హీరోయిన్ కీర్తిసురేశ్ గతేడాది డిసెంబర్ 12న పెళ్లి చేసుకుంది.
ప్రియుడు ఆంటోని తటిల్‌ను వివాహమాడింది.
దాదాపు 15 ఏళ్ల ప్రేమను పెళ్లిబంధంతో పదిలపర్చుకుంది.
గోవాలో బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వీరి వివాహం జరిగింది.
తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అందులో తటిల్‌తో కలిసి డ్యాన్స్ చేసింది.
ఇకపోతే కీర్తి అల్లరి పిల్ల కాగా ఆమె భర్త మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకమని తెలుస్తోంది.
తటిల్ గురించి మాట్లాడుతూ.. మా ఆయనకు సిగ్గెక్కువ.
అందరి ముందు చేతులు పట్టుకుని నడవడానికి కూడా ఇబ్బందిపడతాడు అని చెప్పింది.


