కొద్ది రోజులుగా సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవలు తెలిసిందే. ఇక పండగ పూట నిన్న( జనవరి 15)మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ శ్రీవిద్యానికేతన్‌లోకి వెళ్తుండగా అక్కడి సిబ్బంది, పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
శ్రీవిద్యానికేతన్‌లోనికి వెళ్లేందుకు యత్నించిన మంచు మనోజ్
వీల్లేదని అడ్డుకున్న పోలీసులు.. వాగ్వాదం
తన తాత, నానమ్మ సమాధుల వద్దకు వెళ్తానని మనోజ్ పట్టు
గేటుకు తాళాలు వేయడంతో అనుచరుల దౌర్జన్యం, ఎంబీయూ సిబ్బంది, బౌన్సర్లపై దాడి.. పోలీసుల లాఠీచార్జ్
ఎట్టకేలకు తాత, నానమ్మ సమాధుల వద్ద నివాళులు
తనను అడ్డుకోవడంపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తానన్న మనోజ్
మనోజ్ తీరుపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఎంబీయూ మీడియా ఇన్‌చార్జ్ రవి చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు.


