ఒక్క రోజులో 16 న్యూ ఇయర్స్‌

ISS crew will experience New Year's Eve16 times - Sakshi

వాషింగ్టన్‌: మనంకొత్త ఏడాది వేడుకలు జరుపుకోవాలంటే 365 రోజులు నిరీక్షిస్తాం. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తాం. కానీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌ – ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌)లో ఆరుగురు వ్యోమగాములు మాత్రం 2018 కొత్త ఏడాదిని ఒకేరోజులో 16 సార్లు జరుపుకోనున్నారు. భూమికి 402 కి.మీ. ఎత్తులో ప్రతి 90 నిమిషాలకోసారి భూమిని చుట్టేస్తూ 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాలను చూడటం ద్వారా వారు దీనిని సుసాధ్యం చేయనున్నారు. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) వెల్లడించింది.

Read latest World News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top