ఇటీవలే గృహప్రవేశం చేసిన బుల్లితెర డాక్టర్ బాబు నిరుపమ్ ఇంట్లో మరో వేడుక జరిగింది.
తన కుమారుడు అక్షజ్ ఓంకార్ పంచెకట్టు(ధోతి) వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ వేడుకలో పలువురు బుల్లితెర నటీనటులు హాజరై సందడి చేశారు.
బుల్లితెర నటి మంజులను ఆయన పెళ్లాడారు.
మంజుల- నిరుపమ్ ఎన్నో ఏళ్లుగా సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నారు.
కార్తీక దీపం సీరియల్‌తో నిరుపమ్ బుల్లితెర హీరోగా మారిపోయాడు.
తన యాక్టింగ్ స్కిల్స్‌కు అందరూ ఫిదా అయిపోయారు.
ధారావాహికల ద్వారానే కాకుండా టీవీ షోలలోనూ తరచూ పాల్గొంటుంటారు.


