ఇక రైలు తలుపులు మూసుకుపోతాయి! | train doors automatically closed | Sakshi
Sakshi News home page

ఇక రైలు తలుపులు మూసుకుపోతాయి!

Jul 8 2014 1:23 PM | Updated on Sep 2 2017 10:00 AM

ఇక రైలు తలుపులు మూసుకుపోతాయి!

ఇక రైలు తలుపులు మూసుకుపోతాయి!

తలుపులు వాటంతట అవే మూసుకుపోయే సౌకర్యం రైళ్లలో అందుబాటులోకి రానుంది.

న్యూఢిల్లీ: తలుపులు వాటంతట అవే మూసుకుపోయే సౌకర్యం రైళ్లలో అందుబాటులోకి రానుంది. బుల్లెట్, హైస్పీడ్ రైళ్లలో అందుబాటులో ఉన్న ఈ సౌకర్యం మన రైళ్లలోనూ రానుంది. ఈ మేరకు 2014-15 రైల్వే బడ్జెట్ లో ప్రతిపాదించారు.

ప్రధాన రైళ్లు, సబర్బన్ మార్గాల్లో రైలు బయల్దేరే ముందే తలుపులు మూసుకుపోయేలా వ్యవస్థ ఏర్పాటుచేస్తామని రైల్వే మంత్రి సదానంద గౌడ తెలిపారు. స్టేషన్ వచ్చినప్పుడు వాటంతట అవే తలుపులు తెరుకుంటాయి. సమయాన్ని ఆదా చేసేందుకు ప్రధాన మెట్రో నగరాలను అనుసంధానిస్తూ హైస్పీడ్ రైలును ప్రవేశపెడతామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement