పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు | Youngster to pour petrol during Vinayaka shoba yatra | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు

Sep 28 2015 1:57 PM | Updated on Sep 3 2017 10:08 AM

ఆర్థిక ఇబ్బందులతో యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.

రుద్రంపూర్(ఖమ్మం): ఆర్థిక ఇబ్బందులతో యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో సోమవారం జరిగింది. వివరాలు.. కొత్తగూడెం మున్సిపాలిటి పరిధిలోని పదో వార్డుకు చెందిన సానబోయిన వెంకట నగేష్(32) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో వినాయక శోభాయాత్రలో పాల్గొని ఉదయమే ఇంటికి చేరకున్న నగేష్ ఇంటి దగ్గర పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement