మలయాళ భామ మంజు వారియర్ ప్రస్తుతం కోలీవుడ్‌లో బిజీగా ఉంది.
ఆర్య హీరోగా తెరకెక్కిస్తోన్న స్పై థ్రిల్లర్ మూవీ మిస్టర్ ఎక్స్‌లో కీ రోల్ ప్లే చేస్తోంది.
గతంలో ధనుష్ భార్యగా అసురన్ చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ.
ఆ తర్వాత అజిత్ సరసన తుణివు (తెగింపు) చిత్రంలో యాక్షన్ హీరోయిన్‌గా నటించింది.
అంతేకాకుంజా రజనీకాంత్ సరసన వేట్టైయాన్ చిత్రంలోనూ కనిపించింది.
ఈ చిత్రంలో రజనీకాంత్‌తో కలిసి 'మనసిలాయో' అనే కలర్ ఫుల్ సాంగ్‌లో మెరిసింది.
ప్రస్తుతం మిస్టర్ ఎక్స్‌తో మరోసారి సినీ ప్రియులను అలరించనుంది ముద్దుగుమ్మ.
తాజాగా మంజు వారియర్ కలర్ ఫుల్ శారీలో దిగిన ఫోటోలను షేర్ చేసింది.
ఈ తాజా ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
తమ అభిమాన నటిపై ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.


