
సమంత.. శోభిత కంటే ర్యాంకింగ్స్‌లో వెనకబడిపోయింది. మీరు సరిగానే విన్నారు.

ప్రముఖ రేటింగ్ సంస్థ ఐఎమ్‌డీబీ.. మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ ర్యాంక్స్ రిలీజ్ చేసింది.

టాప్ 10లో ఎవరెవరు ఏయే స్థానాల్లో ఉన్నారో ప్రకటించింది.

'యానిమల్' ఫేమ్ తృప్తి దిమ్రి.. అనుహ్యంగా తొలి స్థానం దక్కించుకుంది.

'కల్కి'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దీపికా పదుకొణెది రెండో స్థానం.

బాలీవుడ్ యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్.. మూడో స్థానంలో నిలిచాడు.

ఈ ఏడాది సినిమాలేం చేయనప్పటికీ షారుఖ్ ఖాన్.. నాలుగో స్థానం సొంతం చేసుకున్నాడు.

తాజాగా నాగచైతన్యని పెళ్లాడిన శోభిత ధూళిపాళ్ల.. ఐదో స్థానం సాధించింది.

ఈ ఏడాది మూడు హిందీ సినిమాల్లో నటించిన శార్వరి.. ఆరో స్థానం సంపాదించింది.

ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్.. ఏడో స్థానం సొంతం చేసుకుంది.

ఎప్పటికప్పుడు న్యూస్‌లో ఉండే సమంత.. ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది.

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్.. తొమ్మిదో స్థానంలో నిలిచింది.

బయట పెద్దగా కనిపించని ప్రభాస్.. పదో స్థానంలో నిలిచాడు.

ఈ లిస్టులో మిగతా వాళ్ల సంగతేమో గానీ శోభిత, సమంత స్థానాలు మాత్రం ఆసక్తికరం!