బొజ్జాతారకం మృతి పట్ల వైఎస్ జగన్‌ సంతాపం | ys jaganmohanreddy pays condolences to bojja tarakam | Sakshi
Sakshi News home page

బొజ్జాతారకం మృతి పట్ల వైఎస్ జగన్‌ సంతాపం

Sep 17 2016 8:22 AM | Updated on Apr 3 2019 6:20 PM

బొజ్జాతారకం మృతి పట్ల వైఎస్ జగన్‌మోహన్ రెడ్ది తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు.

హైదరాబాద్: పౌర హక్కుల నేత, రచయిత, ప్రముఖ న్యాయవాది, దళిత ఉద్యమ నేత, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ బొజ్జాతారకం(77)మృతి పట్ల వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్ది తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాలుగేళ్లుగా బ్రెయిన్ కేన్సర్‌తో బాధపడుతున్న బొజ్జాతారకం శుక్రవారం రాత్రి 10.20 గంటలకు హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని తన స్వగృహంలో మృతి చెందారు.

శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సందర్శకుల కోసం ఆయన భౌతికకాయాన్ని ఉంచుతారు. 4 గంటలకు ఫిలింనగర్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement