టీటీడీ, పోలీసు అధికారుల మధ్య విభేదాలు మరోసారి వెలుగుచూశాయి.
సాక్షి, తిరుమల: టీటీడీ, పోలీసు అధికారుల మధ్య విభేదాలు మరోసారి వెలుగుచూశాయి. గురువారం రాత్రి గవర్నర్ నరసింహన్ సాక్షిగా జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు, ఏఎస్పీ ఎంవీఎస్ స్వామి మధ్య వాగ్వాదం నడిచింది. రాష్ర్ట గవర్నర్ నరసింహన్ గురువారం రాత్రి హంస వాహన దర్శనం కోసం వచ్చారు. వాహన మండపం వద్దకు గవర్నర్ కుటుంబ సభ్యులను తప్ప ఇతరులెవరినీ పంపకూడదని జేఈవో శ్రీనివాసరాజు అక్కడి విజిలెన్స్ సిబ్బందికి ఆదేశాలిచ్చారు. గవర్నర్‌తోపాటు పోలీసు ప్రోటోకాల్ అధికారిగా తిరుమల ఏఎస్పీ వాహన మండపానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా జేఈవో శ్రీనివాసరాజు అభ్యంతరం తెలిపారు. తాను గవర్నర్‌కు ప్రోటోకాల్ భద్రతలో భాగంగానే వచ్చానని ఏఎస్పీ బదులిచ్చారు. ఇద్దరి మధ్య కొంత సమయంపాటు వాగ్వాదం నడిచింది. ఈ ఘటనలో ఏఎస్పీ స్వామికి పోలీసు ఉన్నతాధికారులు బాసటగా నిలిచారు. తమ తడాఖా ఏమిటో చూపించాలని ఒకరిద్దరు పోలీసు ఉన్నతాధికారులు బహిరంగంగానే టీటీడీపై కారాలు మిరియాలు నూరుతున్నారు.