ఆమె అందానికి ప్రపంచమే దాసోహం! | what an Aishwarya Rai beauty ! | Sakshi
Sakshi News home page

ఆమె అందానికి ప్రపంచమే దాసోహం!

May 24 2014 4:15 PM | Updated on Sep 2 2017 7:48 AM

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యరాయ్  ఫ్లయింగ్ కిస్

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యరాయ్ ఫ్లయింగ్ కిస్

ఆమె అందానికి ప్రపంచం దాసోహమైపోయింది. ఆ దక్షినాది అందగత్తె హాలీవుడ్లో జల్సా చేసింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ వేదికపై మరోసారి తళుక్కున మెరిసింది.

ఆమె అందానికి ప్రపంచం దాసోహమైపోయింది. ఆ దక్షినాది అందగత్తె   హాలీవుడ్లో జల్సా చేసింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ వేదికపై మరోసారి తళుక్కున మెరిసింది. ఇండియన్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ 67వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిపోయింది. ఆ ఈవెంట్లో ఐష్  గోల్డ్ కలర్ గౌను వేసుకుని ఏంజిల్‌లా దర్శనమిచ్చింది. ఆ పోతపోసిన అందాన్ని ప్రేక్షకులు అలాగే కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు.  బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఐశ్వర్యరాయ్ బాగా లావెక్కిందనే విమర్శలు ఎదుర్కొంది. ఆ విమర్శలకు ఐష్ చెక్ పెట్టేసింది. స్లిమ్గా తయారై  అందర్నీ ఆశ్చర్య పరిచింది.

2014 కాన్స్ రెడ్ కార్పెట్‌పై ఐష్‌ ఊహించిన దానికంటే ఎక్కువ అందంగా కనిపించి చూసేవారి మతులుపోగొట్టింది. ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా ఫ్లయింగ్ కిస్ ట్రయల్ కూడా నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా ఐశ్వర్యరాయ్ వదిలేసిన ఫ్లయింగ్ కిస్‌కు అంతా ముగ్దులైపోయారు. దీంతో ఐష్ రీఎంట్రీ అదిరిపోబోతోందని బాలీవుడ్ అంచనా వేస్తోంది. అభిమానులు ఐశ్వర్యరాయ్ రీఎంట్రీ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement