
తారలు చిందులాడా.. జనమంతా ఎగబడిచూడ( ఫోటో : రాధారపు రాజు, ఖమ్మం)

మీ పోలీసులున్నారే.. మాలాగా తాగిబైక్ నడిపేవాళ్ల మనసును ఎప్పుడూ అర్ధం చేసుకోరు.. ( ఫోటో : ఎన్ రాజేశ్ రెడ్డి, హైదరాబాద్)

ఏ స్వార్థం లేకుండా మనల్ని ఆదరించేది.. అ, ఆ... అ..అంటే అమ్మా.. ఆ.. అంటే ఆకలి ( ఫోటో : శ్రీనివాసులు, కర్నూలు)

నా నోటికి గురుత్వాకర్షణ శక్తి ఉంది తెలుసా! నువ్వు ఎంత ఎత్తుకు ఎగిరినా నా పొట్టలోకి పోవాల్సిందే.. ( ఫోటో : ముత్యాల వెంటక రమణ, గుంటూరు)

కొత్త సంవత్సరం.. కొత్త ఉత్సాహం( ఫోటో : రవికుమార్, హైదరాబాద్)

ప్రమాదం నా ముందుందని తెలిసినా.. వెనకున్న నా వాళ్లకోసమే నా ఆలాపన( ఫోటో : సాయిదత్, హైదరాబాద్)

వెయ్ ఏగరేయ్.. నీ ఆశలు నిచ్చెన చేసేస్తూ.. నీ ఊహకు ఊపిరి పోసేస్తూ.. నవ్వుతు ముందుకు అడుగేయ్ ( ఫోటో : ఎస్ ఎస్ ఠాకూర్, హైదరాబాద్)

కొత్త సంవత్సరం.. మార్పు కోరుకునేవాళ్లకు ( ఫోటో: వేణుగోపాల్, జనగాం)

ఏమంటివి.. ఏమంటివి శిరాస్త్రానము లేకుండిన రక్షకభట నిలయులోనికి ప్రవేశము లేదందువా ఎంత మాట.. ఎంత మాట.. ( ఫోటో : శైలేందర్ రెడ్డి, జగిత్యాల)

భౌ..భౌ.. విశ్వాసం నా ఇంటి పేరు.. ‘మిస్టర్ ధైర్యం’ నా ఒంటి పేరు.. ఈ అగ్గి.. గిగ్గి అంతా జుజూబి ( ఫోటో : హుశ్సేన్ , కర్నూలు)

జీవితమనే వైకుంఠపాళిలో నిన్ను పైకి ఎక్కించే అవకాశం అనే నిచ్చెనలు ఎన్నుంటాయో.. మింగేసి కిందకు తోసేసే ఏమరపాటు అనే పాములు కూడా నీ వెన్నంటే ఉంటాయి. ( ఫోటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్)

పనికి రాను.. అనే చెత్త ఆలోచనల లోనుంచి.. పనికొచ్చే నిన్ను.. నీలో అన్వేషించు ( ఫోటో : అజీజ్, మచిలీపట్నం )

చూడమ్మా! మన వానర మూకలోనుంచి ఎదిగిన మనిషి.. ఈ పంటలు పండిస్తే.. మనం మాత్రం ఇలా గట్టునే నిలబడిపోయాం( ఫోటో : భజరంగ్ ప్రసాద్, నల్గొండ)

ఇలా చల్లగా చెట్టుకింద గడ్డం చేయించుకుంటే వచ్చే హాయి.. ఆ ఏసీ సెలూన్లల్లో ఎక్కడుంటుంది.. ( ఫోటో : సతీష్ రెడ్డి, పెద్దపల్లి)

భయపడకుండా అమ్మడి భవిష్యత్తు తీయమ్మా... హృతిక్ రోషన్ వస్తాడా.. అల్లు అర్జున్ వస్తాడా.. ముక్క నువ్వు తీయమ్మా.. అబద్ధం నేను చెబుతా!.. (ఫోటో : సతీష్ కే, సిద్దిపేట)

సార్! నన్నే అనుమానిస్తున్నారా.. ఈ రోజు శనివారం సార్! నేను మందు ముట్టనని మందు మీద ఒట్టుపెట్టుకున్నాను.. ( ఫోటో : యాకయ్యా, సూర్యాపేట)

తోలు మనుషుల్ని దేవుడాడిస్తే.. తోలు బొమ్మల్ని మనిషి ఆడిస్తాడు.. మనషుల్ని ఆడించి దేవుడు మురిస్తే.. బొమ్మల్ని ఆడించి మనిషి మురిసిపోతాడు.. ( ఫోటో : కిషోర్, విజయవాడ)

కృష్ణమ్మ ఒడి.. పిల్లల క్రికేట్ సందడి ( ఫోటో : రూబెన్, విజయవాడ)

అనుభవం యెక్క గొప్పతనం తెలిపే పసితనం.. ఆ చిన్ననాటి ప్రతిక్షణం.. కాదా! జ్ఞాపకాల బృందావనం( ఫోటో : విశాల్, విజయవాడ)

చలిమంట కలిపింది ఆ నలుగురిని ( ఫోటో : సత్యనారాయణ మూర్తి, విజయనగరం)

రయ్యు.. రయ్యు మంటూ రైడు చెయ్యపోదాం.. (ఫోటో : వరప్రసాద్, వరంగల్)

ఫోటో చెలగాటం.. చేపలకు ప్రాణ సంకటం ( ఫోటో : యాదిరెడ్డి, వనపర్తి)

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు.. ( ఫోటో : శివ కొప్పుల, యాదాద్రి)