breaking news
sivnadar
-
ఐటీ కంపెనీల కొనుగోలు కోసం ఎస్‌ఎన్‌ఎస్‌కే
న్యూఢిల్లీ: హెచ్‌సీఎల్ టెక్నాలజీ చైర్మన్, వ్యవస్థాపకుల్లో ఒకరైన శివ్‌నాడార్, టెక్నాలజీ రంగంలో ప్రసిద్ధ నిపుణుడు సంజయ్ కల్రాతో కలిసి ఒక ఇన్వెస్ట్‌మెంట్‌ను కంపెనీను ప్రారంభించనున్నారు. శివ్ నాడార్ అండ్ సంజయ్ కల్రా (ఎస్‌ఎన్‌ఎస్‌కే) అసోసియేట్స్ ఎల్ఎల్పీ పేరుతో ఏర్పాటైన ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో వీరిరువురు 50 కోట్ల డాలర్లు(రూ.3,316 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నారు.ఈ సంస్థ అమెరికా, భారత్‌కు చెందిన ఐటీ ప్రొడక్ట్, ప్లాట్‌ఫామ్ కంపెనీలను కొనుగోలు చేయనున్నది. -
హెచ్‌సీఎల్ బోర్డ్ నుంచి నాయర్ నిష్ర్కమణ
న్యూఢిల్లీ: ఐటీ రంగ కురు వృద్ధుడు వినీత్ నాయర్ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ బోర్డ్ నుంచి వైదొలిగారు. తాను ఏర్పాటు చేసిన ఫౌండేషన్, సంపర్క్‌కు మరింత సమయం కేటాయించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ శుక్రవారం తెలిపింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు, హెచ్‌సీఎల్ కార్పొరేషన్లకు ఇకపై సీనియర్ సలహాదారుగా నయ్యర్ తన సేవలందిస్తారు. ఇతరులకు ఆదర్శం సంస్థ పట్ల వినీత్ నాయర్ ఆలోచనలు, అంకిత భావం చాలా మంది కంపెనీ ఉద్యోగులకు స్ఫూర్తినిచ్చిందని, పెద్ద పెద్ద కలలు కనేందుకు తోడ్పాటునందించిందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్, చైర్మన్ శివ్ నాడార్ వ్యాఖ్యానించారు. ఈ సంస్థలో పనిచేయడానికి, ప్రయోగాలు చేయడానికి, నేర్చుకోవడానికి శివ్‌నాడార్, ఇతర కంపెనీ ఉద్యోగులు తనకు అపారమైన అవకాశాలిచ్చారని, అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని ఈ సందర్భంగా వినీత్ నాయర్ తెలిపారు.