భోజనం తినలేకపోతున్నాం | thangadapelli Students requested to MEO to provide quality mid day meals | Sakshi
Sakshi News home page

భోజనం తినలేకపోతున్నాం

Feb 3 2018 7:43 PM | Updated on Aug 29 2018 7:54 PM

thangadapelli Students requested to MEO to provide quality mid day meals - Sakshi

పాఠశాల గేట్‌ ఎదుట ఖాళీ ప్లేట్లతో ఆందోళన చేస్తున్న విద్యార్థులు

చౌటుప్పల్‌ : మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండడం లేదని, నాసిరకంగా ఉండడంతో తినలేకపోతున్నామంటూ మండలంలోని తంగడపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు శుక్రవారం తరగతులను బహిష్కరించారు. ఖాళీ ప్లేట్లతో ఆందోళనకు చేపట్టారు.  నాణ్యత లేకపోవడంతో కడుపునిండా తినలేకపోతున్నామని, తిండి విషయంలో నిత్యం ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భోజనంతోపాటు కూరగాయలు, గుడ్లు, సాంబారు కూడా పూర్తి నాణ్యత లోపించి ఉంటుందని వాపోయారు. ఉపాధ్యాయులు, గ్రామస్తులు నచ్చజెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. అనంతరం ఈ విషయాన్ని ఎంఈఓకు దృష్టికి తీసుకెళ్లారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement