జకీర్ నాయక్‌కు ఎయిడ్స్? భార్య, ​కుమార్తెకు కూడా.. | Zakir Naik Dismisses AIDS Rumors: No Official Confirmation on Viral Social Media Claims | Sakshi
Sakshi News home page

జకీర్ నాయక్‌కు ఎయిడ్స్? భార్య, ​కుమార్తెకు కూడా..

Sep 10 2025 11:23 AM | Updated on Sep 10 2025 11:31 AM

Is Zakir Naik Suffering from Aids

న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ కు ఎయిడ్స్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఆయన మలేషియాలో ఒక ఆస్పత్రిలో చేరారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే అతని భార్య ఫర్హత్ నాయక్, కుమార్తె జిక్రా నాయక్‌లకు కూడా హెచ్ఐవీ పాజిటివ్ నిర్థారణ అయ్యిందంటూ ఇంటర్నెట్ లో పలు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు.

2016లో భారతదేశం నుండి పారిపోయిన నాయక్ తన న్యాయవాది ద్వారా తనకు ఎయిడ్స్‌ సోకిందన్న వార్తలను ఖండించారు. మనీలాండరింగ్, విద్వేషపూరిత ప్రసంగాలు, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం తదితర ఆరోపణలను ఎదుర్కొంటున్న జకీర్ నాయక్‌ ప్రస్తుతం మలేషియాలో తలదాచుకుంటున్నాడు. కాగా జకీర్‌ నాయక్‌ ఎయిడ్స్‌ బారినపడ్డాడనే వార్తను ఇప్పటివరకు, విశ్వసనీయ మీడియా సంస్థలు ఏవీ ధృవీకరించలేదు.
 

కాగా ఎయిర్‌టెల్‌ అందిస్తున్న ఏఐ ప్రోవెర్షన్‌ పెర్‌ప్లెక్సిటీని దీనిపై ప్రశ్నించగా ‘ఇప్పటివరకు విశ్వసనీయ అవుట్‌లెట్‌లు లేదా అధికారిక ప్రకటనల నుంచి  ధృవీకరణ లేకుండా సోషల్ మీడియా పోస్ట్‌లలో మాత్రమే ఈ అంశం ప్రసారం అవుతున్నట్లు కనిపిస్తోందని తెలిపింది. నాయక్ కుటుంబం/ఆసుపత్రి నుండి ఎటువంటి నిర్ధారణ లేదని వివరించింది. ఏఐ వేదిక ‘గ్రోక్‌’ కూడా ‘ఈ వాదన ధృవీకరణ కాలేదని తెలిపింది. జకీర్ నాయక్ లేదా అతని కుటుంబానికి హెచ్‌ఐవీ ఉందని విశ్వసనీయ వార్తాసంస్థ ఏదీ తెలియజేయలేదని పేర్కొంది.
 

మలేషియా వెబ్‌సైట్‌లు ఈ వాదనలను ఖండించాయి.  జకీర్‌ నాయక్‌ న్యాయవాది అక్బర్దిన్ అబ్దుల్ కదిర్ ఈ వార్తలను తోసిపుచ్చాడు. తనకు ప్రాణాంతక వ్యాధి నిర్ధారణ అయిందని,  క్లాంగ్ వ్యాలీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని వచ్చిన వాదనలను జకీర్‌ నాయక్ తన చట్టపరమైన ప్రతినిధి ద్వారా తిరస్కరించాడు. జకీర్‌ నాయక్ ఆరోగ్యంగా ఉన్నారని సదరు న్యాయవాది స్పష్టం చేశారు. కాగా జకీర్‌ నాయక్ నిర్వహిస్తున్న పీస్ టీవీని భారత్‌తో పాటు పలుదేశాలలో నిషేధించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement