ఢిల్లీలో మరో నిర్భయ ఉదంతం.. ముగ్గురి అరెస్టు | yet another woman gang-raped in car in Delhi, three held | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో మరో నిర్భయ ఉదంతం.. ముగ్గురి అరెస్టు

Jun 16 2016 7:18 PM | Updated on Sep 4 2017 2:38 AM

ఢిల్లీలో మరో నిర్భయ ఉదంతం.. ముగ్గురి అరెస్టు

ఢిల్లీలో మరో నిర్భయ ఉదంతం.. ముగ్గురి అరెస్టు

సినిమా చూసి ఇంటికి తిరిగొస్తున్న 25 ఏళ్ల మహిళను కారులో అపహరించిన ముగ్గురు వ్యక్తులు.. కదులుతున్న కారులోనే ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.

సినిమా చూసి ఇంటికి తిరిగొస్తున్న 25 ఏళ్ల మహిళను కారులో అపహరించిన ముగ్గురు వ్యక్తులు.. కదులుతున్న కారులోనే ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఈ కేసులో ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ ఢిల్లీలోని వసంత విహార్ ప్రాంతంలో పీవీఆర్ ప్రియా థియేటర్‌లో సినిమా చూసి, స్నేహితురాలితో కలిసి తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆమెను అపహరించారు.

కారులో తనపై ముగ్గురూ అత్యాచారం చేసి, ఆ తర్వాత పూర్వీమార్గ్ వద్ద విసిరేసి వెళ్లిపోయారని ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఆమె కిడ్నాప్ కాగానే ఆమెతోపాటు ఉన్న స్నేహితురాలు పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. కారు నెంబరును ఆమె గుర్తుపెట్టుకోవడంతో నిందితులను పట్టుకోవడం సులభమైందని పోలీసులు తెలిపారు. బాధితురాలికి వైద్యపరీక్షలు చేయించగా అత్యాచారం జరిగిన విషయం కూడా నిర్ధారణ అయ్యిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement