ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్ కానుంది.
ఈ చిత్రం ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ మాట్లాడుతూ
‘‘భారతదేశ చిత్ర పటంలో హీరోలతో సమానంగా నిల్చున్న ఏకైక మహిళ ఎవరన్నా ఉన్నారంటే అది విజయశాంతిగారు ఒక్కరే.
‘కర్తవ్యం, ప్రతిఘటన, మగరాయుడు’... ఇలా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేశారామె. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ని చూశాను.
విజయశాంతిగారు లేకపోతే ఈ చిత్రం లేదు. పృథ్వీ, సోహైల్ ఖాన్, ప్రదీప్ చిలుకూరి, సునీల్, అశోక్‌గార్లు... ఇలా ఎవరు లేకున్నా ఈ సినిమా లేదు.
18న ఈ మూవీ మీ ముందుకొస్తోంది. రాసిపెట్టుకోండి... ఆఖరుగా వచ్చే ఇరవై నిమిషాలు ప్రేక్షకుల కళ్లల్లో నీళ్లు తిరక్కపోతే... అంత అద్భుతంగా తీశారు ప్రదీప్‌గారు.
సినిమా చూస్తున్న నాకు కూడా కన్నీళ్లు ఆపుకోవడం కుదరలేదు. ఆ ఆఖరి ఇరవై నిమిషాలు అలా రావడానికి ఒకే ఒక్క కారణం కల్యాణ్ అన్న మాత్రమే.
దర్శకుడి ఐడియాని ఆయన నమ్మారు. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అన్న కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుందని నా నమ్మకం. మనసు పెట్టి, ప్రాణం పెట్టి నటించారు.


