
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ కొంత కాలంగా తడబడుతున్నాడు. ఇటీవల కాలంలో పూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలేవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో షార్ట్‌గ్యాప్ తీసుకున్న పూరి త్వరలో సొంత నిర్మాణ సంస్థలో సినిమా ప్రారంభించనున్నాడు. ఎనర్జిటిక్ హీరోగా రామ్‌తో పూరి ఓ సినిమాను ప్రారంభించనున్నాడు.
ఈ సినిమా 2019 జనవరిలో ప్రారంభించి మేలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పూరి భార్య లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు నటి చార్మీ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
Yaaayyyyyyy 🥳 it’s really a #merrychristmas 💃🏻
— Charmme Kaur (@Charmmeofficial) 25 December 2018
@purijagan @ramsayz @puriconnects #PCfilm pic.twitter.com/ZEc7K65BdG