వామ్మో వీడు మామూలోడు కాదు! | uppal police arrest thief james | Sakshi
Sakshi News home page

వామ్మో వీడు మామూలోడు కాదు!

Oct 20 2015 2:17 PM | Updated on Mar 28 2019 8:28 PM

వామ్మో వీడు మామూలోడు కాదు! - Sakshi

వామ్మో వీడు మామూలోడు కాదు!

జల్సాలు, విలాసాలకు అలవాటుపడిన ఓ దొంగ పోలీసుల విచారణలో నిర్ఘాంతపరిచే వాస్తవం వెల్లడించాడు.

హైదరాబాద్: జల్సాలు, విలాసాలకు అలవాటుపడిన ఓ దొంగ పోలీసుల విచారణలో నిర్ఘాంతపరిచే వాస్తవం వెల్లడించాడు. తనకున్న ప్రమాదకరమైన రోగాన్ని పలువురికి వ్యాపింపజేసేందుకు ప్రయత్నించినట్టు తెలిపారు. దొంగతనంలో కేసులో జేమ్స్ అనే వ్యక్తిని ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో ఊహించని విషయాలు వెల్లడయ్యాయ. పగలు ఆటో ఆడుపుతూ, రాత్రిళ్లు దొంగతనాలకు పాల్పడుతున్నాడు. దొంగ సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు.

మహిళలను ట్రాప్ చేసి విచ్చలవిడిగా సెక్స్ కార్యకలాపాలు సాగించాడు. తనకు ఎయిడ్స్ ఉందని తెలిసి అతడు ఈ దారుణాలకు ఒడిగట్టినట్టు తెలుస్తోంది. 300 మంది అమ్మాయిలకు ఎయిడ్స్ వ్యాప్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నానని పోలీసుల విచారణలో తెలిపాడు. ఇప్పటివరకు 150 మంది అమ్మాయిలను అతడు మోసం చేసినట్టు తెలుస్తోంది. జేమ్స్ మోసాలను నిర్ధారించే పనిలో పడ్డారు పోలీసులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement