భగవంత్ కేసరి సినిమాలో ఇటీవల బిగ్‌బాస్(Bigg Boss) నుంచి ఎలిమినేట్ అయిన రతిక రోజ్ నటించింది.
అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna) హీరోగా తెరకెక్కిన సినిమా భగవంత్ కేసరి
అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకి వచ్చింది
రతిక రోజ్.. ఒకప్పుడు ఎవ్వరికి తెలీదు.
తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా వచ్చి తన అందాలతో, తన ఆటతో ప్రేక్షకులని మెప్పించింది
బిగ్‌బాస్ తో రతికకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే వచ్చింది
రతిక గతంలో నారప్ప, దృశ్యం 2, నేను స్టూడెంట్ సర్.. లాంటి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది
తాజాగా రిలీజయిన భగవంత్ కేసరి సినిమాలో రాష్ట్ర మంత్రిగా చిన్న పాత్ర చేసింది
సినిమాలో ఓ మూడు సార్లు కనిపిస్తుంది రతిక
ఇక రతిక స్క్రీన్ పై కనపడగానే ఆడియన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అరుపులు, విజిల్స్ తో సందడి చేశారు
రతిక సినిమాలో ఉన్న సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి
పలువురు బాలకృష్ణ సినిమాలో నటించినందుకు రతికని అభినందిస్తున్నారు


