breaking news
ADP Research Institute
-
ఓవైపు ఉద్యోగ భయం.. మరోవైపు భారీ వాడకం!
అన్నింటా ఏఐ వినియోగం పెరిగింది. దీంతో రోజుకొక కొత్త ఏఐ టూల్ పుట్టుకొస్తోంది. ఇదే క్రమంలో ఏఐ విస్తృతితో కంపెనీలు ఉద్యోగాలను తగ్గిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. రాబోయే మరింతగా ఉద్యోగాల కోత ఉంటుందన్న ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఉద్యోగుల భయాలను తొలగిస్తూ హమ్మయ్య అనిపించే తాజా నివేదిక ఒకటి వెల్లడైంది. ఉద్యోగాల తొలగింపుల భయాలు ఒకవైపు ఉన్నా మరోవైపు ఏఐ వినియోగంలో మనోళ్లు దూసుకెళ్తున్నారు.ఏఐ వినియోగంలో అగ్రస్థానంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా ఏఐ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని సుమారు 41 శాతం మంది ఉద్యోగులు ప్రతిరోజూ ఏఐని ఉపయోగిస్తుండగా, 80 శాతం మంది వారంలో నాలుగైదు సార్లు వాడుతున్నారు. సర్వేలో పాల్గొన్న అన్ని దేశాల కంటే ఇది అత్యధికం. ఇటువంటి పరిస్థితుల్లో సంస్థలు తమ ఉద్యోగులకు స్పష్టమైన కెరీర్ మార్గాలను చూపాలని, నిరంతర నైపుణ్యాభివృద్ధిపై పెట్టుబడులు పెట్టాలని హెచ్ఆర్, పేరోల్ సొల్యూషన్స్ సంస్థ ‘ఏడీపీ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఆసియా’ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ గోయల్ తెలిపారు. సేవా రంగం విస్తృతంగా ఉన్న భారత్ వంటి దేశాల్లో ఆపరేషనల్, ప్రాసెస్ ఆధారిత పనుల్లో లక్షలాది మంది ఉన్నారు. అందువల్ల ఏఐ సాంకేతికతతో పాటు ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలను నేర్పించడం సంస్థల బాధ్యత’’ అని రాహుల్ గోయల్ పేర్కొన్నారు.ఏఐతో ఉద్యోగాలు పోవు..‘ఆఫీసు కార్యకలాపాల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ఉద్యోగాలు అంతరించిపోతాయనే ఆందోళనల్లో నిజం లేదు. ఏఐ వాడకంతో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగి, సంస్థల ఉత్పాదకత మరింత పెరుగుతుంది’ అని హెచ్ఆర్, పేరోల్ సొల్యూషన్స్ సంస్థ ‘ఏడీపీ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఆసియా’ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ గోయల్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు ఉద్యోగుల్లో ఒకరు రోజువారీ పనుల్లో ఏఐని ఉపయోగిస్తున్నారు. దైనందిన జీవితంలో సాంకేతికత ఎంత వేగంగా భాగమైందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని పరిశోధనా సంస్థ ‘ఏడీపీ రీసెర్చ్’ తాజాగా విడుదల చేసిన ‘పీపుల్ అట్ వర్క్ 2026’ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల ఆలోచనా విధానాన్ని తెలుసుకునేందుకు ఏడీపీ రీసెర్చ్ సంస్థ 36 దేశాల్లోని 39,000 మందికి పైగా ఉద్యోగులపై ఈ వార్షిక గ్లోబల్ వర్క్‌ఫోర్స్ సర్వేను నిర్వహించింది. -
‘AI’ ఎసరు .. భయాందోళనలో భారతీయ ఉద్యోగులు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో అభద్రత భావం ఎక్కువ అవుతోందని.. భారత్‌లో 47 శాతం మంది ఉద్యోగుల అభిప్రాయం ఇదేనని ఏడీపీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సర్వేలో వెల్లడైంది. ‘‘ఆర్థిక అనిశ్చితులు, ఆటుపోట్ల తరుణంలో ఉద్యోగులు తమ ఉద్యోగం విషయంలో ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ప్రముఖ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించడానికి తోడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల మానవ ఉద్యోగాలకు ఎసరు ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ఉద్యోగుల్లో ఈ అభిప్రాయాలు నెలకొన్నాయి’’అని ఏడీపీ ఎండీ రాహుల్ గోయల్ తెలిపారు. దాదాపు అన్ని దేశాల యువ ఉద్యోగుల్లో ఉద్యోగ అభద్రత ఎక్కువగా ఉందని ఈ సర్వే తెలిపింది. 55 ఏళ్ల వయసువారితో పోలిస్తే 18–24 ఏళ్లలోని జెనరేషన్ జెడ్ ఉద్యోగుల్లో అభద్రతా భావం రెట్టింపు స్థాయిలో ఉన్నట్టు వెల్లడించింది. ‘‘చాలా సంస్థలు ప్రతిభావంతులను గుర్తించడం, వారిని అట్టిపెట్టుకునే విషయంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కనుక కొందరు ఉద్యోగులు భావిస్తున్నంత దారుణ పరిస్థితులు లేవు’’అని గోయల్ చెప్పారు. ► మీడియా, సమాచార ప్రసార పరిశ్రమలో అంతర్జాతీయంగా ఎక్కువ ఉద్యోగ అభద్రత నెలకొంది. ఆ తర్వాత ఆతిథ్యం, లీజర్ పరిశ్రమలో ఇదే విధమైన పరిస్థితి ఉంది. ► సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మంది, తమ ఉద్యోగ భద్రత కోసం అవసరమైతే ఎలాంటి వేతనం లేకుండా అదనపు గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ► అంతర్జాతీయంగా జెనరేషన్ జెడ్ ఉద్యోగులు ప్రతి ఐదుగురిలో ఒకరు గత 12 నెలల్లో పరిశ్రమలు మారడాన్ని పరిశీలించినట్టు తెలిపారు. పావు వంతు మంది సొంత వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నట్టు చెప్పారు. ► 55 ఏళ్లకు చేరిన 17 శాతం మంది మందుస్తు రిటైర్మెంట్ పట్ల సానుకూలత చూపించారు. భరోసా అవసరం.. ‘‘ఈ సర్వే ఫలితాల ఆధారంగా చూస్తే.. తమకు విలువైన ఆస్తి అంటూ ఉద్యోగులకు కంపెనీలు భరోసా కలి్పంచాల్సిన అవసరం ఉంది. వారి కృషిని గుర్తించాల్సి ఉంది. సంస్థలో వారికి మెరుగైన భవిష్యత్తు ఉంటుందన్న భరోసా అవసరం. లేదంటే కంపెనీలు కీలకమైన నైపుణ్యాలను, అనుభవాన్ని నష్టపోవాల్సి వస్తుంది. దీంతో తమ క్లయింట్లకు సేవలు అందించడంలో సమస్యలు ఎదురు కావచ్చు’’అని గోయల్ అభిప్రాయపడ్డారు. -
ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో, ఆందోళనలో సగం మంది భారతీయులు!
ప్రపంచ వ్యాప్తంగా ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వారి జాబ్ విషయంలో అభద్రతా భావానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. వారిలో భారతీయులు 47 శాతం మంది ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఏడీపీ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ‘పీపుల్ ఎట్ వర్క్ 2023: ఏ గ్లోబల్ వర్క్‌ఫోర్స్ వ్యూ’ పేరిట సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో 47 శాతం మంది సిబ్బంది తమ కొలువుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడీపీ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ 32,000 మందిపై సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో సగానికి పైగా జెన్ జెడ్ (18- 24ఏళ్ల వయస్సు) వారు చేస్తున్న ఉద్యోగం పట్ల నమ్మకంతో లేదనే తెలుస్తోంది. 55ఏళ్ల వయస్సు వారిలో సైతం ఈ తరహా ఆందోళనలు రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు నివేదిక హైలెట్ చేసింది. ముఖ్యంగా, ఈ తరహా ఆందోళనలు రియల్ ఎస్టేట్,కన్స్ట్రక్షన్ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఎక్కువ మంది ఉన్నారు. అంతర్జాతీయ జాబ్ మార్కెట్లో మీడియా, ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీ ఉద్యోగాలపై అపనమ్మకంతో ఉన్నారు. ఆయా రంగాలతో పాటు ఆతిధ్యం, ఎంటర్టైన్మెంట్ వంటి రంగాల్లో పనిచేస్తున్న తమ జాబ్ ఉంటుందో..ఊడుతుందోనన్న అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. కారణాలు అనేకం మొత్తం వర్క్ ఫోర్స్‌లో యువతే అభద్రతకు లోనవుతున్నారు. అందుకు అనేక కారణాలు ఉన్నాయని ఏడీపీ ఎండీ రాహుల్ తెలిపారు. ఇటీవల కాలంలో ఆర్ధిక అనిశ్చితి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్, ట్విటర్, మెటాలాంటి సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్స్ మనుషులు చేస్తున్న ఉద్యోగాలకు మరింత ప్రమాదంలోకి నెట్టే ప్రమాదం ఉందని వెలుగులోకి వస్తున్న నివేదికలే యువతలో ఆందోళనకు కారణమని తెలిపారు. జాబ్ మార్కెట్లో నైఫుణ్యం ఉన్న వారిని గుర్తించడంలో, వారిని ఉద్యోగంలో కొనసాగించడం మరింత కష్టంగా మారినట్లు రాహుల్ గోయల్ గుర్తించామని అన్నారు. సంస్థలు తమ ఉద్యోగులకు భరోసా ఇవ్వకపోతే అనుభవాల్ని, ఉత్సాహాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. తద్వారా క్లయింట్లకు ఆశించిన స్థాయిలో సేవల్ని అందించడంలో కష్టతరం మారుతుందని చెప్పారు. దిగ్రేట్ రిజిగ్నేషన్ వంటి ప్రపంచవ్యాప్తంగా, గత ఏడాది కాలంలో ఐదుగురు జెన్‌జెడ్‌లలో ఒకరు.. చేస్తున్న రంగం నుంచి మరో రంగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేశారు. పావు వంతు మంది సొంతంగా బిజినెస్ ప్రారంభించాలని ఆలోచించినట్లు తేటతెల్లమైంది. 55 ఏళ్లు పైబడిన వారిలో 17 శాతం మంది ముందస్తుగా పదవీ విరమణ చేయాలని ఆలోచించారు. ఇదే ది గ్రేట్ రిజిగ్నేషన్ వంటి అంశాలకు కారణమందన్నారు. ఉద్యోగంలో అభద్రత పోవాలంటే యజమానులు ఉద్యోగులు మార్కెట్‌కు అనుగుణంగా జీతాలు ఇవ్వగలిగితే ఈ ఆందోళన నుంచి బయట పడొచ్చు. తద్వారా ఉద్యోగులు తాము పనిచేసే సంస్థ పట్ల మరింత సానుకూలంగా భావించే అవకాశం ఉంది. చదవండి👉 ‘పాపం సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. జాబులు పోయి బైక్ ట్యాక్సీలు నడుపుకుంటున్నారు’


