టాయిలెట్ పాడైనందుకు రూ. కోటి పరిహారం! | Woman awarded 28,000 Euros after falling off her own toilet | Sakshi
Sakshi News home page

టాయిలెట్ పాడైనందుకు రూ. కోటి పరిహారం!

Oct 19 2014 4:25 PM | Updated on Aug 28 2018 5:25 PM

టాయిలెట్ పాడైనందుకు రూ. కోటి పరిహారం! - Sakshi

టాయిలెట్ పాడైనందుకు రూ. కోటి పరిహారం!

ఓ వృద్ధురాలు తన ఇంట్లోని టాయిలెట్ లో జారిపడినందుకు 28 వేల యూరోలు (రూ.90 లక్షలు) నష్ట పరిహారం పొందింది.

లండన్: ఓ వృద్ధురాలు తన ఇంట్లోని టాయిలెట్ లో జారిపడినందుకు 28 వేల యూరోలు (రూ.99 లక్షలు) నష్ట పరిహారం పొందింది. ఐర్లాండ్ లో ఇసాబెలా సుల్లివాన్ అనే వృద్ధురాలు తన ఇంటి టాయిలెట్ లో జారిపడటంతో కోర్టును ఆశ్రయించింది. తన ఇంట్లో టాయిలెట్ ను అమర్చే క్రమంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే జారిపడినట్లు ఫిటిషన్ లో స్పష్టం చేసింది.  దాంతో కుడి మోకాలికి తీవ్రంగా గాయమైనట్లు తెలిపింది.' కాంట్రాక్టర్ ఇంటి బాత్ రూంలోని టాయిలెట్ పనులు సరిగా చేయలేదు.  టాయిలెట్ పనులు చేసే సందర్భంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఆ కారణంగానే నేను జారిపడిపోయాను' అంటూ పేర్కొంది.

 

దీనిపై విచారణ చేపట్టిన సర్క్యూట్ సివిల్ కోర్టు 28,000 యూరోలను ఆమెకు నష్టపరిహారంగా ఇవ్వాలని స్పష్టం చేసింది.  టాయిలెట్ సరిగా లేకపోయిన కారణంగా ఆమె గాయమై బాధపడినందుకు 25,000 యూరోలు చెల్లించాలని, టాయిలెట్ పనులు తిరిగి చేయడానికి 2,500 యూరోలతోపాటు, అదనంగా మరో 350 యూరోలు చెల్లించాలని కోర్టు కాంట్రాక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement