ఢిల్లీ శాసనసభను రద్దు చేయాలని కేంద్రమంత్రి వర్గం సిఫారసు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభను రద్దుకు కేంద్రమంత్రి వర్గం సిఫారసు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమావేశం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.
ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్- ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు లెప్ట్నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఈ ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సిఫార్సు చేశారు. ప్రధాన పార్టీలు ఎన్నికలకే మొగ్గుచూపడంతో అసెంబ్లీ రద్దు అనివార్యమైంది.