టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే 1100 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వైఎస్ఆర్సీపీ తెలంగాణ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆరోపించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే 1100 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వైఎస్ఆర్సీపీ తెలంగాణ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆరోపించారు. రుణమాఫీ చేయకపోవడం వల్లే రైతాంగ సంక్షోభం నెలకొందని ఆయన అన్నారు.
వెంటనే రుణమాఫీ చేయడంతో పాటు కరువు మండలాలను ప్రకటించాలని ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ ఏజెన్సీ ప్రాంతంలో విషజ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. పెండింగులో ఉన్న హౌసింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు.