breaking news
AC blast
-
22వ అంతస్తులో పేలిన ఏసీ!.. భారీ అగ్నిప్రమాదం
మరో భారీ అగ్నిప్రమాదంతో దేశ రాజధాని రీజియన్ ఉలిక్కి పడింది. నోయిడాలోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. అక్కడి ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఏసీ యూనిట్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.నోయిడా సెక్టార్-119లో ఉన్న అరణ్య సొసైటీలో సోమవారం వేకువ జామున ఈ ఘటన జరిగింది. మంటలు చెలరేగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దీంతో ఆరు ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టాయి. ఘటనాస్థలికి గౌతమ్‌బుద్ధ్‌నగర్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ (CFO), స్థానిక పోలీసులు కూడా చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. అగ్నిమాపక సిబ్బంది అపార్ట్మెంట్లోని ఇతర నివాసితులను అప్రమత్తం చేస్తూ, మంటలు ఇతర ఫ్లాట్లకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.Fire breaks out in a high rise in sector 119, #Noida pic.twitter.com/82ZkYvGNFl— Karan Singh / करन सिंह (@Journo_Karan) June 29, 2026ప్రస్తుతం వరకు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. అయితే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చిన తర్వాతే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణంపై స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు.. ఇదిలా ఉండగా ఢిల్లీలో మాత్రం ఉష్ణోగ్రతలతో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయి. పగటి పూటే కాదు.. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణానికి మించి నమోదు కావడంతో ప్రజలు తీవ్రమైన ఉక్కపోత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఏసీలు వాడాల్సి వస్తుండగా.. షార్ట్ సర్క్యూట్‌తోనే నోయిడా ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో కూలర్లు, ఏసీల విషయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు పౌరులకు సూచిస్తున్నారు. -
ఒక్కసారిగా పేలిన ఏసీ : మాజీ ఐఏఎస్ అధికారి దుర్మరణం
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఏసీ ఇండోర్ యూనిట్ పేలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మంటలు చెలరేగి మాజీ ఐఏఎస్ అధికారి ధనేంద్ర కుమార్ (80) మృతిచెందారు.పోలీసులకు సమాచారం ప్రకారం మే 27 బుధవారం రాత్రి 11:18 గంటల ప్రాంతంలో హౌజ్ ఖాస్‌లోని ఆర్-15 నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది, ఇంట్లోని ఏసీ ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం వల్లే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తీవ్రంగా గాయపడిన ధనేంద్ర కుమార్‌కు ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రికి తరలించారు. కానీ దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక ట్రామా సెంటర్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.ప్రమాద సమయంలో ధనేంద్రకుమార్, ఆయన కుమారుడితోపాటు మరో ముగ్గురు పనివారు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, అప్పటికే ఆలస్యమైంది. ఫైర్ సిబ్బంది రెండు అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చాయి. ఇంట్లో ఉన్న ఇద్దరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారిలో ధనేంద్ర కుమార్ పొగ కారణంగా ఊపిరి తీసుకోలేక మరణించగా, ఆయన కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు ఈ ఘటనలో ఎలాంటి కుట్ర కోణం లేదని, విద్యుత్ లోపంపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.Delhi: Ramesh, domestic helper says, ''Actually, this accident happened last night. The accident happened due to short circuit. The short circuit was in the AC and that's why there was a fire. So, this accident happened...'' pic.twitter.com/5i8y6thXef— IANS (@ians_india) May 28, 2026 షార్ట్ సర్క్యూట్ : ఏసీలో షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో మంటలు చెలరేగడంతోనే ఈ ప్రమాదం జరిగిందని గృహ సహాయకుడు రమేష్ మీడియాకు వెల్లడించారు. Delhi: In South Delhi’s Hauz Khas area, a massive fire broke out late Wednesday night in house R-15 due to a short circuit. In the incident, 80-year-old retired IAS officer Dhanendra Kumar died of suffocation caused by smoke inhalation. pic.twitter.com/yZEX60EX3N— IANS (@ians_india) May 28, 2026ఎవరీ ధనేంద్ర కుమార్ ? ధనేంద్ర కుమార్ 1946లో జన్మించారు. ఆయన 1968 బ్యాచ్‌కు చెందిన ప్రతిభావంతుడైన ఐఏఎస్ (IAS) అధికారి. తన సుదీర్ఘ కెరీర్లో కేంద్ర, హర్యానా ప్రభుత్వాలలో పలు కీలక పదవుల్లో సేవలందించారు.ఈయన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తొలి ఛైర్మన్ కూడా. 2009 ఫిబ్రవరి- 2011 జూన్ వరకు పనిచేశారు. మార్కెట్లో పెద్ద కంపెనీల ఏకఛత్రాధిపత్యాన్ని అరికట్టే చట్టాలను అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కేంద్ర రక్షణ శాఖ, రోడ్డు రవాణా & రహదారుల శాఖ, సాంస్కృతిక శాఖల్లో కార్యదర్శిగా (Secretary) పలు సేవలందించారు.2005, నవంబర్ -2009, జనవరి వరకు వరల్డ్ బ్యాంక్‌లో భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్ దేశాల తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ముఖ్యంగా హర్యానా ముఖ్యమంత్రికి ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. అక్కడ పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గాను 'నేషనల్ సిటిజన్స్ అవార్డు' లభించింది. పదవీ విరమణ తర్వాత కూడా ఆయన చురుగ్గా ఉన్నారు. COMPAD సంస్థకు వ్యవస్థాపక చైర్మన్‌గా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్‌లో చీఫ్ మెంటార్‌గా సేవలందించారు. -
అపార్ట్మెంట్లో పేలిన ఏసీ
-
9 మంది ప్రాణాలను తీసిన AC.. బిల్డింగ్ బూడిద..
-
ఢిల్లీలో ఘోర ప్రమాదం.. ఏసీ పేలడంతో 9 మంది మృతి
-
Madhya Pradesh: ఆస్పత్రిలో పేలిన ఏసీ.. వ్యాపించిన మంటలు
గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్(Gwalior)లో ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి ఒక ఆస్పత్రిలో ఉన్నట్టుండి ఒక ఏసీ పేలిపోయింది. ఈ ఘటనలో ఆస్పత్రి అంతటా మంటలు వ్యాపించడంతో కలకలం చెలరేగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోనికి తెచ్చింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.గ్వాలియర్ మున్సిపల్ కార్యాలయ అధికారి అతిబల్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ ఆస్పత్రి లేబర్ రూమ్(Labor room)లో మంటలు అంటుకున్నాయని తనకు సమాచారం రాగానే, తాను ఈ విషయాన్ని ఫోనులో అగ్నిమాపకశాఖకు తెలియజేశానన్నారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారన్నారు. ఆస్పత్రిలోని ఏసీ పేలిపోయి, మంటలు అంటుకోగానే అప్రమత్తమైన సిబ్బంది అక్కడి రోగులను బయటకు తరలించారన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదని తెలిపారు. గ్వాలియర్ సబ్ డివిజినల్ మేజిస్టేట్ వినోద్ సింగ్ మాట్లాడుతూ ఎయిర్ కండిషన్డ్ గైనకాలజీ యూనిట్లో మంటలు చెలరేగాయని, ఆ సమయంలో అక్కడ దాదాపు 22 మంది ఉన్నారన్నారు. వైద్య సిబ్బంది అక్కడి నుంచి వారిని ఖాళీ చేయించారన్నారు. ఇది కూడా చదవండి: 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ హతం? -
ఏసి పేలి నలుగురి మృతి!
చెన్నై: తమిళనాడులోని వేలూరులో ఎయిర్ కండిషనర్ పేలి నలుగురు దుర్మరణం చెందారు. ఓ వ్యాపారవేత్త ఇంటిలో ఈ ఘటన జరిగింది. ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. హైఓల్టేజ్ కారణంగా ఈ పేలుడు సంభవించినట్లు భావిస్తున్నారు. ఒక ఎయిర్ కండిషనర్ పేలడం వల్ల నలుగురు మృతి చెందడంతో ఆ ప్రాంతవాసులు విస్తుపోయారు.


