పుట్టిన రోజున ‘పూరీ’ సాయం

Puri Jagannadh Helps Those Working in Direction Department - Sakshi

డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ ఇప్పుడు ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. ఇస్మార్ట్‌ శంకర్‌ సక్సెస్‌తో తిరిగి ఫాంలోకి వచ్చిన పూరి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్నాడు. ఇస్మార్ట్‌ సక్సెస్‌ను సెలబ్రేట్‌ చేస్తూ ఇప్పటికే కొత్త కారు కొన్న పూరి ఇప్పుడు తన పుట్టిన రోజును పురస్కరించుకొని తన ఆనందాన్ని మరింత మందికి పంచేందుకు రెడీ అవుతున్నారు.

సినిమా బతకాలంటే దర్శకుడు బాగుండాలనే సిద్ధాంతాన్ని నమ్మిన పూరీ, గతంలో దర్శకత్వ శాఖలో పనిచేసి ప్రస్తుతం అవకాశాలు లేని వారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తన వంతుగా 20 మంది ఈ ఏడాది ఆర్థిక సాయం చేస్తున్నట్టుగా ప్రకటించారు. అంతేకాదు పరిస్థితులు అనుకూలిస్తే ప్రతీ ఏడాది ఇలాగే సాయం చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు పూరి జగన్నాథ్‌, చార్మీ కౌర్‌లు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 28న పూరీ జన్మదిన వేడుకలను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top