దాసరికి నివాళులర్పించిన వైఎస్‌ జగన్‌ | ys jaganmohanreddy pays tribute to dasari | Sakshi
Sakshi News home page

దాసరికి నివాళులర్పించిన వైఎస్‌ జగన్‌

Jun 11 2017 2:11 PM | Updated on Apr 4 2018 9:31 PM

దివంగత సినీ దర్శకుడు దాసరి నారాయణరావు సంస్మరణ సభ ఆదివారం నగరంలోని ఇమేజ్‌ గార్డెన్‌లో జరిగింది.

హైదరాబాద్‌: దివంగత సినీ దర్శకుడు దాసరి నారాయణరావు సంస్మరణ సభ ఆదివారం నగరంలోని ఇమేజ్‌ గార్డెన్‌లో జరిగింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సభకు హాజరయ్యారు. దివంగత దాసరి విగ్రహానికి పూలమాల వేసి వైఎస్‌ జగన్‌ నివాళులర్పించారు. దాసరి సేవలను కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. విదేశాల్లో ఉండటంతో దాసరిని కడసారి వైఎస్‌ జగన్‌ చూడలేకపోయారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా దాసరి సంస్మరణ సభకు హాజరై నివాళులర్పించారు.

సినీ, రాజకీయ, మీడియా రంగాలలో అపారమైన కృషి చేసిన దాసరి నారాయణరావు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ శనివారం నగరంలోని ఫిలించాంబర్‌లోనూ సంస్మరణ సభ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement