వదినమ్మ, శశిరేఖా పరిణయం వంటి పలు సీరియల్స్‌లో ఫేమస్ అయింది నటి మహేశ్వరి.
బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్‌తో ప్రేక్షకులకు దగ్గరైన ఆమెకు సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది.
ఇందులో తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది.
మహేశ్వరి దంపతులకు మొదటిసారి కుమార్తె కాగా రెండోసారి బాబు పుట్టాడు.
తాజాగా బాబు నామకరణం ఫంక్షన్ చేశారు.
కుమారుడికి మేధాన్ష్ నందన్ అని పేరు పెట్టారు.
ఈ వేడుకకు బుల్లితెర తారలు హాజరై సందడి చేశారు.


