ఆ సినిమాపై నెటిజన్ల తిట్లవర్షం! | Twitterati review on Jab Harry Met Sejal | Sakshi
Sakshi News home page

ఆ సినిమాపై నెటిజన్ల తిట్లవర్షం!

Aug 9 2017 10:32 AM | Updated on Sep 17 2017 5:21 PM

ఆ సినిమాపై నెటిజన్ల తిట్లవర్షం!

ఆ సినిమాపై నెటిజన్ల తిట్లవర్షం!

బాలీవుడ్‌లో చాలాకాలంగా హిట్‌ సినిమాలు లేని సూపర్‌స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌..

బాలీవుడ్‌లో చాలాకాలంగా హిట్‌ సినిమాలు లేని సూపర్‌స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌. గత కొంతకాలంగా బాక్సాఫీస్‌ వద్ద పరాజయల పరంపర కొనసాగిస్తున్న కింగ్‌ ఖాన్‌ తాజా చిత్రం జబ్‌ హ్యారీ మెట్‌ సెజెల్‌. ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ రొమాంటిక్‌ లవ్‌స్టోరీని చూసేందుకు అటు షారుఖ్‌ ఫ్యాన్స్‌, ఇటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. సెన్సిబుల్‌ డైరెక్టర్‌గా పేరొందిన ఇంతియాజ్‌ అలీ తెరకెక్కించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే, ఈ సినిమా విడుదలైన నాటి నుంచి అటు విమర్శకులు, ఇటు ప్రేక్షకులు ఒకేరీతిలో మండిపడుతున్నారు. ఇదేం చెత్త సినిమా అంటూ దుయ్యబడుతున్నారు.

ఇక పుణెలో ఓ వ్యక్తి ఈ సినిమా చూస్తూ.. ఆ విసుగును తట్టుకోలేక ఏకంగా విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌కు 'కాపాడండి మేడం' అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ ఒక్కసారిగా వైరల్‌ అయింది. ఇదే ట్వీట్‌ కాదు.. ట్విట్టర్‌లో ఈ సినిమాపై సెటైర్లు, జోకులు, దూషణలు, చెత్త సినిమా అంటూ రివ్యూలు వెల్లువెత్తుతున్నాయి. 'జబ్‌ ఆడియెన్స్‌ మెట్‌ డిజాస్టర్‌' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. హ్యారీ మెట్‌ సెజల్‌ బాధితుల కోసం ప్రధానమంత్రి నిధులు విడుదల చేస్తున్నారా? లేదా? అని సెటైర్లు వేస్తున్నారు. ఇంతియాజ్‌ అలీకి స్కిప్ట్‌ గురించి ఇంతకూడా పట్టింపు లేకపోవడం ఏమిటని దుయ్యబడుతున్నారు. మీరూ ఓ లుక్‌ వేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement