నిలిచిపోయిన డయాలసిస్‌

dialasis center stoped in parvathipuram area hospital - Sakshi

పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో నిలిచిన సేవలు

అధిక ఓల్టేజీ కారణంగా పాడైన యంత్రాలు

షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా రూ. పదిలక్షలమేర ఆస్తి నష్టం

రోగులను పాలకొండకు తరలించిన అధికారులు

పార్వతీపురం: కిడ్నీవ్యాధిగ్రస్థులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉన్న పార్వతీపు రం ఏరియా ఆస్పత్రిలోని డయాలసిస్‌ కేంద్రంలో సేవలు నిలిచిపోయాయి. హైఓల్టేజ్‌ కారణంగా ముఖ్యమైన యంత్రాలు ధ్వంసం కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పటివరకు 72మంది రోగులు ఈ కేం ద్రం ద్వారా సేవలు పొందుతున్నారు. కేంద్రం ఏర్పాటు చేసి 13నెలలు అయినప్పటికీ ఇక్కడి సేవలకు ఎంతో గుర్తింపు లభించింది. గత శుక్రవారం హైఓల్టేజ్‌ రావడంతో డయాలసిస్‌ యూనిట్‌ వద్ద ఏర్పాటు చేసిన స్టెబిలైజర్‌ పాడైంది. డయాలసిస్‌ యంత్రాలు ధ్వంసమయ్యాయి. ఫలితంగా డయాలసిస్‌ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో డయాలసిస్‌ కేంద్రం నిర్వాహకులు రోగులను పక్క జిల్లాలోని పాలకొండలో ఉన్న డయాలసిస్‌ కేంద్రానికి తరలిస్తున్నారు. అక్కడ వారికి సేవలు అందిస్తున్నారు.

రూ. 10 లక్ష లమేర నష్టం..
ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి డయాలసిస్‌ కేంద్రానికి నేరుగా విద్యుత్‌ సరఫరాను అందించే కేబుల్‌ను కూడా డయాలసిస్‌ యూనిట్‌ నిర్వాహకులే ఏర్పాటు చేస్తున్నారు. స్టెబిలైజర్‌ను కూడా ఏర్పాటు చేశారు. అధిక విద్యుత్‌ సరఫరా అయిన సమయంలో వాటిని సరిదిద్ది పంపించే స్టెబిలైజర్‌లో న్యూట్రల్‌ వ్యవస్థ పాడవ్వడం, వైర్లు కాలిపోయి తెగిపోవడంతో ఒక్కసారిగా స్టెబిలైజర్‌ ద్వారా అత్యధిక ఓల్టేజీ ప్రసారం కావడంతో డయాలసిస్‌ కేంద్రంలోవున్న ఆరు మిషన్లకు విద్యుత్‌ సరఫరా జరగడంతో అందులోవున్న ఎస్‌ఎంపీఎస్‌ బోరŠుడ్స,(స్విచ్‌మోడ్‌ ఫవర్‌ సప్‌లై), కొన్ని హీటర్‌ ఫ్యూజులు కాలిపోవడంతో మిషన్లు పనిచేయకుండా పోయాయి. సుమారు రూ. 10లక్షలు ఆస్తినష్టం జరిగినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. హైదరాబాద్‌ నుంచి అవసరమైన స్పేర్‌ పాట్స్‌ వచ్చిన తరువాత యంత్రాలను బాగుచేస్తామని, తరువాత రోగులకు సేవలు అందిస్తామని తెలిపారు.

విద్యుత్‌ శాఖ అధికారులతో సమీక్షిస్తున్నాం.
ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి అత్యధిక ఓల్టేజీ రావడంతో మిషన్లు పాడై రూ. 10 లక్షల వరకు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం న్యూట్రల్‌ పాయింట్‌ను సరిచేశాం. తద్వారా సేవలు కొనసాగించడానికి పక్క కేంద్రాలనుంచి డయాలసిస్‌ మిషన్లను తెప్పిస్తాం. పూర్తి సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నాం. రెండు, మూడు రోజుల్లో తిరిగి సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.– డా. జి.నాగభూషణరావు,సూపరింటెండెంట్, ఏరియా ఆస్పత్రి

న్యూట్రల్‌ పాయింట్‌ కాలిపోవడంవల్లే...
డయాలసిస్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన స్టెబిలైజర్‌ న్యూట్రల్‌ వైర్లు కాలిపోవడంవల్లే స్టెబిలైజర్‌ గుండా 450 ఓల్టేజ్‌ ప్రవహిం చింది. తద్వారా మిషన్లోవున్న ఎస్‌ఎంపీఎస్‌ బోర్లు కాలిపోయాయి. కేంద్రం లోవు న్న అన్ని మిషన్లు పనిచేయకుండా పోవడంతో రోగులకు ప్రత్యామ్నాయంగా పాలకొండ డయాలసిస్‌ కేంద్రానికి పంపిస్తున్నాం.       – జితేంద్ర, నెప్రో  ఇంజనీర్‌

Read latest Vizianagaram News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top