టాటా ఏస్, బైక్ ఢీ.. ఇద్దరి మృతి | Two killed, Tata AS vehicle bike hitting | Sakshi
Sakshi News home page

టాటా ఏస్, బైక్ ఢీ.. ఇద్దరి మృతి

Aug 30 2015 1:46 PM | Updated on Sep 3 2017 8:25 AM

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో.. ఇద్దరు యువకులు మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

చివ్వెంల(నల్లగొండ): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో.. ఇద్దరు యువకులు మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన కృష్ణ(25), సైదులు(28) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఈరోజు బైక్‌పై అక్కనదేవి గూడెం గ్రామానికి వెళ్లి వస్తున్న సమయంలో బైక్ చివ్వెంల శివారుకు చేరుకునే సరికి ఎదురుగా సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్తున్న టాటా ఏస్ వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న కృష్ణ, సైదులు మృతిచెందగా.. చారీ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement