మెగా ఫ్యామిలీ బోలెడంత మంది హీరోలు ఉన్నారు. వాళ్లందరూ సినిమాలు చేస్తున్నారు.
ఇదే కుటుంబం నుంచి వచ్చింది నిహారిక. ఈమె నాగబాబు కూతురు.
'ఢీ' డ్యాన్స్ ప్రోగ్రాంకు యాంకర్‌గా చేసి ఇండస్ట్రీలోకి వచ్చింది.
'ముద్దపప్పు ఆవకాయ' షార్ట్ ఫిల్మ్స్‌తో నటిగా ఆకట్టుకుంది. దీంతో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది.
'ఒక మనసు' సినిమాతో పూర్తిస్థాయి నటిగా మారింది. కానీ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు.
హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాల్లోనూ హీరోయిన్‌గా చేసింది కానీ కలిసి రాలేదు.
దీంతో యాక్టింగ్ పక్కనబెట్టేసి నిర్మాతగా మారింది. ఒకట్రెండు వెబ్ సిరీసులతో హిట్స్ కొట్టింది.
ఈ ఏడాది వచ్చిన హిట్ సినిమాల్లో ఒకటైన 'కమిటీ కుర్రోళ్లు' నిర్మించింది ఈమెనే.
సరే ఇవన్నీ పక్కనబెడితే 'మెగా' ట్యాగ్ ఈమెకు ఎంతో ప్లస్సో అంతే మైనస్ అని కూడా చెప్పొచ్చు.
ఎందుకంటే మిగతా హీరోయిన్లని ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేస్తానంటే కుదరకపోవచ్చు.
రీసెంట్‌గా ఈమె నటించిన తమిళ సినిమాలో పాట రిలీజైంది. ఇందులో నిహారికని చూసి అందరూ షాకయ్యారు.
ఈ పాటలో నిహారికని చూసి మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారని చెప్పొచ్చు.
వ్యక్తిగత విషయానికొస్తే 2020లో చైతన్య జొన్నలగడ్డని పెళ్లి చేసుకుంది.
కానీ ఈ పెళ్లి మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. 2023లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు.


