breaking news
10 Downing Street
-
బ్రిటన్‌కు ఎంతోమంది పీఎంలు వస్తుంటారు.. పోతుంటారు!
లండన్‌లోని ప్రతిష్ఠాత్మక 10 డౌనింగ్ స్ట్రీట్.. బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం, కార్యాలయంల కూడా. బయటకు చూస్తే అది కేవలం ఒక ప్రభుత్వ భవనం. కానీ ఆ చారిత్రక గోడల మధ్య మాత్రం ఒక ప్రత్యేకమైన ఉనికి ఎప్పటినుంచో కొనసాగుతోంది. పదేళ్లలో ఆరుగురు ప్రధానమంత్రులు మారినా, ఆ వాతావరణంలో పెద్దగా మార్పు కనిపించదు. అదే భవనంలో.. దశాబ్దంపైగా అక్కడే మౌనంగా చూస్తూ ఉండిపోయాడు ల్యారీ.. “నేను ఇక్కడికి వచ్చి చాలా కాలమైంది. అప్పుడు ఒక ప్రధాని ఉన్నాడు. తర్వాత ఇంకొకరు. కొంతకాలానికి ఇంకొకరు. ఇప్పుడే ఇంకొకరు రాజీనామా చేశారు. రేపు ఇంకెవరో?.. నేను మాత్రం నా సోఫాలో అలాగే ఉంటూ వస్తున్నా..” అంటూ ల్యారీగాడు ఓ వెక్కిరింపు చూస్తున్నాడు. ల్యారీ.. 11 ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చాడు. అప్పట్లో బ్రిటన్‌కు నాయకత్వం వహిస్తున్నది డేవిడ్ కామెరూన్. యూరప్‌తో బ్రిటన్ సంబంధాలపై, ఆర్థిక సంక్షోభం ప్రభావాలపై చర్చల్లో మునిగిపోయి ఉన్న సమయం అది. కానీ ల్యారీకి అవేం పట్టింపు లేదు. వాడికి అర్థమైంది ఒక్కటే.. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, మంచి తిండి.. అలాగే రొటీన్ లైఫ్‌లో కాస్త చేంజ్.ఆ తర్వాత మార్పుల ప్రవాహం మొదలైంది. థెరెసా మే వచ్చారు. బ్రెగ్జిట్ గందరగోళం మధ్య దేశాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ రాజకీయ ఒత్తిళ్లు, పార్లమెంటులో మద్దతు తగ్గడం, ఒప్పందాలపై విభేదాలు ఆమెను పదవికి రాజీనామా చేసేలా చేశాయి. ఆయన ప్రధాని పీఠం నుంచి దిగిపోయి.. డౌనింగ్ స్ట్రీట్‌ను వీడుతుంటే ల్యారీ మాత్రం అదే హాలులో నిద్రపోతూనే ఉన్నాడు.తర్వాత బోరిస్ జాన్సన్ వచ్చారు. దేశాన్ని బ్రెగ్జిట్ తర్వాత కొత్త దారిలో నడిపించే ప్రయత్నం చేశారు. కానీ పార్టీల్లో వివాదాలు, కరోనా సమయంలో ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు, ఆచరణాత్మక తప్పిదాల ఆరోపణలు ఆయనను కూడా పదవికి దూరం చేశాయి. ఆయన బయటకు వెళ్తున్న టైంలోనూ.. ల్యారీగాడు సోఫాలో మాంచి కునుకు తీస్తున్నాడు.తరువాత లిజ్ ట్రస్ వచ్చారు. అయితే ఆర్థిక విధానాల్లో ఆమె చేసిన భారీ ప్రకటనలు మార్కెట్లను కుదిపేశాయి. ప్రజల్లో, పార్టీలో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. కొన్ని వారాల్లోనే ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆమె పాలన అయితే బ్రిటన్ రాజకీయ చరిత్రలోనే అత్యంత తక్కువకాలంలో ముగిసిన అధ్యాయంగా నిలిచింది. “లెట్యూస్(ఆ రకం ఆకుకూర..) తాజాదనం కంటే ఆమె ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేకపోయింది అంటూ సెటైర్లు వినిపించాయి. కానీ, అవేవీ పట్టించుకునే స్థితిలో ల్యారీగాడు లేడు..తర్వాత రిషి సునాక్ వచ్చారు. ఆర్థిక స్థిరత్వం తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ ద్రవ్యోల్బణం, జీవన వ్యయ సంక్షోభం, ఆర్థిక ఒత్తిళ్లు, రాజకీయ అనిశ్చితి ఆయన ప్రభుత్వాన్ని నిరంతరం పరీక్షించాయి. చివరకు 2024 సాధారణ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత అధికార పగ్గాలు లేబర్ పార్టీ చేతికి మారాయి. కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేయడంతో సునాక్ ప్రధానమంత్రి పదవికి వీడ్కోలు పలికారు. 10 డౌనింగ్ స్ట్రీట్‌లో మరోసారి అధికార మార్పిడి జరిగింది. ఈ రాజకీయ పరిణామాలన్నింటినీ కూడా ల్యారీగాడు తనదైన నిశ్శబ్దంతో గమనిస్తూ ఉండిపోయాడు.తరువాత బాధ్యతలు చేపట్టిన కీర్ స్టార్మర్ పాలన కూడా బ్రిటన్ రాజకీయాల్లో మరో కీలక మలుపుగా మారింది. దేశ ఆర్థిక ఒత్తిళ్లు, విధాన నిర్ణయాలపై పెరిగిన విమర్శల మధ్య ఆయన నాయకత్వంపై కూడా అనిశ్చితి కొనసాగింది. చివరికి ఆయన కూడా పదవికి రాజీనామా చేయాల్సి రావడంతో, 10 డౌనింగ్ స్ట్రీట్‌లో తాజాగా మరోసారి నాయకత్వ మార్పు తప్పలేదు. ప్రభుత్వాలు మారుతున్నా, రాజకీయ సమీకరణాలు తిరుగుతున్నా, ఆ చారిత్రక భవనంలోని నిశ్శబ్ద సాక్షి మాత్రం ఎప్పటిలాగే తన స్థానంలో నిలిచే ఉంది.లారీకి రాజకీయాలు అర్థం కావు. కానీ ఒక విషయం మాత్రం అతనికి స్పష్టంగా తెలుసు.. ఈ ఇంట్లో మనుషులు శాశ్వతం కాదు. వారు వస్తారు, కెమెరాల ముందు నిలుస్తారు, నిర్ణయాలు ప్రకటిస్తారు, కొన్నిసార్లు దేశాన్ని ప్రశంసిస్తారు, కొన్నిసార్లు విమర్శల్లో మునిగిపోతారు. ఆ తర్వాత ఒక రోజు నిశ్శబ్దంగా వెళ్లిపోతారు. కానీ లారీ మాత్రం ఎప్పటికీ అదే చోట ఉంటాడు. అదే కిటికీ దగ్గర కూర్చుంటాడు. అదే హాలులో నిద్రపోతాడు. అతనికి పదవులు లేవు, ఎన్నికలు లేవు, రాజీనామాలు లేవు. అతని ప్రపంచంలో ఒకే ఒక నిజం ఉంది.. ఆ ఇల్లు, ఆ సోఫా బతికి ఉన్నంత దాకా తనదేనని. ల్యారీ ది క్యాట్ (Larry the Cat).. లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని బ్రిటన్ ప్రధానమంత్రి అధికార నివాసంలో నివసిస్తున్న ప్రసిద్ధ పిల్లి. ఎలుకల్ని పట్టుకునేందుకు “Chief Mouser to the Cabinet Office” అనే అధికారిక హోదాను దానికి కట్టబెట్టారు. అలాగని ఈ పదవి కొత్తది కాదు. అక్కడి ప్రభుత్వ భవనాల్లో ఎలుకల సమస్యను నియంత్రించేందుకు దశాబ్దాలుగా ఇలాంటి ‘మౌసర్ క్యాట్’లను నియమించే సంప్రదాయం ఉంది. ఈ బాధ్యతలను సాధారణంగా క్యాబినెట్ ఆఫీస్ పర్యవేక్షణలో ఉన్న సిబ్బంది చూసుకుంటారు, అయితే ఈ పిల్లుల సంరక్షణ, ఆహారం, వైద్య సదుపాయాలు వంటి విషయాలను అక్కడి సిబ్బందే నిర్వహిస్తారు. ఈ సంప్రదాయంలో భాగంగా ల్యారీ 2011 నుంచి ఈ భవనంలో ఉంటూ, అనేక ప్రధానమంత్రుల కాలాన్ని సాక్షిగా చూసిన ఒక నిశ్శబ్ద అధికారిగా గుర్తింపు పొందాడు. -
స్టార్మర్ రాజీనామా
లండన్: దశాబ్దకాలంగా తరచూ ప్రధానమంత్రి పదవి నుంచి అగ్రనేతలు వైదొలగుతున్న దృశ్యం మరోసారి బ్రిటన్‌లో కన్పింంచింది. సమర్థవంతమైన పరిపాలన అందించట్లేడంటూ సొంత లేబర్ పార్టీ ఎంపీల నుంచే తీవ్రస్థాయిలో ఒత్తిడి నేపథ్యంలో బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామాచేశారు. లేబర్ పార్టీ నేత హోదా నుంచీ తప్పుకుంటున్నట్లు సోమవారం ప్రకటించారు. సెప్టెంబర్‌లో తదుపరి ప్రధాన మంత్రిని ఎన్నుకునేదాకా తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతానని 63 ఏళ్ల స్టార్మర్ వెల్లడించారు. త్వరలో కొలువుతీరే ప్రభుత్వానికి తన పూర్తి మద్దతు, సంపూర్ణ సహకారం కొనసాగుతుందని ఆయన స్పష్టంచేశారు. గత వారం బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ(హౌస్ ఆఫ్ కామన్స్) నియోజకవర్గం మేకర్‌ఫీల్డ్ ఉపఎన్నికల్లో గెలిచిన సొంత పార్టీ ముఖ్యనేత ఆండీ బర్న్‌హామ్ ఇప్పుడు ప్రధానమంత్రి రేసులో ముందంజలో ఉన్నట్లు యూకే మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ‘‘తదుపరి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తా’’అని బర్న్‌హామ్ చేసిన ప్రకటన ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తోంది. రాజీనామాకు ముందే స్టార్మర్ సోమవారం ఉదయం బ్రిటన్ రాజు చార్లెస్–3తో భేటీ అయి తన రాజీనామా అంశాన్ని వెల్లడించారు. రాజీనామా చేశాక లండన్‌లోని ప్రధానమంత్రి కార్యాలయం 10, డౌనింగ్ స్ట్రీట్ భవనం నుంచి స్టార్మర్ బయటికొచ్చి మీడియాతో భావోద్వేగంతో మాట్లాడారు. ‘‘వచ్చే ఎన్నికలకు నేను పార్టీకి సారథ్యం వహించవచ్చా? అని పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించా. అందుకు వాళ్ల నుంచి సమాధానం వచ్చింది. అయితే నేను అమితంగా ఇష్టపడే దేశం మరింతగా ముందడుగేసేందుకే ప్రతి నిర్ణయం తీసుకున్నా. అందుకే ఇప్పుడు కూడా దేశం కోసం రాజీనామా చేస్తున్నా’’అని అన్నారు. ‘‘పార్లమెంట్ సెప్టెంబర్‌లో సమావేశమయ్యేలోపు కొత్త ప్రధాని ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుంది. అందుకు నా వంతుగా సాయపడతా. సవాళ్లను ఎదుర్కొనే నేతను బ్రిటన్ ఎన్నుకోబోతోంది. మా పార్టీ మరింత మెరుగ్గా పరిపాలించబోతోంది. ఇక దేశంలో అతిపెద్ద బాధ్యత(ప్రధాని పదవి) నుంచి తప్పుకుంటున్న నేను ఇకపై మంచి భర్తగా ఉంటా. భార్య నాకు అన్ని వేళలా కష్టసుఖాల్లో తోడుగా నిలబడింది. నా కన్నబిడ్డలకు మంచి తండ్రిగా బాధ్యతలు నెరవేరుస్తా. వీళ్లే నాకు గర్వకారణం, ఆనందం’’అని స్టార్మర్ గద్గద స్వరంతో మాట్లాడారు. ఎంతో సాధించా ‘‘ప్రధానిగా నా రెండేళ్ల కాలంలో బ్రిటన్ ఎంతో సాధించింది. ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టమైంది. ప్రతి నెలా ద్రవ్యోల్బణం పెరుగుతున్నా అంతకంటే ఎక్కువగా జీతభత్యాలను పెంచి ధరల సమస్యను విజయవంతంగా అధిగమించాం. పెట్టుబడులను పెంచాం. మౌలికవసతులను విస్తరించాం. నా లేబర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చింది. చెప్పిన మార్పులను చేసి చూపించింది. ఆరేళ్ల క్రితం ప్రత్యర్థి పార్టీ రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా ఘోరంగా విఫలమైంది. అందుకే వాళ్లు పార్లమెంట్ ఎన్నికల్లో 174 స్థానాలకు పరిమితమయ్యారు’’అని స్టార్మర్ తన ఘనతను చెప్పుకున్నారు. బ్రిటన్‌లో గత పదేళ్లలో స్టార్మర్తో కలిసి ఆరుగురు ప్రధానులు మారారు. లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధాలున్న తన ఆప్తుడు పీటర్ మాండెల్సన్‌ను అమెరికాలో బ్రిటన్ రాయబారిగా నియమించడం, సంక్షేమ సంస్కరణలు దెబ్బకొట్టడం, అధిక ధరలు, ట్యాక్స్‌లతో స్టార్మర్ ప్రభుత్వంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎక్కువైంది. దీంతో పదవి నుంచి దిగిపోవాలని ఒత్తిళ్లు పెరగడం తెల్సిందే. తర్వాత ఏమి జరగొచ్చు? గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ ఆండీ బర్న్‌హామ్ తదుపరి ప్రధాని అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ పేలవ ప్రదర్శనతో పార్టీని స్టార్మర్ నడిపించే తీరుపై అభ్యంతరాలు పెరిగాయి. ఇదే సమయంలో ఉత్తర ఇంగ్లండ్‌లో ఉప ఎన్నికల్లో గెలిచిన 56 ఏళ్ల బర్న్‌హామ్ నాయకత్వంపై ఆశలు చిగురించాయి. స్టార్మర్ రాజీనామాతో జూలై 9వ తేదీ నుంచి పార్టీలో తదుపరి నేత, ప్రధాని పదవుల కోసం నామినేషన్ల ప్రక్రియ ఆరంభంకానుంది. జూలై 17వ తేదీలోపు పార్టీలోని నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(ఎన్ఈసీ) ఈ ప్రక్రియను పూర్తిచేస్తుంది. అయితే జూలై మూడో వారంలోపే బర్న్‌హామ్‌ను ఏకగ్రీవంగా పార్టీ నేతగా ఎన్నుకునే ఆస్కారముంది. అయితే గతంలో లేబర్ పార్టీ ఉపనేతగా సేవలందించిన ఏంజెలా రేర్, బర్మింగ్‌హామ్ సెలీ ఎంపీ అల్ కార్న్ సైతం పోటీలో ఉన్నారు. నామినేషన్‌ను సుస్థిరపర్చుకోవాలంటే పార్టీ సభ్యుల్లో కనీసం 5 శాతం, అంటే పార్లమెంట్ దిగువసభలో కనీసం 81 మంది ఎంపీలు ఒక అభ్యర్థికి మద్దతు పలకాలి. లేదా ఆ అభ్యర్థికి కనీసం మూడు పార్టీ అనుబంధ సంస్థలు/కార్మీక సంఘాలు/సహకార సంఘాల మద్దతు తెలపాల్సి ఉంటుంది. అయితే పార్టీలో బర్న్‌హామ్‌కు ఇప్పటికే 300 మంది ఎంపీల మద్దతు ఉండటంతో ఆయన ఎంపిక నల్లేరుపై నడక అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థులకు ఓటేసేందుకు అర్హులైన సభ్యులు లేదా అనుబంధ సంస్థల సభ్యులు ఎలక్టోరల్ విధానంలో ఓట్లేస్తారు. 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన నేతనే ప్రధాని పదవికి అర్హుడవుతారు. -
వివాదంలో బ్రిటన్ ప్రధాని.. భారతీయులకు క్షమాపణలు చెబుతారా?
లండన్ : బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ప్రధాని కీర్ స్టార్మర్ తన నివాసం 10-డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హిందువులకు ఇచ్చిన ఆతిథ్యం వివాదంగా మారింది. యూకే ప్రధాని అధికారిక నివాసం 10-డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాజకీయ నాయకులు, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. దీపావళి పర్వదినాన దీపాలు వెలిగించడం, కూచిపూడి నృత్య ప్రదర్శన, కీర్ స్టార్మర్ ప్రసంగం జరిగింది. అంనతరం, అతిథులకు భోజనం ఏర్పాటు చేశారు.అయితే, అతిథులుగా వచ్చిన తమ మనోవభావాలు దెబ్బతినేలా ప్రధాని కీర్ స్టార్మర్ తమకు నాన్‌వెజ్, లిక్కర్లను అందించారని బ్రిటన్ హిందువులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ బ్రిటిష్ హిందూ పండిట్ సతీష్ కే శర్మ.. ప్రధాని కార్యాలయం ఇచ్చిన ఆతిథ్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గత 14 సంవత్సరాలుగా10-డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎప్పుడూ నాన్ వెజ్ ఐటమ్స్, వైన్స్, బీర్ వంటి వాటికి జోలికి వెళ్లలేదు. కానీ ఈసారి అలా జరగలేదు. ఈ సంవత్సరం దీపావళి వేడుకల్లో మాంసాహారంతో చేసిన వంటకాలు పెట్టారు. వైన్,బీర్లను అందించి మూర్ఖం, ఆధిపత్య ధోరణిని ప్రదర్శించారు అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.దీపావళి వేడుకల్లో ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ సలహాదారులు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ అంశంపై కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ అంశం బ్రిటన్,భారత్‌లలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వివాదంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్మారర్ స్పందించాల్సి ఉంది.కాగా, బ్రిటన్ లో 14 ఏళ్ల తర్వాత అధికారం మారింది. కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ చరిత్ర సృష్టించింది. 650 స్థానాలకు గాను నాలుగు వందలకు పైగా సీట్లు గెలుచుకొని లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. -
వడపళని హాస్పిటల్‌ను విక్రయిస్తున్న ఫోర్టిస్
న్యూఢిల్లీ: చెన్నైలోని వడపళని హాస్పిటల్ కార్యకలాపాలను రూ.152 కోట్లకు శ్రీ కావేరీ మెడికల్ కేర్‌కు విక్రయిస్తున్నట్టు ఫోరి్టస్ హెల్త్‌కేర్ ప్రకటించింది. తప్పనిసరి అమలు చేసే ఒప్పందాన్ని శ్రీకావేరీ మెడికల్ కేర్‌తో కుదుర్చుకుంది. ఈ లావాదేవీ పూర్తిగా నగదు చెల్లింపుల రూపంలోనే ఉంటుంది. జూలై నాటికి పూర్తి అవుతుందని ఫోర్టిస్ హెల్త్‌కేర్ తెలిపింది. చెన్నైలోని ఆర్కాట్ రోడ్డులో ఏర్పాటు చేసిన వడపళని హాస్పిటల్ 110 పడకల సామర్థ్యంతో ఉంది. దీన్ని 200 పడకల వరకు విస్తరించుకోవడానికి సౌలభ్యం కూడా ఉంది. కీలకమైన మార్కెట్లు, ప్రాంతాల వారీగా తమ హాస్పిటల్ ఆస్తులను మరింత అనుకూలంగా మార్చుకునే క్రమంలోనే ఈ విక్రయం నిర్వహిస్తున్నట్టు ఫోరి్టస్ హెల్త్‌కేర్ తెలిపింది. లాభదాయకత, మార్జిన్లను పెంచుకోవాలన్న తమ లక్ష్యానికి ఇది నిదర్శనమని పేర్కొంది. అలాగే, కీలక మార్కెట్లలో తమ హాస్పిటల్ ఆస్తుల క్రమబద్ధీకరణకు సైతం ఇది తోడ్పడుతుందని తెలిపింది. ఈ కొనుగోలుతో తమ ఆస్పత్రి పడకల సామర్థ్యం 750 పడకలకు పెరుగుతుందని కావేరీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎస్ చంద్రకుమార్ తెలిపారు. దక్షిణాదిన ప్రముఖ, నమ్మకమైన ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఎదగాలన్న తమ ప్రణాళికలో ఇది భాగమన్నారు. -
బ్రిటన్ ప్రధాని నివాసంపై కారుతో దాడికి యత్నం?
బ్రిటన్ ప్రధాన మంత్రి అధికారిక నివాసం వద్ద ఓ వ్యక్తి కారుతో దాడికి యత్నించాడు. ఈ పరిణామం అందర్నీ షాక్ కి గురి చేసింది. వెంటనే అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆ సమయంలో సునాక్ తన కార్యాలయంలో ఉన్నట్లు తెలుస్తోంది. లండన్ లోని ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ గేటును ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టాడు. బ్రిటన్ కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నివాసం గేటును కారు ఢీకొన్న వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాస్త వయసున్న ఆ వ్యక్తిని సంకెళ్లతో బంధించి తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. సాధారణంగా బ్రిటన్ ప్రధాని నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఎప్పుడూ గట్టి సెక్యూరిటీ ఉంటుంది. రక్షణ వ్యవస్థలో భాగంగా బలమైన ఇనుప గేట్లు ఉంటాయి. దేశ పార్లమెంటుకు ఇది దగ్గరి మార్గం. ఇక్కడి ఎంట్రెన్స్ వద్ద గతంలోనే లోనే భారీ గేట్లను ఏర్పాటు చేశారు. 1991లో ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ లండన్‌లో బాంబు దాడులకు పాల్పడిన దృష్ట్యా ఇక్కడ భద్రతను పెంచారు. కాగా తాజా ఘటన వెనుక నిందితుడి ఉద్దేశం ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. గురువారం సాయంత్రం బ్రిటన్ ప్రధాని నివాసం వద్ద జరిగింది ఉగ్ర దాడి కాకపోవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. క్రిమినల్ డ్యామేజ్, డేంజరస్ డ్రైవింగ్ ఆరోపణలపై అతడిని అరెస్టు చేసినట్టు వారు చెప్పారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో అధ్యక్ష భవనం వైట్ హౌస్ వద్ద 19 ఏళ్ళ సాయివర్షిత్ కందుల ఓ అద్దె ట్రక్కుతో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన మూడు రోజులకే బ్రిటన్ ప్రధాని నివాసం వద్ద అదే తరహా ఘటన చోటు చేసుకోవడగం గమనార్హం. ఇదీ చదవండి: అడ్డొస్తే ఎవరినైనా లేపేస్తా: సాయివర్షిత్


