భారీ అకౌంట్ల చోరీపై యాహూ ధ్రువీకరణ | Yahoo Expected to Confirm Data Breach of Several Hundred Million User Accounts: Report | Sakshi
Sakshi News home page

భారీ అకౌంట్ల చోరీపై యాహూ ధ్రువీకరణ

Published Thu, Sep 22 2016 7:05 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

భారీ అకౌంట్ల చోరీపై యాహూ ధ్రువీకరణ

భారీ అకౌంట్ల చోరీపై యాహూ ధ్రువీకరణ

వందల మిలియన్ యూజర్ అకౌంట్ల డేటా దొంగతనానికి పాల్పడినట్టు యాహూ కంపెనీ బహిరంగంగా ధ్రువీకరించబోతుంది.

వందల మిలియన్ యూజర్ అకౌంట్ల డేటా దొంగతనానికి పాల్పడినట్టు యాహూ కంపెనీ బహిరంగంగా ధ్రువీకరించబోతుంది. ఈ విషయంపై అధికార వర్గాలు ఓ ప్రకటన విడుదలచేశాయి. వందల మిలియన్ యాహూ యూజర్ అకౌంట్లు ఈ చోరీ బారిన పడినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. యూజర్ అకౌంట్ల హ్యాకింగ్ విషయం ఆగస్టులోనే బయటికి వచ్చింది. దాదాపు 200 మిలియ్ యాహూ యూజర్ అకౌంట్ ఆధారాలను పీస్ అనే హ్యకర్ అమ్మకానికి పెట్టినట్టు రిపోర్టు వచ్చాయి. సుమారు 1,07,000కు ఈ అకౌంట్లను రియల్డీల్ మార్కెట్ ప్లేస్లో హ్యాకర్ అమ్మకానికి పెట్టాడని వార్తలు గుప్పుమన్నాయి.  అయితే దీనిపై విచారణ కొనసాగుతుందని, చోరీపై యూజర్లు కంగారు పడాల్సిన పనిలేదని యాహూ భరోసా ఇచ్చింది. 
 
కానీ ప్రస్తుతం ఈ అకౌంట్ల చోరిని యాహూ సైతం ధ్రువీకరించేందుకు సిద్దమైంది. ఈ డేటాలో యూజర్ల పాస్వర్డ్లు, వ్యక్తిగత సమాచారం, ఇతర ఈమెయిల్ అడ్రస్లు ఉన్నాయి. ఇటీవలే యాహూ కోర్ వ్యాపారాలైన ఇంటర్నెట్ ఆస్తులను వెరిజోన్ సుమారు రూ.32,500 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కొనుగోలు ప్రక్రియ ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో ఈ హ్యాకింగ్ను యాహూ ధృవీకరిస్తున్నట్టు వెల్లడవడం, ఆ కంపెనీపై ఎలాంటి ప్రభావం చూపనుందోనని మార్కెట్ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ ఒప్పందం ముగిసే వరకు సీఈవో మారిస్సా మేయర్  రాజీనామా చేయబోతున్నారనే వార్తలు సైతం హల్ చల్ చేస్తున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement