
సాక్షి, భీమవరం: రాష్ట్రంలో ఎవరు అభివృద్ధి చెందారో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పాలని సీఐఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆయన భీమవరంలో జరుగుతున్న సీపీఎం రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్క ఏడాదిలో రూ. 2500 కోట్ల అవినీతి సొమ్ము బయట పడిందన్నారు.
చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా దిగజారి రాజకీయ అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం బంద్ కూడా వామపక్షాలు వల్లే చేయగలిగామన్నారు. చట్ట సభల్లో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం పెరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సీపీఐ పార్టీ అన్నీ విషయాలలో సీపీఎంతో కలిసి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.