బాలికపై అత్యాచారం, హత్య.. ఇద్దరికి ఉరిశిక్ష | Tripura men given death sentence for raping, killing minor girl | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారం, హత్య.. ఇద్దరికి ఉరిశిక్ష

Sep 23 2015 5:13 PM | Updated on Jul 28 2018 8:53 PM

బాలికపై అత్యాచారం, హత్య.. ఇద్దరికి ఉరిశిక్ష - Sakshi

బాలికపై అత్యాచారం, హత్య.. ఇద్దరికి ఉరిశిక్ష

ఓ బాలికను అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో త్రిపురలో ఇద్దరికి ఉరిశిక్ష పడింది.

అగర్తలా: త్రిపురలో ఓ బాలికను అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో ఇద్దరికి ఉరిశిక్ష పడింది. ఉత్తర త్రిపురలోని కమల్పూర్ అడిషనల్ సెషన్స్ జడ్జి అరిందమ్ పాల్ ఈ మేరకు తీర్పునిచ్చారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి.

గతేడాది రషీద త్రిపుర (25), జాని త్రిపుర (20) అనే గిరిజన యువకులు 12 ఏళ్ల గిరిజన బాలికను అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశారు. వీరిద్దరూ ఆ అమ్మాయిని సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు. నిందితులు నేరం చేసినట్టు కోర్టులో రుజువు కావడంతో ఉరిశిక్షతో పాటు 20 వేల రూపాయలు చొప్పున జరిమానా విధించింది.

Advertisement
 
Advertisement
Advertisement