భర్తను, పిల్లలను ఆమె కొరుకుతోంది..! | woman biting family members in Nalgonda district | Sakshi
Sakshi News home page

భర్తను, పిల్లలను ఆమె కొరుకుతోంది..!

Jul 16 2016 7:40 PM | Updated on Aug 29 2018 4:18 PM

భర్తను, పిల్లలను ఆమె కొరుకుతోంది..! - Sakshi

భర్తను, పిల్లలను ఆమె కొరుకుతోంది..!

పొద్దంతా ప్రశాంతంగానే ఉంటుంది. రాత్రి కాగానే ఇంట్లో ఉన్నవాళ్లందరినీ పళ్లతో కొరుకుతుంది. భర్తనేకాదు సొంత పిల్లల్ని సైతం వదలడం లేదు..

నార్కట్‌పల్లి: పొద్దంతా ప్రశాంతంగానే ఉంటుంది. రాత్రి కాగానే ఇంట్లో ఉన్నవాళ్లందరినీ పళ్లతో కొరుకుతుంది. భర్తనేకాదు సొంత పిల్లల్ని సైతం వదలడం లేదు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలో శనివారం వెలుగులోకి వచ్చిన ఓ మహిళ వింత ప్రవర్తన ఇది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

అలేరు మండలానికి చెందిన శ్రీలత-సుధాకర్ దంపతులు ఎనిమిదేళ్లుగా మండల కేంద్రంలోని హైస్కూల్ సమీపంలో అద్దెకు నివాసముంటున్నారు. వీరికి ఎనిమిది, మూడేళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సుధాకర్ స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. అయితే, శ్రీలత కొద్ది రోజులుగా కుమార్తెలతో పాటు భర్తను కూడా సాయంత్రం వేళ విచక్షణారహితంగా కొరుకుతూ గాయపరుస్తోంది. శనివారం ఇరుగుపొరుగు వారు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ మోతీరాం శ్రీలతను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆమె తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపారు. మానసిక స్థితి సక్రమంగా లేకనే శ్రీలత ఇలా వ్యవహరిస్తోందని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement