బుల్లితెరపై టాప్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు ముక్కు అవినాష్.
ఇతడు బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొన్నాడు.
అయితే ఫైనల్ వరకు వెళ్లకుండానే వెనుదిరిగాడు.
ఇటీవల బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌లోనూ పార్టిసిపేట్ చేశాడు.
ఈ సారి ఫస్ట్ ఫైనలిస్టుగా నిలిచాడు.
టాప్ 5లో నిలబడి తన సత్తా చాటాడు.
డిసెంబర్ 15న బిగ్‌బాస్ 8 గ్రాండ్ ఫినాలే జరిగింది.
నిఖిల్‌ను విజేతగా ప్రకటించగా గౌతమ్ రన్నరప్‌గా నిలిచాడు.
అవినాష్ ఐదో స్థానంలో ఉన్నాడు.
అయితే గ్రాండ్ ఫినాలే రోజు రామ్ చరణ్ స్పెషల్ గెస్టుగా వచ్చాడు.
ఈ సందర్భంగా ఆయనతో కలిసి అవినాష్ ఫోటోలు దిగాడు. వాటిని తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రామ్‌చరణ్‌కు, హోస్ట్ నాగార్జునకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు.


