న్యాయదేవత ఒడిలోనే కన్నుమూసిన జడ్జి | UP district judge dies in court after cardiac arrest | Sakshi
Sakshi News home page

న్యాయదేవత ఒడిలోనే కన్నుమూసిన జడ్జి

Sep 18 2015 4:12 PM | Updated on Sep 3 2017 9:35 AM

న్యాయదేవత ఒడిలోనే ఓ జడ్జి కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్ బులంద్శహర్ పట్టణంలో జిల్లా అడిషనల్, సెషన్స్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న జగదీశ్ సింగ్ (52) కోర్టులోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

లక్నో : న్యాయదేవత ఒడిలోనే ఓ జడ్జి కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్ బులంద్శహర్ పట్టణంలో జిల్లా అడిషనల్, సెషన్స్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న జగదీశ్ సింగ్ (52) కోర్టులోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

శుక్రవారం జిల్లా కోర్టు కార్యాలయంలోని తన ఛాంబర్లో విధుల్లో ఉండగా ఒక్కసారిగా తీవ్రమైన ఛాతీనొప్పి, శ్వాస తీసుకోలేని స్థితిలో ఆయన తన కుర్చీలోనే కుప్పకూలారు. వెంటనే గమనించిన ఉద్యోగులు జడ్జిని ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు చెప్పారు. జిల్లా పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టమ్కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement