
పశ్చిమగోదావరి జిల్లా : ఏపీ మంత్రి కేఎస్ జవహర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. నల్లజర్ల మండలం దూబచర్ల వద్ద ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖామంత్రి జవహర్ కారు ప్రమాదానికి గురైంది. అనంతపురం జన్మభూమి పర్యటన ముగించుకుని కొవ్వూరు తిరిగివెళ్తున్న మంత్రి కాన్వాయ్‌ని వెనక నుంచి స్విఫ్ట్ డిజైర్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎస్కార్ట్ జీపు, మంత్రి ప్రయాణిస్తోన్న వాహనం పాక్షికంగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ మంత్రి జవహర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు.