breaking news
Air-conditioned
-
ఇక ఆపుకోనక్కర లేదు
సాక్షి, హైదరాబాద్: నీళ్లు తాగటానికి ఒకటికి నాలుగుసార్లు ఆలోచించే పరిస్థితి.. మూత్ర విసర్జన చేయాల్సి వస్తుందనే భయం. మూత్ర విసర్జనకు వెళ్లాలంటే రైలు ఆగే స్టేషన్ రాకకోసం ఎదురుచూడాల్సిందే. అందుకు ఒక్కోసారి ఐదారు గంటలైనా పట్టొచ్చు. ఇది రైళ్లను క్షేమంగా గమ్యం చేర్చే లోకో పైలట్లు, సహాయ లోకోపైలట్ల దుస్థితి.ముఖ్యంగా మహిళా లోకోపైలట్ల ఆవేదనపై సాక్షి పత్రిక ‘ఆపుకోలేని ఆవేదన’పేరిట కథనాన్ని కూడా ప్రచురించింది. ఈ సమస్యను పరిష్కరించాలని ఇంతకాలానికి రైల్వే శాఖ నిర్ణయించింది. రైళ్ల ఇంజిన్ క్యాబిన్ (లోకో)లలో యూరినల్స్, ఏసీ వసతి, ఆధునిక ఎర్గోనామిక్ సీట్ల ఏర్పాటును తప్పనిసరి చేసింది. దీంతో లక్షన్నర మంది లోకో, అసిస్టెంట్ లోకోపైలట్లకు పెద్ద ఉపశమనం లభించనుంది. యూరినల్స్ ఏర్పాటు ప్రారంభం కొత్తగా తయారు చేసే అన్ని లోకో క్యాబిన్లలో యూరినల్స్, ఏసీ, ఎర్గోనామిక్ సీట్ల ఏర్పాటు కోసం వాటి డిజైన్లను రైల్వేశాఖ మార్చింది. ఇప్పటికే వినియోగిస్తున్న లోకోమోటివ్‌లలో వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. హైదరాబాద్‌లోని లాలాగూడ, మౌలాలి లోకోòÙడ్లతోపాటు కాజీపేట, విజయవాడ, గుత్తిలలోని లోకోòÙడ్లలో ఈ పనులు ప్రారంభించారు. తొలుత గూడ్సు రైళ్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ఇప్పటికే 42 లోకోమోటివ్‌లలో ఏర్పాటు చేశారు. ఇంజిన్‌ను పరిశీలించేందుకు వీలుగా ఉన్న కారిడార్‌లో చిన్న క్యాబిన్ ఏర్పాటుచేసి, అందులో యూరినల్స్ కమోడ్ ఏర్పాటు చేస్తున్నారు. లోకోమోటివ్‌లలో నీటి వసతి ఉండదు కాబట్టి టాయిలెట్ కాకుండా యూరినల్స్ వసతి మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ కోచ్ నాలుగు రోజులకోసారి స్పెషల్ క్లీనింగ్‌కు షెడ్డుకు వెళ్తుంది. అప్పుడు అందులోని మానవ వ్యర్ధాలను తొలగిస్తారు. కానీ, లోకోమోటివ్ 90 రోజులకోసారి మాత్రమే షెడ్డుకు వెళ్తుంది. అప్పటి వరకు వ్యర్ధాలు నిల్వ ఉంచలేరు. ఎర్గోనామిక్ సీట్లు.. గతంలో 90 డిగ్రీల కోణంలో సీట్లు ఉండేవి. ఇవి ఏమాత్రం అనుకూలంగా ఉండేవి కాదు. వీటిల్లో ఎక్కువ గంటలు కూర్చుని పనిచేస్తే నడుము, వెన్నెముఖ నొప్పులొస్తున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మహిళా సిబ్బంది మరింత ఇబ్బందికి గురవుతున్నారు. ఇప్పుడు వీటి స్థానంలో ఎర్గోనామిక్ సీట్లను ఏర్పాటు చేస్తున్నారు. మంచినీళ్లు కూడా తాగేవాళ్లం కాదుపురుషులతో సమానంగా ఈ కష్టతరమైన పనిచేయటాన్ని సవాల్‌గా తీసుకుని ఈ ఉద్యోగంలో చేరా. కానీ లోకోమోటివ్లలోని ప్రతికూల పరిస్థితులు ఈ సవాల్‌ను మరింత కఠినతరం చేశాయి. మంచినీళ్లు తాగితే మూత్రవిసర్జన చేయాల్సి వస్తుందన్న భయంతో నీరు కూడా తాగకుండా పనిచేస్తూ వస్తున్నాం. రైల్వే శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయం మాకు పెద్ద వరం లాంటిదే. - డి.దుర్గాభవాని, సీనియర్ అసిస్టెంట్ లోకోపైలట్టాయిలెట్ వసతి కూడా ఏర్పాటు చేయాలి దశాబ్దాల మా సమస్యలకు పరిష్కారంగా రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం ఎంతో సంతోషాన్నిచ్చింది. యూరినల్స్కే పరిమితం కాకుండా, టాయిలెట్ వసతి కూడా ఏర్పాటు చేస్తే సమస్యకు పూర్తి పరిష్కారం లభించినట్టవుతుంది. - పి.రవీందర్, చీఫ్ లోకో ఇన్స్పెక్టర్ -
మీ శక్తిని తెలుసుకోండి!
మీ దగ్గర ఓ కారు ఉందనుకోండి. అది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, విలాసవంతమైన కార్లలో ఒకటి. 10 సెకన్లలోపే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దాని ప్రత్యేకత. ఆ కారు విశేషాల గురించి ఇక చెప్పాల్సిన పనిలేదు. మెత్తటి తోలు సీట్లు, చల్లదనాన్నిచ్చే ఎయిర్ కండీషన్ వ్యవస్థ, సంగీతాన్ని ఆస్వాదించేందుకు స్టీరియో సౌండ్ సిస్టమ్, లోపల అదిరిపోయే అలంకరణ వంటివి ఉన్నాయి. అంటే.. కార్ల ప్రేమికులు కోరుకునే అన్ని లక్షణాలు దానికి ఉన్నాయి. కానీ, ఒక చిన్న సమస్య ఉంది. మీ కారు బ్రేకులు జామ్ అయ్యాయి. యాక్సిలరేటర్‌ను కాలుతో ఎంత బలంగా తొక్కినా ముందుకు కదలడం లేదు. ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించడం లేదు. అప్పుడు మీరేమనుకుంటారు? ఇంతటి చెత్త కారు ఎక్కడా ఉండదని చిరాకు పడతారు. నిజమేనా? మనం కూడా ఆ కారు లాంటివాళ్లమే. ప్రపంచం కోరుకుంటున్న అన్ని లక్షణాలు మనలోనూ అంతర్గతంగా ఉన్నాయి. అనుకున్నది సాధించేందుకు కావాల్సిన అన్ని శక్తిసామర్థ్యాలు మనలో దాగి ఉన్నాయి. కాకపోతే మనపై మనకు నమ్మకం లేకపోవడంతోపాటు మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నాం. సాధించే శక్తి మనలో లేదనే అపోహ వల్ల జీవితంలో ఎదగలేకపోతున్నాం. బ్రేక్‌పై నుంచి కాలు తీసేయండి మన కారు కదలక మిగిలిన కార్లు మనల్ని దాటుకొని ముందుకు దూసుకెళ్తుంటే మనకు అసహనం కలుగుతుంది. దేవుడికి మనపై దయ లేదని చింతిస్తాం. ఎక్కడ లేని నిరాశ ఆవహిస్తుంది. పనికిరాని మన కారును మార్చేయాలని నిర్ణయించుకుంటాం. కానీ, ఒక్కసారి బ్రేకుపై ఉన్న కాలును వెనక్కి తీసుకుంటే.. మన కారు, మన జీవితాలు నిస్సందేహంగా రేసు గుర్రాల్లా ముందుకు పరుగెత్తుతాయి. అపనమ్మకాలను వదిలించుకోండి మీ జీవితం అనుకున్న విధంగా ముందుకు సాగనప్పుడు, కెరీర్లో ఆశించిన ఎదుగుదల లేనప్పుడు.. ఇతరులను నిందించవద్దు. ‘నేను సాధించలేను, నావల్ల కాదు’ అనే అపనమ్మకాలను వదిలించుకోండి. మీ గురించి మీరు తక్కువగా అంచనా వేసుకోకండి. అప్పుడు మీ జీవితాల్లో వచ్చిన మార్పును చూసి మీరు ఆశ్చర్యపోతారు. అపజయం ఎదురైతే సాకులు చెప్పొద్దు మనకు చాలా దూరంలో ఓ వ్యక్తి నివసించేవాడు. ఒకరోజు ఓ దేవత అతడి ఎదుట ప్రత్యక్షమైంది. నువ్వు కోరుకుంటున్న సంపద మొత్తం నీ ఇంటి పక్కనున్న తోటలోనే ఉంది. అక్కడ తవ్వితే బంగారం, వజ్రాలు, మణులు, మాణిక్యాలు లభిస్తాయి. అదంతా నీదే. ఆ నిధిని తవ్వి తెచ్చుకొని జీవితాంతం సుఖంగా జీవించు అని చెప్పింది. తోటలో ఓ తెల్లటి కుందేలు కూడా ఉందని, దాని గురించి ఆలోచిస్తే నిధి దక్కదని తెలిపింది. ఆ వ్యక్తి తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు వెళ్లాడు. కానీ, నిధిని దక్కించుకోలేకపోయాడు. ఎందుకని అడిగితే.. కుందేలుపై నెపం వేశాడు. అది అడ్డుపడడం వల్లే సంపద పొందలేకపోయానని కుంటిసాకులు చెప్పాడు. తన ప్రయత్నంలో లోపం ఉందని మాత్రం అంగీకరించ లేదు. మిమ్మల్ని వెనక్కి లాగుతున్నదేంటి? నిర్దేశించుకున్న లక్ష్యాలు కొన్నిసార్లు చేతికి అందేంత దూరంలోనే ఉంటాయి. అయినా వాటిని అందుకోలేం. అప నమ్మకాలు మన శక్తిని మనం తెలుసుకోకుండా చేస్తాయి. మన వైఫల్యాలకు అర్థంపర్థం లేని కారణాలను చూపేందుకు ప్రయత్నిస్తాం. కుటుంబ నేపథ్యం, బాల్యం, సరైన విద్య లేకపోవడం, ప్రస్తుత ఆర్థిక స్థితి.. తదితర కారణాలు చెబుతాం. విజయం వైపు అడుగులేయకుండా మిమ్మల్ని వెనక్కి లాగుతున్న అంశాలేమిటో మొదట గుర్తించండి. దాన్ని మీ మనస్సు నుంచి శాశ్వతంగా తొలగించండి. బ్రేకుపై నుంచి కాలును వెనక్కి తీసుకుంటేనే కారు ముందుకు కదులుతుందని తెలుసుకోండి. -‘కెరీర్స్ 360’ సౌజన్యంతో