breaking news
Airport land survey
-
ఎయిర్పోర్టు మాకొద్దు
* రైట్స్ బృందాన్ని అడ్డుకున్న ఆదివాసీలు * రోడ్డుపై బైఠాయింపు కొత్తగూడెం : కొత్తగూడెం మండల పరిధిలోని పునుకుడుచెలకలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన ఎయిర్పోర్ట్ను నిలిపివేయాలని కోరుతూ ఎయిర్పోర్టు సమగ్ర సర్వేకు వచ్చిన రైట్స్ బృందాన్ని ఆదివాసీలు శుక్రవారం అడ్డుకున్నారు. మర్రిగూడెం రోడ్డుపై బైఠాయించి సర్వే చేసి తిరిగి వస్తున్న బృందాన్ని నిలిపివేశారు. వివరాలిలా ఉన్నాయి. పునుకుడు చెలకలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం తరఫున రైట్స్ బృందం గ్రామానికి చేరుకుని, సర్వే నిర్వహించింది. అనంతరం బృందం సభ్యులు తిరిగి వసున్న క్రమంలో గ్రామానికి చెందిన ఆదివాసీ నాయకులు అడ్డుకున్నారు. మర్రిగూడెం రోడ్డుపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. వారు ఎంతకూ లేవకపోవడంతో త్రీ టౌన్ ఎస్సై అంజయ్య ఆందోళనకారుల వద్దకు వెళ్లి రైట్స్ బృందం కేవలం సర్వే మాత్రమే చేస్తోందని, ఇది ప్రాథమిక దశలోనే ఉందని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ అధికారులకు చెప్పాలని సూచించారు. అయితే రైట్స్ బృందానికి తాము వినతిపత్రం అందిస్తామని, సర్వే నిలిపివేయాలని ఆదీవాసీ నాయకులు సూచించారు. వారితో నేరుగా మాట్లాడించాలని ఆదివాసీ ఐక్యకార్యచరణ సమితి జిల్లా కన్వీనర్ వాసం రామకృష్ణదొర, న్యూడెమోక్రసీ నాయకులు ఎల్.విశ్వనాథం డిమాండ్ చేశారు. దీంతో రైట్స్ సర్వే బృందానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అబ్బాస్కుమార్ పటారియా ఆదివాసీ సంఘం నాయకులతో మాట్లాడారు. తాము తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇక్కడ సర్వే చేస్తున్నామని, దీంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఏమైనా అభ్యంతరాలుంటే ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు. అప్పటికీ గిరిజనులు రోడ్డుపైనే బైఠాయించడంతో ఎస్సై అంజయ్య కలుగజేసుకుని ప్రస్తుతం ఎయిర్పోర్టుకు ఎలాం టి అనుమతులు రాలేదని, ఇది కేవలం సర్వే మాత్రమేనని నచ్చజెప్పారు. అభ్యంతరాలను రెవెన్యూ అధికారులకు తెలపాలని సూచించారు. -
ఇదేనా అభివృద్ధి?
విమానాశ్రయ నిర్మాణ భూముల సర్వేకెళ్లిన అధికారులకు చుక్కెదురు పాలకులను కంకరతేలిన రోడ్డుపై నడిపించిన కడపల్లె వాసులు శాంతిపురం: ‘వున అభివృద్ధికి ఎరుుర్పోర్టు అవసరం. భూవుులు ఇవ్వమంటే ఎలా’ అన్న పాలకులకు జనం చుక్కలు చూపించారు. తమ గ్రామాలకు తీసుకెళ్లి దుస్థితికి చేరిన రోడ్లు, అక్కడి పరిస్థితులను చూపించారు. కోతకు గురై, కంకర తేలిన రోడ్లపై అర కిలోమీటరు దూరం వరకు నడిపించారు. ఈ ఘటన సీఎం సొంత నియోజకవర్గంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎయిర్పోర్టు నిర్మాణానికి భూములు సర్వే చేసేందుకు ఢిల్లీ నుంచి అధికార బృందం వచ్చింది. వారి వెంట జెడ్పీటీసీ సభ్యురాలు శకుంతల, ఎంపీపీ పుష్ప నారాయుణస్వామి మండలంలోని కడపల్లి ప్రాంతానికి వచ్చారు. విషయం తెలుసుకున్న ఆ గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. అభివృద్ధి అంటే ఇదేనా..? అంటూ నిలదీశారు. తవు గ్రావూనికి ఉన్న వుట్టి రోడ్డు, ఊరి పరిస్థితి చూడాలని అభ్యర్థించారు. అందుకు వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు వినలేదు. జెడ్పీటీసీ సభ్యురాలు, ఎంపీపీని బలవంతంగా లాక్కెళ్లి కోతకు గురై, కంకర తేలిన రోడ్డులో దాదాపు అర కిలో మీటరు వరకు నడిపించారు. ఈ రోడ్డులో నడవలేవుంటూ వారు వూర్గ వుధ్యలోనే ఆగిపోయూరు. ఆపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు, పాలకులు అక్కడి నుంచి వెనుదిరిగారు.