breaking news
	
		
	
  Charmme Kaur
- 
            
                                     
                                                                                                         ముంబైలో ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ టీమ్ సందడి (ఫొటోలు)
- 
            
                                     
                                                                                                         Charmme Kaur: ఇన్నాళ్లకు మళ్ళీ కలిశాను (ఫొటోలు)
- 
            
                                     
                                                                                                         ఛార్మీ కౌర్ 37వ పుట్టినరోజు స్పెషల్ ఫోటోలు
- 
      
                   
                                 ఈడీ ఆఫీసులో పూరీ, చార్మీ..రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఫోకస్ చేసింది. ఈ సినిమాలో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారన్న విషయంపై లైగర్ నిర్మాతలు పూరీ జగన్నాథ్, చార్మీలను విచారిస్తోంది. గురువారం పూరీ, చార్మీ ఈడీ ఆఫీస్‌కు రాగా.. సినిమాకు సంబంధించిన నగదు లావాదేవీలపై ఈడీ వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. కాగా వీరు ఫెమా(విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం) నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు అధికారులు ఇప్పటికే పలు ఆధారాలు సేకరించారు. ఇకపోతే లైగర్ సినిమాలో రాజకీయ నేతలు బ్లాక్‌మనీని పెట్టుబడులుగా పెట్టారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఈడీకి ఫిర్యాదు కూడా అందింది. దీనికి తోడు లైగర్ నిర్మాతలు ఫెమా నిబంధనలను బ్రేక్ చేసినట్లు ఆధారాలు దొరకడంతో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పూరీ, చార్మీలకు పదిహేను రోజుల క్రితమే నోటీసులు పంపినట్లు సమాచారం. ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డ పూరీ, చార్మీతో కలిసి నేడు ఈడీ ఆఫీస్‌కు వెళ్లగా.. విదేశీ పెట్టుబడుల గురించి ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: అమెజాన్ ప్రైమ్‌లోకి కాంతార, కాకపోతే ఓ ట్విస్ట్
- 
      
                   
                                 'లైగర్' డిజాస్టర్‌పై స్పందించిన ఛార్మివిజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'లైగర్'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్‌లో ఒకటిగా లైగర్ నిలుస్తుందని అంతా భావించినా అందుకు భిన్నంగా డిజాస్టర్ టాక్ని మూటగట్టుకుంది. మైక్ టైసన్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ ఉన్నా కంటెంట్ లేకుంటే థియేరట్లకు జనాలు రారని లైగర్ మరోసారి ప్రూవ్ చేసినట్లయ్యింది. ఫలితంగా భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు నష్టాల్ని మిగిల్చిందని అంటున్నారు సినీ విశ్లేషకులు. తాజాగా ఈ సినిమా ఫెయిల్యూర్‌పై నిర్మాత ఛార్మి స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. 'జనాలు ఇంట్లో కూర్చొని ఒక్క క్లిక్‌తో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చూసే యాక్సిస్ ఉంది. కుటుంబం మొత్తం ఇంట్లోనే భారీ బడ్జెట్ సినిమాలు చూడగలరు. కాబట్టి సినిమాలు వారిని ఎగ్జైట్ చేయనంత వరకు థియేటర్లకు రావడానికి వాళ్లు ఇష్టపడటం లేదు. తెలుగులో ఇటీవల బింబిసార, సీతారామం, కార్తికేయ 2 వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. సుమారు రూ 150 కోట్ల నుంచి రూ. 170కోట్ల వరకు వసూలు చేశాయి. కానీ బాలీవుడ్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 2019నుంచి లైగర్ కోసం కష్టపడ్డాం. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత లైగర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. ఎన్నో అడ్డంకులను దాటి థియేటర్లో విడుదల చేశాం. కానీ సినిమా ఫెయిల్యూర్ అవడం బాధగా అనిపిస్తుంది' అంటూ ఛార్మి ఆవేదన వ్యక్తం చేసింది.
- 
      
                   
                                 ఛార్మితో రిలేషన్ బయటపెట్టిన పూరి జగన్నాథ్పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి కౌర్ తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ఇప్పుడు నిర్మాతగా కొనసాగుతుంది. పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో సినిమాలు చేస్తుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పటి నుంచో పూరి-ఛార్మిల మధ్య ఏదో ఉందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే ఛార్మి ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని వార్తలు వస్తున్నాయి. చదవండి: చేతిలో రూపాయి లేకపోయినా ఆఫర్‌ను రిజెక్ట్ చేశా : ఛార్మి తాజాగా ఛార్మితో తనకున్న రిలేషన్ షిప్‌ను బయటపెట్టారు పూరి జగన్నాథ్. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. 'ఛార్మీ 13 ఏళ్ల వయసప్పటి నుండి తనకు తెలుసని, దశాబ్దాలుగా ఆమెతో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. ఛార్మీకి నాకు ఏదో అఫైర్ ఉందని ఏదేదో మాట్లాడుకుంటారు. ఆమె ఇంకా యంగ్‌గా ఉండటం వల్లే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అదే అదే ఛార్మికి 50ఏళ్లు ఉంటే ఇలా మాట్లాడేవారు కాదు. ఆమెకు వేరేవాళ్లతో పెళ్లి జరిగినా పట్టించుకునేవారు కాదు. చదవండి: రాజకీయాల్లోకి హీరోయిన్ త్రిష? ఎంజీఆర్, జయలలిత దారిలో.. కానీ తామిద్దరం ఒకే ఇండస్ట్రీలో ఉండటం, ఎన్నో సంవత్సరాలుగా ట్రావెల్ అవుతుండటంతో ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. ఒకేవళ అఫైర్ ఉన్నా అది ఎక్కువరోజులు నిలబడదు. ఆకర్షణ అనేది కొన్నిరోజుల్లోనే చచ్చిపోతుంది. స్నేహమే శాశ్వతం. తామిద్దరం మంచి ఫ్రెండ్స్' అంటూ పుకార్లకు పూరి ఫుల్ స్టాప్ పెట్టారు.
- 
      
                   
                                 విజయ్ డ్యాన్స్ ఇరగదీస్తున్నాడు: చార్మీటాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబీనేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘లైగర్’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్. కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, చార్మీ, అపూర్వా మెహతా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాపై విజయ్ ఫ్యాన్స్‌కి ఉత్తేజకరమైన అప్డేట్ ఇచ్చింది చార్మీ. ‘లైగర్’ షూటింగ్‌కి గురించి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది చార్మీ. ఇప్పటి వరకు పక్కింటి అబ్బాయిలా పాత్రల్లో కనిపించిన విజయ్.. ఇందులో కొత్త అవతారంలో కనిపిస్తాడని ఈ బ్యూటీ తెలిపింది. ఈ సినిమాలో ఓ పాట కోసం ఈ రౌడీ హీరో మునుపెన్నడూ చేయని విధంగా మాస్ డ్యాన్స్‌తో ఇరగదీస్తున్నాడని చెప్పుకొచ్చింది ఈ భామ. ఆ పాట చిత్రీకరణలో కుర్ర హీరో ఎనర్జీ చూసి ఈ పోస్ట్ పెడుతున్నట్లు పేర్కొంది ఈ భామ. క్రేజీ కాంబినేషన్లో వస్తున్న మూవీ గురించి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. చదవండి: బాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ భార్యపై ట్రోలింగ్ #LIGER song shoot in mumbai , and trust me , @TheDeverakonda is dancing like never before., expect a full massy crazy feast 😉 PS - this tweet is due to the adrenaline rush I m having rite now watching this hottie ‘s energy 😍@PuriConnects @DharmaMovies pic.twitter.com/Mxm10O8KSv — Charmme Kaur (@Charmmeofficial) October 25, 2021
- 
      
                   
                                 ప్రభాస్ ఫోన్ చేసి.. సినిమాని ప్రమోట్ చేస్తానన్నాడు: పూరి‘‘రొమాంటిక్’ మూవీ ట్రైలర్ నిజంగానే రొమాంటిక్‌గా ఉంది. ఆకాష్ అద్భుతంగా నటించాడు. పదేళ్ల అనుభవం ఉన్నట్లుగా, స్టార్ స్టేటస్ వచ్చినట్లుగా లాస్ట్ షాట్లో అద్బుతంగా అనిపించాడు. యాక్టర్‌గా ఆకాష్ ఇంప్రూవ్ అయ్యాడు. అనిల్ సినిమాను బాగా డైరెక్ట్ చేశారు’’ అన్నారు ప్రభాస్. ఆకాష్ పూరి, కేతికా శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాదూరి దర్శకత్వంలో పూరి జగన్నాథ్, చార్మి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఇందులో వాస్కో పాత్రలో ఆకాష్, మౌనిక పాత్రలో కేతిక నటించారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో హీరో ప్రభాస్ ‘రొమాంటిక్’ ట్రైలర్‌ను విడుదల చేసిన వీడియోను ప్లే చేశారు. అనంతరం ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించిన పూరి జగన్నాథ్ మాట్లాడుతూ – ‘‘రొమాంటిక్’ను విడుదల చేస్తున్నామని తెలియగానే ఈ సినిమా గురించి ప్రభాస్ ఫోన్ చేసి పదే పదే అడిగారు. సినిమా గురించి ట్వీట్ వేయాలా? ఈవెంట్‌కు రావాలా? అని అడిగారు. ప్రభాస్ చాలా మంచివారు. ‘రొమాంటిక్’ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ‘డార్లింగ్..’ అంటూ సాగే ఓ స్పెషల్ సాంగ్ సర్ప్రైజింగ్గా ఉండబోతోంది. ఆకాష్, కేతిక శర్మ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినా అనిల్ ‘రొమాంటిక్’ను బాగా తెరకెక్కించాడు’’ అన్నారు చార్మి. చదవండి: ‘రొమాంటిక్’గా ట్రైలర్.. ఆకట్టుకుంటున్న ఆకాశ్ పూరీ
- 
      
                   
                                 ‘రొమాంటిక్’గా ట్రైలర్.. లాంచ్ చేసిన ప్రభాస్డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. అనంతరం హీరోగా సైతం ఎంట్రీ ఇచ్చాడు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాడూరి దర్శకుడు. కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి స్టోరీ, డైలాగ్స్ పూరినే అందించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ఆకట్టకోగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశాడు. ‘ఐ లైక్ దిస్ ఎనిమల్’ అంటూ ఆకాశ్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమయిన ఈ ట్రైలర్ ఎంతో రొమాంటిక్‌గా సాగింది. ఎంతోకాలంగా మంచి హిట్ కోసం చూస్తున్న ఈ కుర్ర హీరో ఎలాగైనా సక్సెస్ రుచి చూడాలని కసిగా ఈ సినిమాతో చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లో పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలకపాత్రలో నటిస్తోంది. సునీల్ కశ్యప్ సంగీత అందిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 29న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. చదవండి: ప్రభాస్ ‘సలార్’లో మిస్ ఇండియా మీనాక్షి చౌదరి?
- 
      
                   
                                 క్యూబిక్ స్క్వేర్స్తో పూరీకి వినూత్నంగా విషెస్ చెప్పిన అభిమానిదర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ రోజు (సెప్టెంబర్ 28న) పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను ఎంతోమంది సినీ ప్రముఖులు అభిమానులు, అభిమానులు విషెస్‌తో ముంచెత్తుతున్నారు. అయితే ఒక అభిమాని ఇస్మార్ట్‌గా విషెస్ చెప్పిన విధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆ అభిమాని క్యూబిక్ స్క్వేర్స్తో పూరీ బొమ్మ వచ్చేలా చేశాడు. అద్భుతంగా ఉన్న ఆ వీడియోని ఛార్మీ కౌర్ ట్విటర్లో షేర్ చేసింది. ‘ ఇది మైండ్ బ్లోయింగ్. చాలా కష్టమైన దీన్ని ఎలా చేశావో చెప్పు’ అంటూ క్యాప్షన్‌ని దానికి జోడించింది. అయితే అంతకుముందు పూరితో కలిసి ఉన్న ఫోటోని పోస్ట్ చేసిన ఈ బ్యూటీ ‘నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు నాపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకొంటూ, మిమ్మల్ని గర్వపడేలా చేస్తున్నాననే అనుకుంటున్నా’ అని రాసుకొచ్చింది. అయితే పవన్ కల్యాణ్ హీరోగా ‘బద్రి’తో టాలీవుడ్‌కి పరిచయమైన పూరీ మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తుపోయిన ఆయన డిఫరెంట్ డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అనంతరం మహేష్ బాబు హీరోగా చేసిన ‘పోకిరి’ సినిమాతో ఇండస్ట్రీ చరిత్రని తిరగరాసింది. కాగా ఆయన ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. This is mind blowing and extremely tough.. pls tel me how the hell did u do this man 🙉🙆♀️🤩🙏🏻😍🤩#HbdPuriJagannadh pic.twitter.com/i3Xfb2Kq6i — Charmme Kaur (@Charmmeofficial) September 28, 2021
- 
      
                   
                                 విజయ్‌పై ఛార్మి ఆసక్తికర వ్యాఖ్యలు, పోస్ట్ వైరల్కొంతకాలంగా నటి, నిర్మాత ఛార్మి వార్తల్లో నిలుస్తోంది. తను పెళ్లికి రేడీ అయిపోయిందంటూ ఇటీవల సోషల్ మీడియాల్లో రూమర్స్ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తన పెళ్లి వార్తలపై స్పందిస్తూ.. తాను అంత పెద్ద తప్పు చేయనంటూ క్లారిటీ ఇచ్చి అభిమానులకు షాకిచ్చింది ఛార్మి. తాజాగా హీరో విజయ్ దేవరకొండపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి ఛార్మి మరోసారి వార్తల్లో నిలిచింది. విజయ్‌తో కలిసి దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘నీ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. బంగారం.. 24 క్యారట్స్ గోల్డ్. నాకు, పూరి జగన్నాథ్‌కు నువ్వంటే ఎంత అపారమైన ప్రేమో’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేసింది. కాగా ఛార్మి, పూరితో కలిసి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి సంయుక్తంగా ఈ బ్యానర్‌పై 'ఇస్మార్ట్ శంకర్' సినిమా రూపొందించి భారీ సక్సెస్‌ను అందుకున్నారు. ఇక ప్రస్తుతం పూరీ విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్‌తో చార్మీ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) చదవండి: Vijay Devarakonda: ‘రౌడీ’ ఫ్యాన్స్‌కు నిరాశ.. ఇప్పట్లో కష్టమే!
- 
      
                   
                                 వైరల్: ప్రభాస్ ఫోటో షేర్ చేసిన ఛార్మినిర్మాతగా మారిన నటి ఛార్మి కౌర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఏం పోస్టు చేసిందంటే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు చెందిన ఫోటోను ఛార్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ ఫోటోలో ప్రభాస్‌తోపాటు ఛార్మి పెంపుడు కుక్క ఉంది. ‘నా తొమ్మిది నెలల బేబీ బాయ్ (కుక్కతో) డార్లింగ్ ప్రభాస్’ అంటూ కామెంట్ చేశారు. ఈ పెంపుడు కుక్క వయస్సు తొమ్మిది నెలలే అయినప్పటికీ చూడటానికి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఇది అలాస్కస్ మాలమ్యూట్ జాతికి చెందినది. ఈ ఫోటోపై ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డార్లింగ్ ఫోటో షేర్ చేసినందుకు ఛార్మీకి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారింది. చదవండి: ప్రబాస్ సినిమాకు ముప్పై కోట్లతో సెట్ కాగా ఈ ఫోటో ముంబైలోని దర్శకుడు పూరి జగన్నాథ్ కార్యాలయంలో తీసిన ఫోటో. ఇటీవల ఇటలీలో ‘రాధే శ్యామ్’ చిత్రీకరణ పూర్తిచేసుకొని ఇండియా వచ్చిన ప్రభాస్ ముంబైకు వెళ్లారు. పని నిమత్తం అక్కడకు వెళ్లిన డార్లింగ్ అనంతరం పూరి కరెక్ట్స్ ఆఫీస్‌కు వెళ్లి, అక్కడ ఛార్మి పెంపుడు కుక్కతో కాసేపు సరదాగా గడిపినట్లు సమాచారం. ఇక త్వరలోనే హైదరాబాద్ చేరుకొని తిరిగి రాధేశ్యామ్ షూటింగ్లో పాల్గొననున్నారు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమలో ప్రభాస్కుకి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఛార్మి, ప్రభాస్ రెండు చిత్రాలు చక్రం, పౌర్ణమి సినిమాల్లో నటించారు. అలాగే పూరి జగన్నాథ్‌తోనూ ఏక్ నిరంజన్, బుజ్జిగాడు సినిమాల్లో కలిసి పనిచేశారు. చదవండి: పవన్ చేతుల మీదుగా ‘గమనం’ ట్రైలర్ View this post on Instagram #Darling with my 9 months old baby boy ♥️ . . . @actorprabhas #alaskanmalamute @puriconnects A post shared by Charmmekaur (@charmmekaur) on Nov 10, 2020 at 2:59am PST
- 
      
                   
                                 చార్మీ తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్నటి, నిర్మాత చార్మీ కౌర్ తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. అక్టోబర్ 22న వారికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని ఆమె సోషల్ మీడియాలో ఆదివారం వెల్లడించారు. ప్రస్తుతం వారు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. తాజాగా వారి ఆరోగ్య పరిస్థితి గురించి ట్వీట్ చేశారు. "నా పేరెంట్స్‌ను నవ్వు ముఖాలతో చూడటం చాలా బాగుంది" అని సంతోషం వ్యక్తం చేశారు. కాగా చార్మీ ఆదివారం నాడు దసరా శుభాకాంక్షలు చెప్తూనే తన తల్లిదండ్రులకు కరోనా సోకిందంటూ అభిమానులకు ఎమోషనల్ మెసేజ్‌ను అందజేశారు. Amazing medical team of @AIGHospitals pampering my parents 😘😘 sooo nice to c my parents smiling 😘😘😘#Grateful 🙏🏻 #fighting #covid_19 pic.twitter.com/cjExfrruN5 — Charmme Kaur (@Charmmeofficial) October 26, 2020 హైదరాబాద్ వరదల వల్లే నా పేరెంట్స్‌కు కరోనా "లాక్డౌన్ ప్రారంభమైన మార్చి నుంచి వారు నిబంధనలను తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. అయినా దురదృష్టం కొద్దీ వారు కోవిడ్-19 బారిన పడ్డారు. బహుశా హైదరాబాద్ వరదల మూలాన ఇది జరిగి ఉంటుంది. ఇప్పటికే మా నాన్నకు ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఈ వార్త విని నా గుండె ముక్కలయ్యింది. వెంటనే అమ్మానాన్న ఇద్దరూ ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అక్కడ నాకు చాలాకాలంగా తెలిసిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చికిత్స అందిస్తున్నారు. వైద్య బృందం వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్రస్తుతం నా తల్లిదండ్రులు చికిత్సకు స్పందిస్తున్నారు. ఏఐజీ ఆస్పత్రి వైద్యులు, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను." (చదవండి: కరోనా: క్షమించమని కోరుతున్న ఛార్మీ) I thank @AIGHospitals and it’s total team for all the care they are taking of parents to fight #coronavirus 🙏🏻 Doctor NAGESHWAR REDDY u r my hero 🙏🏻 pic.twitter.com/OmloT8r8Sr — Charmme Kaur (@Charmmeofficial) October 25, 2020 లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకండి "నేను మీకు ఒకటే సలహా ఇస్తున్నాను. మీకు కరోనా లక్షణాలుంటే ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే పరీక్ష చేయించుకోండి. తొలిదశలోనే గుర్తించగలిగితే చాలావరకు నష్టం వాటిల్లకుండా కాపాడుకోవచ్చు. నేను నా తల్లిదండ్రులను తిరిగి ఆరోగ్యంతో చూసుకునేందుకు ఎంతో ఆతృతగా ఉన్నాను. ఆ దుర్గామాత మిమ్మల్ని చెడు నుంచి రక్షించి సంతోషాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరెంట్స్ త్వరగా కోలుకునేందుకు ప్రార్థనలు చేయండి" అని చార్మీ అభిమానులకు సూచించారు.
- 
      
                   
                                 కరోనా: క్షమించమని కోరుతున్న ఛార్మీప్రపంచమంతా కరోనా వైరస్ దెబ్బకి గజగజ వణికిపోతోంది. అయితే తాజాగా.. దేశ రాజధానితో పాటు తెలంగాణలో కరోనా కేసులు నమోదు కావడంపై ఛార్మి.. తన ట్విటర్ అకౌంట్లో కరోనా వైరస్‌కు స్వాగతం అంటూ వ్యాఖ్యలు చేయడం పై పెద్ద దుమారమే రేగుతోంది. జనం ఒక వైపు చస్తుంటే కనీస మానవత్వం లేకుండా కరోనాకు వెల్కమ్ చెబుతావా అంటూ ఆమెపై తిట్ల వర్షానికి లంకించుకున్నారు. ఆపదలో ఉన్నవారికి చేతనైతే సాయం చేయాలని, ఇలా చేయకూడదని హితవు పలికారు. చదవండి: ఢిల్లీ, తెలంగాణలలో కరోనా కేసులు నమోదు దీంతో ఛార్మి వెంటనే ఆ వీడియో డిలీట్ చేసింది. అయితే అప్పటికే నెటిజన్లు ఓ రేంజ్లో ఫైర్ అవ్వడంతో సమాధానంగా మరో ట్వీట్ చేసింది. 'నేను ఇలాంటి సందర్భంలో అలాంటి వీడియో పోస్ట్ చేయడం తప్పు. మీరు చేసిన కామెంట్స్ అన్నీ చదివాను. ఇది చాలా సున్నితమైన అంశం అని నేను భావించలేకపోయాను. ఈ చర్య పట్ల నేను క్షమాపణలు కోరుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావు' అంటూ ట్వీట్ చేసింది. చదవండి: పుకార్లపై స్పందించిన సునీతా కృష్ణన్ I have read all ur comments n I apologise for the video posted .. it was an act of immaturity for a very sensitive topic , n hence shall be carefull in my further reactions as it was of least knowledge to me the rounds it created .. pic.twitter.com/mXT95O1tFL — Charmme Kaur (@Charmmeofficial) March 2, 2020
- 
      
                   
                                 విజయ్ దేవరకొండతో బాలీవుడ్ బ్యూటీసెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫైటర్’.. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చేయబోయే ఫైట్స్ కోసం విజయ్ థాయ్‌లాండ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇప్పటికే ముంబైలో తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు టాక్. అయితే ఈ సినిమాపై సెట్స్‌పైకి వెళ్లిన హీరోయిన్, ఇతర తారాగణం విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీని ఇవ్వలేదు. తాజాగా ఈ సినిమాలో విజయ్ సరసన ఆడిపాడేదే ఎవరో పూరి బృందం అధికారికంగా ప్రకటించింది.‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో హిందీ తెరకు పరిచయమైన అనన్య పాండేను ‘ఫైటర్’కథానాయికగా నటిస్తున్నట్లు తెలిపింది. తొలుత జాన్వి కపూర్‌తో చిత్ర బృందం చర్చలు జరిపినప్పటికీ కుదరలేదు. దీంతో చివరికి అనన్య పాండేను ఫైనల్ చేశారు. కాగా, ఇప్పటికే సినిమా సెట్లో అనన్య అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా చిత్ర బృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘సాహో’ సినిమాలో విలన్ పాత్రలో నటించిన చుంకీ పాండే కూతురే అనన్య పాండే అన్న విషయం తెలిసిందే. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫలితం తీవ్రంగా నిరాశపరచడంతో ‘ఫైటర్’పైనే విజయ్ దేవరకొండ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ‘ఇస్మార్ శంకర్’సూపర్ డూపర్ హిట్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన పూరి.. ఇదే జోష్‌లో ‘ఫైటర్’తోనూ మరో భారీ సక్సెస్ కొట్టాలని పూరి అండ్ గ్యాంగ్ భావిస్తోందట. అంతేకాకుండా పూరి జగన్నాథ్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తుండగా.. హిందీ వెర్షన్‌కు కరణ్ జోహార్ భాగస్వామిగా వ్యవహరించనున్నట్టుగా తెలుస్తోంది. చదవండి: విలన్‌గా యాంకర్ అనసూయ..! ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ రివ్యూ
- 
      
                   
                                 నా కొత్త ఫ్రెండ్‌ను చూశారా?: ఛార్మిఅందాల తార ఛార్మి కౌర్ పూర్థిస్థాయిలో నిర్మాతగా మారడంతో నటనకు ప్రస్తుతం దూరంగా ఉంటుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌తో కలిసి ప్రస్తుతం ఆకాశ్ పూరి ‘రొమాంటిక్’ , విజయ్ దేవరకొండ ‘ఫైటర్’చిత్రాలను నిర్మిస్తున్నారు. ‘రొమాంటిక్’ విడుదలకు సిద్దంగా ఉండగా.. ‘ఫైటర్’ షూటింగ్ శరవేగంగా జరుగుతుండటంతో ఛార్మి ఊపిరి పీల్చుకోలేనంత బిజీ అయిపోయారు. అయితే ఆదివారం కాస్త విరామం దొరకడంతో సరదా సరదాగా గడిపారు. ఈ క్రమంలో తన కొత్త పెంపుడు కుక్కతో ఆడుకున్నారు. ‘తన ఇంట్లోకి కొత్త నేస్తం వచ్చింది’అంటూ ఆ కుక్కతో ఆడుకుంటున్న వీడియో, ఫోటోలను తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది ఛార్మి. ‘పదేళ్లు ఉంటే అందం పోతుంది.. కానీ జీవితాంతం ఆనందంగా చూసుకునే వారు పక్కన ఉంటే అదే చాలు’అన్న రీతిలో ఉన్న ఆ ఫోటో ఫోజు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక క్యూటీతో బ్యూటీ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా, ఛార్మికి జంతువులంటే అమితమైన ప్రేమ అనే విషయం తెలిసిందే. ఇంట్లో పెంపుడు కుక్కలు, పక్షులను పెంచుతుంది. షూటింగ్‌లకు విరామం దొరికినప్పుడల్లా వాటితో గడుపుతుంటారు. When babies come to meet mammaa on location 🥰🥰#VD10 #PJ37 #PCfilm @puriconnects pic.twitter.com/LEcuUKiZAp — Charmme Kaur (@Charmmeofficial) February 16, 2020 LIVE LOVE WOOF 😁 .#pets #loveofmylife 💕 pic.twitter.com/dlZgZeGwAX — Charmme Kaur (@Charmmeofficial) February 16, 2020 చదవండి: ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’.. తమన్నా సాయం! నితిన్ లవ్‌స్టోరీ తెలిసింది అప్పుడే
- 
      
                   
                                 ‘రొమాంటిక్’ సినిమా నుంచి మరో అప్డేట్సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న ‘రొమాంటిక్’ . ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్లకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో ఆకాశ్ సరసన ఢిల్లీకి చెందిన మోడల్ కేతికా శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరొక అప్డేట్ను మేకర్ అనౌన్స్ చేశారు. శనివారం సాయంత్రం 5 గంటలకు ‘రొమాంటిక్’ సినిమాలోని ఫస్ట్ వీడియో సాంగ్ ‘నువ్వు నేను ఈ క్షణం’ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఆకాశ్-కేతికల మధ్య ఈ పాట తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమాలోని కేతిక ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ఆంధ్రాపోరి’ సినిమాతో అరంగేట్రం చేసిన ఆకాశ్ పూరి.. తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘మెహబూబా’ సినిమాలో నటించాడు. కానీ ఈ రెండు సినిమాలు ఆకాశ్‌కు మంచి హిట్‌ను ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో ఆకాశ్ ఉన్నాడు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలను పూరి జగన్నాథే అందిస్తున్నారు. కొత్త దర్శకుడు అనిల్ పాదూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతోన్న ‘రొమాంటిక్’ ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
- 
      
                   
                                 పుట్టిన రోజున ‘పూరీ’ సాయండాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్‌తో తిరిగి ఫాంలోకి వచ్చిన పూరి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్నాడు. ఇస్మార్ట్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేస్తూ ఇప్పటికే కొత్త కారు కొన్న పూరి ఇప్పుడు తన పుట్టిన రోజును పురస్కరించుకొని తన ఆనందాన్ని మరింత మందికి పంచేందుకు రెడీ అవుతున్నారు. సినిమా బతకాలంటే దర్శకుడు బాగుండాలనే సిద్ధాంతాన్ని నమ్మిన పూరీ, గతంలో దర్శకత్వ శాఖలో పనిచేసి ప్రస్తుతం అవకాశాలు లేని వారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తన వంతుగా 20 మంది ఈ ఏడాది ఆర్థిక సాయం చేస్తున్నట్టుగా ప్రకటించారు. అంతేకాదు పరిస్థితులు అనుకూలిస్తే ప్రతీ ఏడాది ఇలాగే సాయం చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు పూరి జగన్నాథ్, చార్మీ కౌర్‌లు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 28న పూరీ జన్మదిన వేడుకలను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నారు.
- 
      
                   
                                 సమంతా.. ఏ టైంలో పుట్టావమ్మా!సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓ బేబీ మూవీ ఈ శుక్రవారం విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ సక్సెస్‌లో సమంతదే కీలక పాత్ర కావటంతో సినీ ప్రముఖులు, విమర్శకులు సమంతను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తన నటనతో బేబీ పాత్రకు సమంత ప్రాణపోశారంటూ తెగపొగిడేస్తున్నారు. అయితే చార్మీ మాత్రం ఓబేబీపై విభిన్నంగా స్పందించారు. ఓ బేబీ విజయం సాధించినందుకు సమంతకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసిన చార్మీ ‘ఏ టైంలో పుట్టావమ్మా నువ్వు సమంతా. నీ హర్డ్ వర్క్, నీ నిర్ణయాలు ఇంకా నీ జాతకానికి ఓ నమస్కారం. నందిని రెడ్డికి ఓ బేబీ టీం మొత్తానికి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన సమంత, చార్మీకి కృతజ్ఞతలు తెలియజేశారు. Ye time lo puttaavu Amma nuvvuu 😍🥰 @Samanthaprabhu2 Nee hard work , nee decisions and nee jatakam ki namaskaaram 🙏🏻🙏🏻🙏🏻 #samrocks #OhBabyRocks 👌🏻👌🏻 Very happy for @nandureddy4u n complete team too 🤩🙌🏻🥳 — Charmme Kaur (@Charmmeofficial) 5 July 2019
- 
      
                   
                                 త్రిషా.. పెళ్లి చేసుకుందాం: చార్మిచెన్నై చంద్రం త్రిషా పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే రోటీన్ భిన్నంగా చార్మీ ఓ డిఫరెంట్ మెసేజ్‌తో త్రిషకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘బేబీ నిన్ను ఎప్పుటికీ ప్రేమిస్తుంటాను. నువ్వు నా ప్రతిపాదన ఎప్పుడు అంగీకరిస్తావా అని ఎదురుచూస్తున్నా. పెళ్లి చేసేసుకుందాం! ఇప్పుడు ఇది చట్టబద్ధం కూడా’ అంటూ ట్వీట్ చేశారు. గతంలోనూ చార్మి ఇదే రకమైన ట్వీట్ చేశారు. అప్పుడు పెళ్లికి నేను సిద్ధమే అంటూ త్రిష రిప్లై కూడా ఇచ్చారు. దాదాపు ఒకే సమయంలో స్టార్ హీరోయిన్స్‌గా వెలుగొందిన ఈ ఇద్దరు భామలు మంచి స్నేహితులు. త్రిష ఇప్పటికీ హీరోయిన్గా కొనసాగుతుండగా, చార్మి మాత్రం యాక్టింగ్‌కు దాదాపు గుడ్ బై చెప్పేసి సినీ నిర్మాణం మీద దృష్టి పెట్టారు. దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలిసి పీసీ కనెక్ట్ సంస్థలో సినిమాలు నిర్మిస్తోన్నారు. Baby I love u today n forever 😘 Am on my knees waiting for u to accept my proposal 💍 let’s get married😛😛 ( now toh it’s legally allowed also 😛 ) #happybirthday @trishtrashers 😘😘😘😘 pic.twitter.com/e2F3Zn3Dp3 — Charmme Kaur (@Charmmeofficial) 4 May 2019
- 
      
                   
                                 ‘రొమాంటిక్’ హీరోయిన్ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆకాష్ పూరి, తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మెహబూబా సినిమాతో పూర్తిస్థాయి కథానాయకుడిగా మారాడు. అయితే ఈ రెండు సినిమాలు ఆకాష్‌కు ఆశించిన స్థాయి గుర్తింపు తీసుకురాకపోవటంతో మూడో సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోసారి పూరి స్వయంగా నిర్మిస్తూ కథా కథనాలు అందిస్తూ ‘రొమాంటిక్’ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాతో అనిల్ పాడూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పీసీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆకాష్‌కు జోడిగా కొత్తమ్మాయిని పరిచయం చేస్తున్నారు. కేతిక శర్మ అనే మోడల్ ఆకాష్ సరసన హీరోయిన్గా నటించనుందని తెలిపారు. సోమవారం గోవాలో ప్రారంభమైన షెడ్యూల్లో కేతిక పాల్గొనున్నారని నిర్మాత చార్మీ వెల్లడించారు. Our hot hot KETIKA SHARMA will b romancing with @ActorAkashPuri in #romantic .. joins shoot in #goa from today 🔥 #PCfilm @purijagan @Charmmeofficial @anilpaduri @puriconnects pic.twitter.com/9RC4gENUoj — Charmme Kaur (@Charmmeofficial) 11 March 2019
- 
      
                   
                                 అఫీషియల్ : పూరి డైరెక్షన్లో రామ్..!టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ కొంత కాలంగా తడబడుతున్నాడు. ఇటీవల కాలంలో పూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలేవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో షార్ట్గ్యాప్ తీసుకున్న పూరి త్వరలో సొంత నిర్మాణ సంస్థలో సినిమా ప్రారంభించనున్నాడు. ఎనర్జిటిక్ హీరోగా రామ్‌తో పూరి ఓ సినిమాను ప్రారంభించనున్నాడు. ఈ సినిమా 2019 జనవరిలో ప్రారంభించి మేలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పూరి భార్య లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు నటి చార్మీ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. Yaaayyyyyyy 🥳 it’s really a #merrychristmas 💃🏻 @purijagan @ramsayz @puriconnects #PCfilm pic.twitter.com/ZEc7K65BdG — Charmme Kaur (@Charmmeofficial) 25 December 2018
- 
            
                                     
                                                             ‘మెహబూబా’ ప్రెస్‌మీట్
- 
  
      సిట్ ముందు నాలుగుగంటలే
- 
      
                   
                                 సిట్ ముందు నాలుగుగంటలే
 ముగిసిన చిన్నా విచారణ
 మీడియా కంటపడకుండా వెళ్లిపోయిన ఆర్ట్ డైరెక్టర్
 
 
 హైదరాబాద్: టాలీవుడ్‌ను కుదుపుతున్న డ్రగ్స్ కేసులో ఆర్ట్ డైరెక్టర్ చిన్నాపై సిట్ విచారణ ముగిసింది. కేవలం నాలుగు గంటలపాటే ఆయనను సిట్ అధికారులు ప్రశ్నించారు. అనంతరం మీడియా కంటపడకుండా ఆయన ఎక్సైజ్‌శాఖ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. మీడియాతో మాట్లాడేందుకు విచారించారు.
 
 ఇప్పటివరకు దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామ్యాన్ శ్యామ్ కే నాయుడు, నటులు సుబ్బరాజు, తరుణ్, నవదీప్‌లను ప్రశ్నించిన సిట్ అధికారుల ఎదుట తాజాగా ఆర్ట్ డైరెక్టర్ చిన్నా వచ్చారు. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్‌తో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి? ఎప్పటినుంచి డ్రగ్స్ వాడుతున్నారు? సినీ పరిశ్రమలో ఇంకా ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు? తదితర ప్రశ్నలను సిట్ అధికారులు చిన్నాను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. చిన్నా నుంచి వివరాలు రాబట్టిన సిట్ అధికారులు త్వరగా ఆయన విచారణను ముగించినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ వ్యవహారంతో పెద్దగా సంబంధాలు లేవనే ఉద్దేశంతోనే చిన్నా విచారణను త్వరగా విచారించారా? అన్నది తెలియాల్సి ఉందని అంటున్నారు.
- 
  
      చార్మి పిటిషన్ పబ్లిసిటీ స్టంట్..
- 
      
                   
                                 చార్మి పిటిషన్ పబ్లిసిటీ స్టంట్..
 ►తప్పు చేయకుంటే భయమెందుకు?
 హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సినీనటి చార్మిని కేవలం సాక్షిగా మాత్రమే విచారణ చేస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ కేసులో నోటీసులు అందుకున్న చార్మీ నిన్న హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌ను కోర్టు మంగళవారం ఉదయం విచారించింది. ఇరు వాదనలు విన్న హైకోర్టు తీర్పును మధ్యాహ్నం 2.30 గంటలకు కోర్టు వాయిదా వేసింది. ఈ సందర్భంగా చార్మి తరఫు న్యాయవాది చేసిన ఆరోపణలను సిట్ తరఫు న్యాయవాది కొట్టిపారేశారు. చార్మి వేసిన పిటిషన్ కేవలం పబ్లిసిటీ స్టంట్ అని, తప్పు చేయకుంటే భయమెందుకని, ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారమే కేసు విచారణ కొనసాగుతోందని అన్నారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ వెల్లడించిన ఆధారాలతోనే ఈ విచారణ కొనసాగుతోందన్నారు.
 
 అలాగే చార్మి అంగీకారంతోనే ఆమె నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తామని సిట్ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఆమె ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారణ చేపడతామని గతంలో ఆమెకు తెలిపామని.. ఇందుకు చార్మి స్పందించి విచారణ కోసం సిట్ కార్యాలయానికే వస్తానని తెలిపిందని చెప్పారు. మరోవైపు సిట్ విచారణ చట్ట విరుద్ధంగా సాగుతోందని... బలవంతంగా రక్తనమూనా సేకరణ చేయకుండా ఆదేశాలివ్వాలని చార్మీ తరఫు లాయర్ విష్ణువర్ధన్‌రెడ్డి వాదనలు వినిపించారు. విచారణ సమయంలో లాయర్‌ను అనుమతివ్వాలని కూడా కోర్టును కోరామన్నారు. రాజ్యాంగ హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోమని కోర్టుకు విన్నవించారు.
- 
  
      చార్మీ పెళ్లి కాలేదు, మినహాయింపు ఇవ్వండి..
- 
      
                   
                                 చార్మీ పెళ్లి కాలేదు, మినహాయింపు ఇవ్వండి..
 ►పిటిషన్‌పై ముగిసిన వాదనలు, 2.30 గంటలకు తీర్పు
 ►రక్త నమూనా సేకరణకు చార్మీకి మినహాయింపు ఇవ్వండి
 ►స్వచ్ఛందంగానే శాంపుల్స్
 
 హైదరాబాద్ : సినీనటి చార్మీ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. చార్మీ తరపు న్యాయవాది విష్ణువర్థన్ రెడ్డి వాదనలు వినిపించారు. డ్రగ్స్ కేసులో చార్మి నిందితురాలు కాదని, అలాగే సాక్షి కూడా కాదని, అలాంటిది ఆమెకు నోటీసులు ఇవ్వడం సరికాదని అన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం చార్మీకి నోటీసులు ఇచ్చారని ఆమె తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. అలాగే బలవంతంగా రక్త నమూనాలు సేకరించడం రాజ్యాంగ విరుద్ధమంటూ.. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ విషయాన్ని ప్రస్తావించారు.
 
 చార్మికి ఇంకా పెళ్లి కాలేదని, బలవంతపు రక్త నమునా సేకరణ నుంచి ఆమెను ఉపసంహరించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే బలవంతంగా ఎవరి వద్ద నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం లేదని, స్వచ్ఛందంగానే వాళ్లే ఇస్తున్నారని ప్రభుత్వ తరఫు లాయర్ తెలిపారు. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారమే డ్రగ్స్ కేసు విచారణ జరుగుతోందని, అంతేకాకుండా ప్రతిదీ వీడియో చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. చార్మి అనుమతి ఇస్తే ఆమె ఇంటికే వెళ్లి విచారణ చేస్తామన్నారు. పూరీ జగన్నాథ్ అనుమతితోనే రక్త నమూనాలు సేకరించామని, అలాగే నిన్న నటుడు నవదీప్ నిరాకరించినందునే శాంపిల్స్ తీసుకోలేదన్నారు.
 
 కాగా డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్నచార్మి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆమె బుధవారం సిట్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం న్యాయవాది, మహిళా అధికారుల సమక్షంలోనే తన విచారణ జరిపేలా ఎక్సైజ్ అధికారులను ఆదేశించాలని కోరుతూ సోమవారం పిటిషన్ దాఖలు చేశారు.
 తన నుంచి బలవంతంగా వాంగ్మూలం తీసుకోకుండా ఆదేశించాలన్నారు. మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టకుండా, బలవంతంగా రక్తం, వెంట్రుకలు, గోళ్ల నమూనాలను సేకరించకుండా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. పిటిషన్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యదర్శి, కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, సిట్ సూపరింటెండెంట్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
- 
  
      హైకోర్టులో చార్మీ పిటిషన్‌పై విచారణ
- 
      
                   
                                 డైమండ్ రింగ్ పోగొట్టుకున్న హీరోయిన్
 హీరోయిన్ చార్మి టైం అస్సలు బాగున్నట్టు లేదు. రోజంతా షాపింగ్ చేసి కొనుక్కున్న వస్తువులతో పాటు డైమండ్ రింగ్‌ను కూడా పోగొట్టుకున్నారు చార్మి. ఈ విషయాన్ని స్వయంగా ఆమే ట్విట్టర్లో పేర్కొన్నారు. తనను ద్వేషించేవారందరికీ శుభవార్త అంటూ.. నిన్న వస్తువులు పోగొట్టుకున్న విషయాన్ని ట్వీట్ చేశారు.
 
 'జ్యోతిలక్ష్మి' సినిమా తర్వాత తెరపై మళ్లీ కనిపించని చార్మి.. తన తదుపరి చిత్రాల కోసం కసరత్తులు చేస్తున్నారు. జ్యోతిలక్ష్మితో నిర్మాతగా మారిన ఆమె మరిన్ని చిత్రాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలి' ట్రైలర్ చూసి 'రజనీకాంత్ జిందాబాద్' అంటూ ప్రశంసలు కురిపించారు.
 
 
 A good news for all the haters out dere My Whole day shopped bag ,hv been lost , along vit my diamond ring
 Yes !!
 It cannot b Sunny each day
 — CHARMME KAUR (@Charmmeofficial) 1 May 2016
- 
      
                    కళ్లజోడు కొట్టేసిన హీరోయిన్!
 ఆమె ఓ టాలీవుడ్ హీరోయిన్. అద్భుతమైన పొజిషన్ కాకపోయినా, పర్వాలేదనిపించేలాగే ఉంది. చాలా సినిమాల్లో తళుక్కుమంటుంది. మన రాష్ట్రానికి చెందిన అమ్మాయి కాకపోయినా.. చక్కటి తెలుగు మాట్లాడుతుంది. ఇప్పటికే ఎవరో అర్థమైపోయి ఉంటుంది కదూ.. ఆమే ఛార్మీ కౌర్. అలాంటి ఛార్మి.. ఉన్నట్టుండి ఓ దొంగతనం చేసింది. అది కూడా అక్కడ, ఇక్కడ కాదు.. ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి దగ్గర.
 
 అవును.. మంచులక్ష్మి దగ్గరున్న ఓ కళ్లజోడును ఛార్మీ కొట్టేసింది. కళ్లజోడు పెట్టుకుని ఫొటో తీయించుకుని, ఆ విషయాన్ని స్వయంగా ట్వీట్ చేసింది. దాంతో ఎంతో ముచ్చట పడిపోయిన మంచు వారి ఆడపడుచు కూడా.. ఆ కళ్లజోడు నీకు చాలా బాగుందంటూ కితాబిచ్చింది. ఇదంతా ఎక్కడ అని మీకు డౌటొచ్చి ఉంటుంది కదూ.. సైమా అవార్డులకు వెళ్లినప్పుడు. తర్వాత వాళ్లిద్దరూ కలిసి కమెడియన్ బ్రహ్మానందంతో కూడా ఓ ఫొటో తీయించుకున్నారు. ఆయన కూడా గాగుల్స్ పెట్టుకునే ఫొటో దిగడం విశేషం.
 
 
 
 
 
 I stole @LakshmiManchu sexxyyy glasses
- 
      
                   
                                 ఛార్మి ప్రయాణిస్తున్న విమానానికి ప్రమాదం!
 వైజాగ్: ఇండిగో ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్న టాలీవుడ్ నటి ఛార్మి భయానక పరిస్థితిని ఎదుర్కొంది. ఆకస్మాత్తుగా 100 అడుగుల విమానం జారి పోవడంతో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని అనుకున్నానని ఛార్మి సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ లో ఓ మెసేజ్ ను పోస్ట్ చేసింది. ఈ ఘటన వైజాగ్ లో జరిగిందని ఛార్మి వెల్లడించింది. 
 
 ఒక్కసారి ఫ్లైట్ కిందకు జారిపోయింది. దాదాపు నా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని అనుకున్నాను. కాని దేవుడు బ్రతికించాడు. నేను ఇంకా బ్రతికి ఉన్నానని నమ్మడం లేదు. భూమి నడుస్తుంటే ఇంకా నమ్మశక్యం కావడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఆనందంతో జీవించాల్సిందే అని ఛార్మి ఒక్కసారిగా వేదాంతం ధోరణి ప్రదర్శించింది. 


