'నిరూపిస్తే.. రాజీనామా చేస్తావా?' | vangaveeti radha krishna takes on kamineni srinivasa rao | Sakshi
Sakshi News home page

'నిరూపిస్తే.. రాజీనామా చేస్తావా?'

Aug 25 2015 1:02 PM | Updated on Jul 25 2018 4:07 PM

'నిరూపిస్తే.. రాజీనామా చేస్తావా?' - Sakshi

'నిరూపిస్తే.. రాజీనామా చేస్తావా?'

మంత్రి కామినేని శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తొత్తులా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ విమర్శించారు.

మచిలీపట్నం: ఏపీ మంత్రి కామినేని శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తొత్తులా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ విమర్శించారు. కొత్తమాజేరులో విష జ్వరాల కారణంగా 18 మంది చనిపోవడం బాధాకరమన్నారు. కామినేని మాత్రం ఎవరికీ ఏ రోగాలూ రాలేదని చెబుతున్నారని, సాక్ష్యాలతో సహా నిరూపిస్తామని, మంత్రి రాజీనామా చేస్తారా అంటూ రాధాకృష్ణ సవాల్ చేశారు.

విష జ్వరాల బాధితులకు సాయం చేయాలని మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ధర్నా వేదికపై రాధాకృష్ణ మాట్లాడారు. వైఎస్ జగన్ దొంగ దీక్షలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విమర్శించారని, తమ పార్టీ అధ్యక్షుడిపై అనవసర మాటలు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. దివంగత వైఎస్ఆర్, వంగవీటి రంగా అభిమానులు తిరగబడతారని అన్నారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడే నాయకుడు ఒక్క వైఎస్ జగన్ అని రాధాకృష్ణ చెప్పారు. మరో మంత్రి దేవినేని ఉమ పట్టిసీమ ప్రాజెక్టులో ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement