరుస్తామని చెప్పారు. సినీపరిశ్రమకు సంబంధించి సినీప్రముఖులతో త్వరలో చర్చిస్తానన్నారు. సినీపరిశ్రమ ఇక్కడ నుంచి ఎక్కడికీ తరలిపోదని చెప్పారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవితోపాటు పలువురు రాజకీయ, సినిమారంగ ప్రముఖులు హాజరయ్యారు.

 భారత చలన చిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులకు 2005 నుంచి అక్కినేని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ద్వారా అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును ప్రదానం చేస్తారు. ప్రస్తుతం టి. సుబ్బరామిరెడ్డి ఈ పౌండేషన్కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.  ప్రారంభించినప్పటి నుంచి ఈ అవార్డును అక్కినేని నాగేశ్వరరావు చేతులమీదుగానే అందజేశారు.  అక్కినేని మరణానంతరం తొలిసారిగా ఈ రోజు ఈ పురస్కారం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement