‘తయారీ హబ్‌గా భారత్‌’

Want to make India a global manufacturing hub: Narendra Modi - Sakshi

మనీలా: భారత్‌ను అంతర్జాతీయ తయారీ హబ్‌గా రూపొందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మనీలాలో ఆసియాన్‌ వాణిజ్య, పెట్టుబడుల సదస్సులో ప్రధాని మాట్లాడుతూ దేశాన్ని తయారీ హబ్‌గా మలవడంతో పాటు తమ యువతను ఉపాథిని సృష్టించేవారిగా రూపొందిస్తామని అన్నారు.దేశంలో దాదాపు అన్ని రంగాల్లోనూ విదేశీ పెట్టుబడులను స్వాగతిస్తున్నామన్నారు. భారత్‌లో కోట్లాది మందికి బ్యాంకు ఖాతాలు లేని పరిస్థితి నుంచి జన్‌థన్‌ యోజన ద్వారా వారందరికీ కొద్దినెలల్లోనే బ్యాంకు ఖాతాలు లభించాయని చెప్పారు.

ప్రజలకు సాంకేతికతను అందుబాటులోకి తేవడంతో డిజిటల్‌ లావాదేవీలు గణనీయంగా పెరిగాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో దాదాపు 1200 కాలం చెల్లిన చట్టాలను మార్చివేశామన్నారు. కంపెనీల స్ధాపనకు అవసరమైన అనుమతులను సరళీకరించామని చెప్పారు.

భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆసియాన్‌ దేశాలకు మోదీ పిలుపు ఇచ్చారు. పారదర్శక ప్రభుత్వం కోసం తాము రాత్రింబవళ్లు పనిచేస్తున్నామని అన్నారు.

Read latest World News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top