breaking news
Air Force officer
-
పారాచూట్ ఫెయిల్: ఎముకలన్నీ విరిగి, పైలట్ 50 గంటల తర్వాత
ఇరాన్ భూభాగంలో అమెరికా యుద్ధ విమానం (F-15E) కూలిపోయినప్పుడు, పారాచూట్ దెబ్బతినడంతో గాల్లోంచి అత్యంత వేగంతో కిందపడి, తీవ్ర గాయాలతో 50 గంటల పాటు శత్రువుల కంటికి చిక్కకుండా తప్పించుకున్న ఒక యుఎస్ ఎయిర్ ఫోర్స్ అధికారి ("బ్రావో" అనే కోడ్ నేమ్ గల వెపన్స్ సిస్టమ్స్ ఆఫీసర్) సాహసోపేతమైన కథ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.ప్రాణాలతో బయటపడిన అమెరికా వైమానిక దళ అధికారి తొలిసారి తన అనుభవాలను అమెరికాకు చెందిన ప్రముఖ సీబీఎస్ (CBS) టీవీ షో '60 మినిట్స్' ఇంటర్వ్యూలో స్వయంగా పంచుకున్నారు. ఏప్రిల్ నెలలో అమెరికా F-15Eఇరాన్ గగనతలంలో కూలిపోయింది. పారాచూట్ పనిచేయక, గంటకు 161 కి.మీ వేగంతో పడిపోయినా ప్రాణాలతో బయటపడ్డారు. అనేక ఎముకలు విరిగినప్పటికీ పర్వతాన్ని ఎక్కి, ఇరాన్ బలగాల నుంచి దాదాపు 50 గంటల పాటు తప్పించుకుని ప్రాణాలు బయటపడ్డారు.ఏప్రిల్ 2న ఇరాన్ డ్రోన్, క్షిపణి కార్యక్రమాలకు సంబంధించిన పారిశ్రామిక సౌకర్యాలపై దాడి చేస్తున్న 'DUDE 44' అనే ఎఫ్-15ఈ (F-15E) ఫైటర్ జెట్‌లో బ్రావో వెపన్స్ సిస్టమ్స్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఆ సమయంలో ఆ విమానాన్ని భుజంపై నుంచి ప్రయోగించే క్షిపణి ఢీకొట్టింది.పారాచూట్ వైఫల్యంఏదో ఒక సరుకు రవాణా రైలు వచ్చి గుద్దినట్లు అనిపించిందని బ్రావో చెప్పారు. కొన్ని క్షణాల్లోనే సిబ్బంది ఇద్దరూ పారాచూట్ ద్వారా బయటపడ్డారు. పైలట్ అయిన 'ఆల్ఫా' సురక్షితంగా కిందకు దిగగా, బ్రావో దాదాపు ఐదు మైళ్ల దూరంలో గరుకైన పర్వత ప్రాంతంలో పడ్డారు. ఈ దాడిలో బ్రావో పారాచూట్ దెబ్బతిని సరిగ్గా తెరుచుకోలేదట. దీంతో అత్యంత వేగంతో కిందపడిన క్షణాలు జీవితంలో అత్యంత భయానకమైనవనీ అని పేర్కొన్నారు.ఫ్రీ-ఫాల్లా, గంటకు దాదాపు 161 కి.మీ వేగంతో నేలను ఢీకొట్టారు. దీంతొ ఆయన వెన్నుపూస, చేయి, భుజం ఎముకలు విరిగిపోయాయి. చీలమండ బెణికింది, తలపై, ముఖంపై గాయాలయ్యాయి. అయినా తాను ప్రాణాలతో బయటపడటాన్ని ఆయన "ఆధునిక కాలపు అద్భుతం" అని అభివర్ణించారు.ఎలా బయటపడ్డారు తీవ్ర గాయాలు బాధపెడుతున్నప్పటికీ కూలిన ప్రదేశం నుంచి దూరంగా వెళ్లి కొండపైకి ఎక్కారు బావో. ఏదైనా ఆశ్రయం దొరుకుతుందనే నమ్మకంతో సుమారు 7వేల అడుగుల ఎత్తులో ఉన్న రిడ్జ్లైన్కు (కొండ శిఖరపు అంచు) చేరుకున్నారు. ఇరాన్ టీవీలో కనిపించ కూడదనే పట్టుదలే ముందుకు నడిపించిందన్నారు.మరోవైపు అమెరికా బలగాలు ఆల్ఫాను గుర్తించి ఒక సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టాయి. 21 విమానాలతో కూడిన ఈ ఆపరేషన్‌లో రెండు హెలికాప్టర్లను పంపగా, రెస్క్యూ సిబ్బందిపై ఎదురుకాల్పులు జరిగాయి. ఆల్ఫాను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చినప్పటికీ, బ్రావో ఆచూకీ దొరకలేదు. ఎట్టకేలకు బ్రావో అమెరికా బలగాలకు తాను బతికే ఉన్నానని సమాచారం అందించారు. ఆ తర్వాత ఆహారం, నీరు లేకుండా మరో రోజును పర్వతాల మధ్య గడిపారు. ఈలోగా అమెరికా బలగాలు రెండో రెస్క్యూ ఆపరేషన్‌కు ప్లాన్ చేశాయి.సీఐఏ సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. దాడి జరిగి దాదాపు రెండు రోజుల తర్వాత, దాదాపు 92 మంది స్పెషల్ ఆపరేటర్లు ఇరాన్‌లోకి ప్రవేశించి బ్రావోను రక్షించారు. చివరికి ఇద్దరు ఎలైట్ ఎయిర్ ఫోర్స్ పారాసెస్క్యూ ఆపరేటర్లు ఆ కొండ శిఖరంపై ఉన్న బ్రావోను చేరుకున్నారు.ఇదీ చదవండి: గురుగ్రామ్‌లో ఏం జరుగుతోంది..‘అయితే నామాట.. లేదంటే థార్‌మాట’!ఈ ఆపరేషన్ అక్కడితో ముగియలేదు. రెస్క్యూ విమానం తాత్కాలిక ఎడారి రన్‌వేలో కూరుకుపోవడంతో, 90 మందికి పైగా యూఎస్ సిబ్బంది ఇరాన్‌లోనే చిక్కుకుపోయారు. చివరకు వారందరినీ సురక్షితంగా తరలించి, సున్నితమైన సాంకేతికత శత్రువుల చేతికి చిక్కకుండా ఉండేందుకు అమెరికా సైన్యం ఆ విమానాన్ని కూడా ధ్వంసం చేసింది.దాదాపు 50 గంటల తర్వాత బ్రావో సురక్షిత ప్రాంతానికి చేరు కున్నారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి అమెరికా సైనిక బృంద స్ఫూర్తి, శిక్షణ, నాయకత్వమే కారణమని ఆయన కొనియాడారు. తిరిగి విమానాలు నడపడం ప్రారంభించిన ఆల్ఫా, భద్రతా కారణాల దృష్ట్యా '60 మినిట్స్' ఇంటర్వ్యూ ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ, ఇద్దరు సిబ్బందిని రక్షించడంలో కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఇదీ చదవండి: మహిళా బైకర్ ఘటనలో ట్విస్ట్ : కారు ఓనర్ కీలక ప్రకటన -
కర్ణాటకలో మరో దారుణం.. ఐఏఎఫ్ ఆఫీసర్‌పై ఘోరమైన దాడి
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓమ్ ప్రకాష్ హత్య ఉదంతం ఇప్పటికే సంచలనంగా మారితే, ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిపై విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన సోమవారం చోటు చేసుకంది. సదరు అధికారి భార్యతో కలిసి కారులో ఎయిర్ పోర్టుకు వెళుతున్న సమయంలో దారి కాచి కొంతమంది వ్యక్తులు దారుణంగా దాడికి పాల్పడ్డారు. బైక్ కీతో ముఖంపై పిడుగుద్దులు కురిపించి తీవ్రంగా గాయపరిచారు. పక్కనున్న ఆఫీసర్ భార్యపై దుర్భాషలాడారు.వివరాల్లోకి వెళితే.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వింగ్ కమాండర్ గా పని చేస్తున్న బోస్.. ఈరోజు(సోమవారం) ఉదయం భార్యతో కలిసి ఎయిర్ పోర్ట్ కు వెళుతున్నాడు. భార్య కారు డ్రైవ్ చేస్తుండగా, బోస్ పక్క సీట్లో కూర్చున్నాడు. ఇంతలో మమ్మల్ని దాటుకుని వచ్చిన ఒక బైక్ మా కారుకు అడ్డంగా ఆగింది. బైక్ పై నుంచి దిగిన ఓ వ్యక్తి మమ్ముల్ని కన్నడలో తిట్టడం ప్రారంభించాడు. వారు మా కారుకు అంటించి ఉన్న డీఆర్డీవో స్టిక్కర్ చూశారు. మీరు డీఆర్డీవో వారా అంటూ నిలదీశాడు. మా భార్యను కూడా తిట్టడం ప్రారంభించారు. నేను భయపడలేదు. ఆ సమయంలో కారు నుంచి కిందకు దిగాను. ఓ వ్యక్తి తన బైక్ తాళం చెవితో నా నుదుటిపై దాడి చేశాడు. నా ముఖానికి తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. ఆర్మీకి చెందిన వారిని ఇలానే ట్రీట్ చేస్తారా అని మనసుకు బాధగా అనిపించింది.వారు చేసిన దాడి నుంచి ఏదో రకంగా తప్పించుకుని బయటపడ్డాం. ఇక్కడ మాకు దేవుడు సాయం చేశాడు. దీనిపై ఫిర్యాదు చేస్తాం. వారు ఎందుకు మాపై దాడి చేశారో తెలియడం లేదు. ప్రతీకారం తీర్చుకోకుండా ఉండే శక్తిని దేవుడు నాకు ఇస్తాడనే అనుకుంటున్నా. ఒకవేళ మాకు న్యాయం జరగకపోతే కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటా’ అని ఐఏఎఫ్ అధికారి తెలిపాడు.A Wing Commander of the Indian Air Force, brutally assaulted in bangalore today’s morning all over language issueHe explains everything in the video after getting Aid! pic.twitter.com/R05dt3faUk— Chauhan (@Platypuss_10) April 21, 2025 -
పాక్ మహిళ హనీట్రాప్.. భారత ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి ఏం చేశాడంటే..
దేశంలో ఇప్పటికి ఎన్నో హనీట్రాప్ కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో హనీట్రాప్ ఉదంతం కలకలం సృష్టించింది. దాయాది దేశం పాకిస్తాన్‌కు చెందిన ఓ మహిళ.. భారత వైమానిక దళానికి చెందిన అధికారిని హనీట్రాప్ చేసింది. దీంతో సదరు అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. పాక్‌కు చెందిన మహిళ హనీ ట్రాప్‌లో చిక్కుకుని దేశ భద్రతకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని లీక్ చేసినట్లు భారత వైమానిక దళానికి చెందిన అధికారి దేవేంద్ర శర్మపై ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు, ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు.. సోషల్ మీడియాలో శర్మను పాక్ మహిళ ట్రాప్ చేసినట్టు గుర్తించారు. దేవేంద్ర శర్మను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, శర్మ ద్వారా దేశ భద్రతకు సంబంధించిన వివరాలు లీక్ అవుతున్నట్టు తెలుసుకున్నారు. మే 6న కస్టడీలోకి తీసుకోగా.. మే 12న (గురువారం) విచారణ ప్రారంభించినట్టు తెలిపారు. ఈ విచారణలో భాగంగా శర్మ నుంచి ఆధారాలు, సాక్ష్యాలు సేకరించిన తర్వాతే అరెస్ట్ చేసినట్టు స్పష్టం చేశారు. ఇక, దేవేంద్ర శర్మ.. ఢిల్లీ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. ఈ లీకేజీ వ్యవహారం బయటకు రావడంతో శర్మను సర్వీస్ నుంచి తొలగించినట్టు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: వైద్యుల నిర్వాకం.. బాలికకు తెలియకుండా మత్తుమందు ఇచ్చి.. -
పాక్‌కు గూఢచర్యం.. భారత సైన్యంలో పెను కలకలం
సాక్షి, న్యూఢిల్లీ : భారత నిఘా వర్గాల్లో ఓ వార్త కలకలం రేపింది. పాక్‌కు గూఢచర్యం ఆరోపణలతో ఓ ఉన్నతాధికారిని భద్రతా బలగాలు గురువారం అర్ధరాత్రి దాటాక అదుపులోకి తీసుకున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కెప్టెన్ అరుణ్ మార్వా ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. గత కొన్ని నెలలుగా ఐఎస్ఐకి ఆయన కీలక సమాచారాన్ని అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ఐఎస్ఐ అధికారికి అరుణ్ తన వాట్సాప్ ద్వారా ఫోటోలు, కొన్ని పత్రాలను పంపించారు. కీలకమైన సమాచారాన్నే ఆయన పాక్ నిఘా సంస్థకు అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం అరుణ్‌ని రహస్య ప్రాంతానికి తరలించి విచారణ చేపట్టారు. -
అది ప్రమాదమా? హత్యా?
కోల్ కత్తా ఎయిర్ ఫోర్స్ అధికారి అభిమన్యు గౌడ్ మరణానికి కారణమైన కారు ప్రమాద ఘటన.. కేవలం ప్రమాదవశాత్తూ జరిగిందా .. లేదంటే దీని వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ ఘటన జరిగిన సమయంలో ఆడీ కారు డ్రైవింగ్ సీట్ లో తృణముల్ కాంగ్రెస్ నేత మహ్మద్ షోహ్రబ్ కుమారుడు సంబియా ఉన్నారని సమాచారం. అంతకు ముందు షోహ్రబ్ పెద్ద కుమారుడు అంబియా ఉన్నట్లు వార్తలు వచ్చినా.. పోలీసులు మాత్రం సంబియా డ్రైవింగ్ చేస్తున్నాడని తేల్చారు. అయితే ప్రమాదం జరిగిన నాటి నుంచి షోహ్రబ్ తో పాటు.. అతడి ఇద్దరు కుమారులు పరారీలో ఉన్నారు. మరో వైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు. సిట్ దర్యాప్తు చేపట్టి 48 గంటలు గడిచినా.. ఇప్పటి వరకూ ఈ కేసులో ఒక్కరిని కూడా అర్టెస్టు చేయక పోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఈనెల 13న కోలకతాలో రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సిల్స్ చేస్తుండగా విమానయాన అధికారి అభిమన్యు గౌడ్ ను కారు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ రోజు ఉదయం... రిపబ్లిక్ డే పెరేడ్ రిహార్సిల్స్ జరిగే రోడ్డులోకి ఘటనకు కారణమైన కారు ప్రవేశించేందుకు ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ రోడ్డులోకి కారును పోలీసులు అనుమతించలేదు. తర్వాత కాసేపటికే ఆడీ కారు దగ్గరలోని మరో ప్రవేశమార్గం నుంచి రాంగ్ రూట్ లో వచ్చింది. ఘటనకు ముందు కారు సిగ్నల్ జంప్ చేసినట్లు సీసీ ఫుటేజీల్లో రికార్డైంది. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ కారు నంబర్ ప్లేట్ తొలగించి... అక్కడి నుంచి పరారయ్యాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా ఈ కేసు విచారణపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ఈ అంశం మీద సీపీఎం ఎంపీ మహ్మద్ సలీమ్ కోల్ కత్తాలో మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన ఐదు గంటల వరకూ పోలీసులుఎలాంటి చర్య చేపట్టలేదన్నారు. వెంటనే కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ఉంటే బాగుండేదని, అలా చేయకపోవడం వల్ల ఘటనకు కారణమైన వారు తప్పించుకోవడానికి తగినంత సమయం దొరికిందని విమర్శించారు.


