హెచ్‌సీఎల్ బోర్డ్ నుంచి నాయర్ నిష్ర్కమణ | Vineet Nayar steps down from HCL Technologies Board | Sakshi
Sakshi News home page

హెచ్‌సీఎల్ బోర్డ్ నుంచి నాయర్ నిష్ర్కమణ

Dec 28 2013 1:59 AM | Updated on Sep 2 2017 2:01 AM

వినీత్ నాయర్

వినీత్ నాయర్

ఐటీ రంగ కురు వృద్ధుడు వినీత్ నాయర్ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ బోర్డ్ నుంచి వైదొలిగారు.

న్యూఢిల్లీ: ఐటీ రంగ కురు వృద్ధుడు వినీత్ నాయర్ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ బోర్డ్ నుంచి వైదొలిగారు. తాను ఏర్పాటు చేసిన ఫౌండేషన్, సంపర్క్‌కు మరింత సమయం కేటాయించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ శుక్రవారం తెలిపింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు, హెచ్‌సీఎల్ కార్పొరేషన్‌లకు ఇకపై సీనియర్ సలహాదారుగా నయ్యర్ తన సేవలందిస్తారు.

ఇతరులకు ఆదర్శం
సంస్థ పట్ల వినీత్ నాయర్ ఆలోచనలు, అంకిత భావం చాలా మంది కంపెనీ ఉద్యోగులకు స్ఫూర్తినిచ్చిందని, పెద్ద పెద్ద కలలు కనేందుకు తోడ్పాటునందించిందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్, చైర్మన్ శివ్ నాడార్ వ్యాఖ్యానించారు. ఈ సంస్థలో పనిచేయడానికి, ప్రయోగాలు చేయడానికి, నేర్చుకోవడానికి శివ్‌నాడార్, ఇతర కంపెనీ ఉద్యోగులు తనకు అపారమైన అవకాశాలిచ్చారని, అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని ఈ సందర్భంగా వినీత్ నాయర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement