భారత్‌లో వివో తయారీ ప్లాంటు | Vivo manufacturing plant in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో వివో తయారీ ప్లాంటు

Apr 30 2015 2:11 AM | Updated on Aug 13 2018 3:53 PM

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీలో ఉన్న చైనా సంస్థ వివో.. భారత్‌లో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.

2017-18కల్లా సిద్ధం... జనరల్ మేనేజర్ ట్రేసీ చెన్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మొబైల్ ఫోన్ల తయారీలో ఉన్న చైనా సంస్థ వివో.. భారత్‌లో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. గుర్‌గావ్‌లో మూడు నాలుగేళ్లలో ప్లాంటు రెడీ అవుతుందని వివో ఇండియా జనరల్ మేనేజర్ ట్రేసీ చెన్ తెలిపారు. వివో ఎక్స్‌క్లూజివ్ షోరూంను ప్రారంభించేందుకు బుధవారం హైదరాబాద్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక్కడి మార్కెట్లో అపార అవకాశాలు ఉన్నాయని, తయారీ కేంద్రం ఏర్పాటు తమ కంపెనీకి ప్రాధాన్య అంశమని తెలిపారు.

నెల రోజుల్లో మరో 10 ఎక్స్‌క్లూజివ్ షోరూంలను తెరుస్తామని పేర్కొన్నారు. గతేడాది 4 కోట్ల ఫోన్లను చైనా వెలుపల కంపెనీ విక్రయించింది. అంతే మొత్తంలో ఫోన్లను ఏడాదిలో భారత్‌లో విక్రయిస్తామన్న అంచనాలున్నాయని చెప్పారు. 2014 డిసెంబరులో వివో భారత్‌లో ప్రవేశించింది.

మొబైల్ ఫోన్ల రంగంలో చైనాలో వివో మూడో స్థానంలో ఉంది. 20 ఏళ్ల అనుభవం కంపెనీ సొంతమని, అదే అనుభవంతో భారత్‌లో విభిన్న, వినూత్న ఫీచర్లతో ఫోన్లను అందిస్తామని వివరించారు. 4.75 మిల్లీ మీటర్ల మందంతో పలుచని స్మార్ట్‌ఫోన్ ఎక్స్5 మ్యాక్స్‌ను విడుదల చేసి ప్రపంచ దృష్టిని ఆకర్శించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement